ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ కైవసం | BRS Sudharshan Reddy Elected As Ibrahimpatnam Municipal Chairmen | Sakshi
Sakshi News home page

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ కైవసం

Apr 4 2026 1:10 PM | Updated on Apr 4 2026 1:28 PM

BRS Sudharshan Reddy Elected As Ibrahimpatnam Municipal Chairmen

సాక్షి, ఇబ్రహీంపట్నం: తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు మరో ఘన విజయం దక్కింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఇ‍బ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్‌గా సుదర్శన్‌ రెడ్డి ఎన్నికయ్యారు. వైఎస్‌ చైర్‌పర్సన్‌గా బీజేపీ కౌన్సిలర్‌ శ్యామలను ఎన్నుకున్నారు. ఇక, చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియను కాంగ్రెస్‌ దూరంగా ఉంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ వాకౌట్‌ చేసింది.

ఇక, అంతకుముందు.. మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎరిగింది. క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్‌గా బీఆర్ఎస్ కౌన్సిలర్ గొడిశెల సంధ్యారాణి ఎన్నికయ్యారు. ఇ‍క్కడ బీఆర్ఎస్, సీపీఐ మైత్రితో అధికార కాంగ్రెస్ పార్టీకి చెక్‌ పడింది. ఇదిలా ఉండగా..  ఖానాపూర్‌ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా బీజేపీ కౌన్సిలర్‌ మౌనిక ఎన్నికయ్యారు. ఇక్కడ వైఎస్‌ చెర్మెన్‌గా బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ మహ్మద్‌ షోయబ్‌ ఎన్నికయ్యారు. 

రాష్ట్రంలో వాయిదా పడుతూ వస్తున్న ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి, ఖానాపూర్‌ మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికల ప్రక్రియ నేడు జరిగింది. ఈ సందర్భంగా ఈ మూడు మున్సిపాలిటీల్లో శనివారం ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, మధ్యాహ్నం 12:30 గంటలకు ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో క్యాతనపల్లి మున్సిపాలిటిలో మున్సిపల్ చైర్ పర్సన్‌గా బీఆర్ఎస్ కౌన్సిలర్ గొడిశెల సంధ్యారాణి ఎన్నిక కాగా.. వైస్ చైర్ పర్సన్‌గా సీపీఐ కౌన్సిలర్ మిట్టపల్లి సరితను ఎన్నుకున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement