వ్యభిచార ముఠా అరెస్ట్ | 4 persons arrested in prostitution case | Sakshi
Sakshi News home page

వ్యభిచార ముఠా అరెస్ట్

Mar 5 2015 6:04 PM | Updated on Sep 4 2018 5:16 PM

వ్యభిచార ముఠా అరెస్ట్ - Sakshi

వ్యభిచార ముఠా అరెస్ట్

నగరంలోని ఓ ఇంటిలో గుట్టు చప్పుడుకాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది.

హైదరాబాద్: నగరంలోని ఓ ఇంటిలో గుట్టు చప్పుడుకాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. వ్యభిచారానికి పాల్పడుతున్న బంగ్లాదేశ్‌కు చెందిన ఏడుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలో గురువారం తనిఖీలు నిర్వహించిన స్పెషల్ టాక్స్‌పోర్సు పోలీసులు ఐదుగురు విటులను అరెస్ట్ చేశారు. వివరాలు.. అంబర్‌పేటలోని చైనాంబర్‌లో ఒక ఇంటిపై దాడి చేసిన పోలీసులు ఇద్దరు మహిళలను, ఒక వృద్ధ విటుడిని అదుపులోకి తీసుకున్నారు.

అదేవిధంగా నల్లకుంటలోని బాయమ్మ వీధిలో వ్యభిచార గృహంపై దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు ఒంగ్లాదేశ్‌కు చెందిన మహిళలను, నలుగురు వృద్ధ విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విటులను అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బంగ్లాదేశ్‌కు చెందిన మహిళలపై ఇండియన్ పాస్‌పోర్టు ఎంట్రీయాక్టు-1929 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
(అంబర్‌పేట)

Advertisement
 
Advertisement
Advertisement