2017 హజ్‌ షెడ్యూల్‌ విడుదల | 2017 Haj Schedule Released | Sakshi
Sakshi News home page

2017 హజ్‌ షెడ్యూల్‌ విడుదల

Aug 9 2017 2:39 AM | Updated on Sep 4 2018 5:29 PM

2017 హజ్‌ షెడ్యూల్‌ విడుదల - Sakshi

2017 హజ్‌ షెడ్యూల్‌ విడుదల

కేంద్ర హజ్‌ కమిటీ ఇరు రాష్ట్రాల 2017 హజ్‌ యాత్రికుల షెడ్యూల్‌ను విడుదల చేసిందని తెలంగాణ రాష్ట్ర హజ్‌ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్‌ఏ షుకూర్‌ తెలిపారు.

► 13 నుంచి తెలంగాణ యాత్రికులు .. 19 నుంచి ఆంధ్రా యాత్రికులు
► హజ్‌ కమిటీ ప్రత్యేక అధికారి షుకూర్‌ వెల్లడి


సాక్షి,హైదరాబాద్‌: కేంద్ర హజ్‌ కమిటీ ఇరు రాష్ట్రాల 2017 హజ్‌ యాత్రికుల షెడ్యూల్‌ను విడుదల చేసిందని తెలంగాణ రాష్ట్ర హజ్‌ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్‌ఏ షుకూర్‌ తెలిపారు. మంగళవారం హజ్‌ కమిటీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... ఆగస్టు 13 నుంచి 18 వరకు తెలంగాణ యాత్రికులు, ఆగస్టు 19 నుంచి 22 వరకు ఆంధ్రా యాత్రికులు హజ్‌ యాత్రకు వెళ్లనున్నట్లు తెలిపారు. నాంపల్లి హజ్‌హౌస్‌లో ఈ నెల 11 నుంచి హజ్‌ క్యాంప్‌ ప్రారంభమవుతుందన్నారు.

హజ్‌కు ఎంపికైన ఇరు రాష్ట్రాల యాత్రికులకు వారు వెళ్లే తేదీ వారి మొబైల్‌ఫోన్‌కు ఎస్సెమ్మెస్‌ వస్తుందన్నారు. అలా రానివారు హజ్‌ కమిటీ కార్యాలయానికి ఫోన్‌ చేసి కవర్‌ నంబర్‌ చెబితే ప్రయాణ తేదీ తెలుస్తుందన్నారు. ప్రయాణ తేదీ నుంచి 48 గంటల ముందు యాత్రికులు హజ్‌ హౌస్‌లో రిపోర్టు చేయాలని సూచించారు. యాత్రికులు బ్యాంక్‌లో జమ చేసిన ఒరిజినల్‌ రశీదు, యాత్ర ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని కోరారు. కర్ణాటకలోని నాలుగు జిల్లాలకు చెందిన యాత్రికులతోపాటు..తెలంగాణ, ఆంధ్రా యాత్రికులు కూడా హైదరాబాద్‌ నుంచే హజ్‌ యాత్రకు బయల్దేరనున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement