20 గుంటల భూమిలో 8 స్తంభాలు.. నాగలి ఎలా తిరుగుతుంది? | Elderly Woman Alleges Illegal Electric Poles In Farmland Mallapur Pleads For Help | Sakshi
Sakshi News home page

20 గుంటల భూమిలో 8 స్తంభాలు.. నాగలి ఎలా తిరుగుతుంది?

Apr 4 2026 12:04 PM | Updated on Apr 4 2026 12:43 PM

Elderly Woman Alleges Illegal Electric Poles In Farmland Mallapur Pleads For Help

జగిత్యాల జిల్లా: మల్లాపూర్‌కు చెందిన వృద్ధురాలు ముష్కరి గంగామణి గ్రామసభలో నా 20 గుంటల వ్యవసాయ భూమిలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 8 విద్యుత్‌ స్తంభాలు వేసిండ్రు అంటూ తన ఆవేదనను వెల్లడిస్తూ ట్రాన్స్‌కో ఏఈ వినీత్‌రెడ్డిని వేడుకుంటున్న కథనం శుక్రవారం ‘సాక్షి’లో ‘‘కాల్మొక్త సారూ.. కనికరించండి’ శీర్షికన ప్రచురితమైంది. 

ఈ కథనాన్ని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఎక్స్‌ వేదికగా డిప్యూటీ సీఎం, రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు ట్విట్‌ చేశారు. విద్యుత్‌శాఖ మంత్రి భట్టి గారూ.. ఈ సమస్యకు పరిష్కారం చూపండి అంటూ 20 గుంటల భూమిలో ఇష్టరీతిన స్తంభాలు వేస్తే సాగుకి నాగలి ఎట్టా తిరుగుతది? పంట ఎట్ల పండుతది? అంటూ డిప్యూటీ సీఎం బట్టితో పాటు మాజీ మంత్రి కేటీఆర్‌కు, సీఎంవో కార్యలయానికి పోస్టు చేశారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement