ఈ చిత్రంలో సైకిల్ తొక్కుతూ కనిపిస్తున్న ఇతని పేరు కృష్ణ అగర్వాల్(32). హైదరాబాద్ ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
రంగారెడ్డి : ఈ చిత్రంలో సైకిల్ తొక్కుతూ కనిపిస్తున్న ఇతని పేరు కృష్ణ అగర్వాల్(32). హైదరాబాద్ ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సైకిల్‌పై తిరగడమంటే మహా సరదా. 50 కి.మీ పరిధిలో ఎటు వెళ్లాలన్నా అతని వాహనం ఇదే.
అయితే ఈసారి 100 కి.మీ దూరం వెళ్లి రావాలనుకున్నాడు. నెట్‌లో సెర్చ్ చేయగా ధారూరు మండలంలోని కోట్‌పల్లి ప్రాజెక్టు (102 కి.మీ) కనిపించింది. అంతే శనివారం ఉదయం 5 గంటలకు సైకిల్‌పై తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. మధ్యాహ్నం 12.15 గంటలకు కోట్‌పల్లి ప్రాజెక్టు వద్దకు చేరుకున్నాడు. అక్కడ గంటసేపు సేదదీరిన తర్వాత 1.15 గంటలకు నగరానికి తిరుగుపయనమయ్యాడు. ఒక్క రోజులో సైకిల్‌పై 200 కిలోమీటర్ల దూరం వెళ్లాలన్న లక్ష్యంతోనే కోట్‌పల్లి ప్రాజెక్టుకు వచ్చానని, రాత్రి 8 గంటల వరకు నగరానికి చేరుకోవాలనీ తెలిపాడు. మరోసారి సైకిల్‌పై 300 కి.మీ దూరం వెళతానని ఉత్సాహంగా చెబుతూ ముందుకు కదిలాడు.