1.3 కిలోల బంగారం స్వాధీనం | 1.3 kgs gold seized in shamshabad airport | Sakshi
Sakshi News home page

1.3 కిలోల బంగారం స్వాధీనం

Jun 15 2015 8:24 AM | Updated on Sep 3 2017 3:47 AM

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం సింగపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుల లగేజీనీ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో పూణేకిచెందిన ప్రయాణికుల వద్ద 1.3 కిలోల బంగారాన్ని అధికారులు గుర్తించారు. బంగారానికి సంబంధించిన ఎటువంటి రసీదులు లేకపోవడంతో  వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  ప్రయాణికుల వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement