కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో వేర్వేరు ఘటనల్లో పింఛన్ల జాబితాలో పేరులేదనే బెంగతో ఇద్దరు వృద్ధులు హఠాన్మరణం చెందారు.
వస్తుందో, రాదోనని ఇద్దరు హఠాన్మరణం
నెట్‌వర్క్: కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో వేర్వేరు ఘటనల్లో పింఛన్ల జాబితాలో పేరులేదనే బెంగతో ఇద్దరు వృద్ధులు హఠాన్మరణం చెందారు. అయితే, ఈ ఇద్దరి పేర్లు జాబితాలో ఉన్నాయి. కరీంనగర్‌జిల్లా కమలాపూర్ మండలంలో గూనిపర్తికి చెందిన ముత్యాల ఆగయ్య (76) శనివారం తన ఇంటి సమీపంలో తెలిసినవారితో మాట్లాడుతుండగా.. అక్కడికి అర్హుల జాబితాతో వీఆర్‌వో వచ్చారు. అందులో తన పేరు లేదని తెలిసి మనోవేదనతో ఇంట్లోకి వెళ్లారు. మరుక్షణమే కుప్పకూలి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం దాతర్‌పల్లికి చెందిన కె. బాలయ్య (80)కు పింఛనే జీవనాధారం. ఆయన భార్య అనసూర్య పక్షవాతంతో మంచంపట్టింది. శుక్రవారం పింఛన్ అర్హుల జాబితాలో పేరులేదని చెప్పడంతో మనస్తాపానికి గురయ్యాడు. అర్ధరాత్రి గుండెపోటుతో మరణించాడు. కాగా, పింఛన్ల జాబితాలో పేరు ఉందని తహశీల్దార్ సోమ్లానాయక్ తెలిపారు.