‘బ్లాక్‌ కాఫీ డీజే నైట్‌’లో డ్రగ్స్‌ | Eagle Team Raids Quake Arena Pub, 8 Tested Positive For Drugs At Black Coffee Event In Kondapur | Sakshi
Sakshi News home page

‘బ్లాక్‌ కాఫీ డీజే నైట్‌’లో డ్రగ్స్‌

Apr 4 2026 11:00 AM | Updated on Apr 4 2026 11:44 AM

 Eagle Team Raids Quake Arena Pub - 8Tested Positive for Drugs

హైదరాబాద్‌: సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని కొండాపూర్‌లో ఉన్న ‘క్వేక్‌ ఎరీనా పబ్‌’లో గురువారం అర్ధరాత్రి ఈగల్‌ బృందాలు దాడులు చేశాయి. అంతర్జాతీయ కళాకారుడితో ‘బ్లాక్‌ కాఫీ’ పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఈవెంట్‌లో పాల్గొన్న ఎనిమిది మంది మాదకద్రవ్యాలు సేవించి చిక్కారు. వీరిపై గచ్చిబౌలి పోలీస్టేషన్‌లో ఎన్డీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి ఈగల్‌ అధికారులకు అప్పగించింది. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న స్పెయిన్‌ కళాకారులు అలెగ్జాండర్, క్వేక్‌ అరేనా పబ్‌ డీజే కేవీలకు నెగెటివ్‌ వచ్చినట్లు ఈగల్‌ శుక్రవారం ప్రకటించింది.

 గురువారం రాత్రి ప్రారంభమైన ‘బ్లాక్‌ కాఫీ’లో పాల్గొన్న కొందరు డ్రగ్స్‌ వినియోగిస్తున్నట్లు ఈగల్‌కు సమాచారం అందింది. దీంతో ఆ విభాగంలోని టాస్‌్కఫోర్స్, సైబరాబాద్‌ నార్కోటిక్స్‌ పోలీసుస్టేషన్, గచ్చిబౌలి పోలీసులతో కూడిన బృందాలు రాత్రి 12 గంటల ప్రాంతంలో దాడులు చేశారు. 64 మంది అనుమానితులను గుర్తించి వీరి లాలాజలం, మూత్రం నమూనాలు సేకరించి పరీక్షలు చేయగా.. తొలుత నలుగురికి, ఆ తర్వాత మరో నలుగురిని పాజిటివ్‌ వచ్చింది. దీంతో వీళ్లు గంజాయి, మెతాంఫెటమైన్, బెంజోడియాజిపిన్‌ సేవించినట్లు గుర్తించారు. వీరిపై గచ్చిబౌలి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇందులో ఎన్డీపీఎస్‌ యాక్ట్‌తో పాటు బీఎన్‌ఎస్‌లోని సెక్షన్లను జోడించారు.

ఈ కేసులో నిందితులుగా ఉన్న మోనిష్‌ ఉమేష్‌ (వ్యాపారి), పృథి్వరాజ్‌ (కాంట్రాక్టర్‌), అభిషేక్‌ (సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌) రిషబ్‌ (వ్యాపారి), హరిత్‌ (సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌), రితేష్‌ (మొబైల్‌ దుకాణం నిర్వాహకుడు), జ్యోతిరాదిత్య,  ఆకెళ్ల హరిత సారంగ్‌లను ఎర్రగడ్డలోని ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించి వారి రక్తనమూనాలను వైద్యుల ద్వారా సేకరించారు. కాగా.. ఈ కేసులో 8 మంది నిందితులు ఈగల్‌ ఎదుట స్వచ్ఛందంగా డ్రగ్స్‌ వినియోగాన్ని అంగీకరించారు. నిందితులకు గచి్చ»ౌలి పోలీసులు శుక్రవారం వారి తల్లిదండ్రులు/సంరక్షకుల్ని పిలిచి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. వీరికి గతంలో డ్రగ్స్‌ తీసుకున్న చరిత్ర లేకపోవడంతో నోటీసులు జారీ చేసి విడిచిపెట్టారు. డీ–అడక్షన్‌ ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement