18 మంది బాలకార్మికులకు విముక్తి | 18 Child labour rescued | Sakshi
Sakshi News home page

18 మంది బాలకార్మికులకు విముక్తి

Aug 25 2015 6:40 PM | Updated on Mar 28 2018 11:11 AM

ఓ కంపెనీలో పని చేస్తున్న 18 మంది బాల కార్మికులకు రెవెన్యూ అధికారులు విముక్తి కల్పించారు.

ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి) : ఓ కంపెనీలో పని చేస్తున్న 18 మంది బాల కార్మికులకు రెవెన్యూ అధికారులు విముక్తి కల్పించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని మంగళ్లపల్లి గ్రామంలో ఉన్న రోహిణీ ఫీడ్ కంపెనీలో రెవెన్యూ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 18 మంది బాలకార్మికులు పనిచేస్తుండటంతో వారిని రెస్క్యూ హోంకు తరలించి కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. బాధితులంతా బీహర్‌కు చెందిన వారిగా సమాచారం.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement