200 ఏళ్లనాటి వెండి నాణేలు లభ్యం | 200 year old silver coins available | Sakshi
Sakshi News home page

200 ఏళ్లనాటి వెండి నాణేలు లభ్యం

Oct 16 2014 2:43 AM | Updated on Sep 2 2017 2:54 PM

200 ఏళ్లనాటి వెండి నాణేలు లభ్యం

200 ఏళ్లనాటి వెండి నాణేలు లభ్యం

మహబూబ్‌నగర్ జిల్లా మల్దకల్ మండలం నీలిపల్లి గ్రామంలో సుమారు 200ఏళ్ల నాటి సుమారు రెండువేల పైచిలుకు వెండినాణేలు

మల్దకల్: మహబూబ్‌నగర్ జిల్లా మల్దకల్ మండలం నీలిపల్లి గ్రామంలో సుమారు 200ఏళ్ల నాటి సుమారు రెండువేల పైచిలుకు వెండినాణేలు బుధవారం లభ్యమయ్యాయి. నీలిపల్లి గ్రామం లోని పాఠశాలలో అదనపు తరగతుల నిర్మాణం కోసం తవ్వుతుండగా.. రెండు వెడల్పు కుండల్లో రెండువేల పైచిలుకు వెండి నాణేలు బయల్పడ్డాయి.

  ఒక్కో నాణెం 12 గ్రాములు ఉంది. వాటిని 1840-70 కాలం నాటి ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన నాణేలుగా గుర్తించారు. అయితే, రెండు కుండల్లో దొరికిన నాణేలను కొందరు గ్రామస్తులు పంచుకున్నారని, వాటిని రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement