చైర్మన్ సుదర్శన్‌రెడ్డి ఇబ్రహీంపట్నం, శ్యామల వైస్ చైర్ పర్సన్ , గొడిసల సంధ్యారాణి చైర్‌పర్సన్ క్యాతనపల్లి , మిట్టపల్లి సరిత వైస్ చైర్ పర్సన్
ఎట్టకేలకు ముగిసిన మున్సిపల్ చైర్మన్ ఎన్నిక
ఖానాపూర్‌లో ఎన్నిక నేటికి వాయిదా
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/ఇబ్రహీంపట్నం/ఖానాపూర్: పెండింగ్‌లో ఉన్న మూడు మున్సిపాలిటీల్లో రెండుచోట్ల చైర్మన్ ఎన్నిక ముగిసింది. ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి పీఠాలను బీఆర్‌ఎస్ కైవసం చేసుకోగా, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బీఆర్‌ఎస్ కౌన్సిలర్ గొడిసల సంధ్యారాణి, వైస్‌చైర్‌పర్సన్‌గా సీపీఐ కౌన్సిలర్ మిట్టపల్లి సరిత ఎన్నికయ్యారు. శనివారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 22 మంది కౌన్సిలర్లకు గాను బీఆర్‌ఎస్, సీపీఐకి చెందిన 14మంది హాజరయ్యారు. కోరం ఉండడంతో ఎన్నిక సజావుగా పూర్తయింది.
ఏడుగురు కాంగ్రెస్, ఓ స్వతంత్ర అభ్యర్థి, ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉన్న మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ ఎన్నికకు దూరంగా ఉన్నారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కోవ లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, సీపీఐ నాయకులతో కలసి విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ చైర్‌పర్సన్ పీఠం గెలుచుకోకుండా మంత్రి వివేక్ కుట్ర చేసి జైలుకు పంపారని ఆరోపించారు. చెన్నూరు ఎమ్మెల్యే, మంత్రి వివేక్ స్పందిస్తూ తాము ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక జరిగేలా చూస్తే రెండు సార్లు బీఆర్‌ఎస్ నాయకులే ఆటంకం కలిగించారని తెలిపారు.
ఇబ్రహీంపట్నంలో...
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్–చైర్‌పర్సన్ పీఠం ఎన్నికపై చిక్కుముడి వీడి పోయింది. 50 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత శనివారం ఎట్టకేలకు ఎన్నిక ప్రక్రి య ముగిసింది. నాటకీయ పరిణామాల మధ్య రెండుసార్లు ఎన్నికల ప్రక్రియ వాయిదాపడటం.. వివాదం కోర్టుకు చేరడం తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు శనివారం భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎన్నిక నిర్వహించారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు, ఎక్స్‌అఫీíÙయో సభ్యుడు, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సమావేశం నుంచి వాకౌట్ చేశారు. బీఆర్‌ఎస్‌కు చెందిన టేకుల సుదర్శన్‌రెడ్డి చైర్మన్‌గా, బీజేపీకి చెందిన ముత్యాల శ్యామల వైస్–చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.
ఖానాపూర్‌లో వాయిదా
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మూడోసారి వాయిదా పడింది. గతంలో బీఆర్‌ఎస్, బీజేపీ కౌన్సిలర్లు గైర్హాజరవడంతో కోరం లేక అధికారులు ఎన్నిక నిర్వహించలేదు. తాజాగా శనివారం మూడోసారి చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో చేతులెత్తే క్రమంలో కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడున్న అధికారులతో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కాంగ్రెస్ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. అధికారులు మొదట సంతకాల సేకరణ చేపట్టగా, కొందరు కౌన్సిలర్లు కాంగ్రెస్ కౌన్సిలర్ సత్యంకు మద్దతుగా చేతులు ఎత్తారు. అయితే తాము సంతకాలు సేకరిస్తున్నామని, తర్వాత ఓటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. తర్వాత బీజేపీ అభ్యర్థి అంకం మౌనిక పేరును అధికారులు ముందుగా ప్రతిపాదించారు. దీంతో వెడ్మ బొజ్జు అభ్యంతరం తెలిపారు. దీంతో గందరగోళం నెలకొంది. బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు బారికేడ్లు తోసుకుంటూ కార్యాలయంలోకి వెళ్లారు. ఈ క్రమంలో బీజేపీ కౌన్సిలర్ సత్యవతి స్పృహ కోల్పోవడంతో అధికారులు ఎన్నికలను ఆదివారానికి వాయిదా వేశారు. సత్యవతిని ఆస్పత్రికి తరలించారు.
‘వీ లవ్ యూ వివేక్’..: బాల్క సుమన్
రామకృష్ణాపూర్: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక అనంతరం మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని ఉద్దేశిస్తూ..‘వీ లవ్ యూ వివేక్.. గతంలో మంత్రి నన్ను తమ్ముడిగా భావిస్తున్నానని చెప్పారు. ఇప్పుడు తమ్ముడిగానే నేనొక విజ్ఞప్తి చేస్తున్న. క్యాతనపల్లి అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలి’అని వ్యాఖ్యానించారు.
శనివారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలోని తన నివాసంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్షి్మతో కలిసి సుమన్ విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలప్పుడు రాజకీయాలుండాలి తప్ప ఆ తర్వాత ప్రజల అభివృద్ధి కోసం అన్ని పార్టీ లు కలిసికట్టుగా పని చేయాల్సిన అవస రం ఉందన్నారు. సమావేశంలో మాజీ ఎ మ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, మాజీ ఎ మ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, మాజీ మేయర్ రవీందర్‌సింగ్, ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, సీపీఐ రాష్ట్ర కా ర్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్, రామడుగు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


