breaking news
-
అప్పుల రాష్ట్రంగా మార్చారు!
సాక్షి, హైదరాబాద్: ‘సంపదతో కూడిన మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే రూ.5 లక్షల కోట్ల అప్పు చేసి అప్పుల రాష్టంగా మార్చారు. కృష్ణా, గోదావరి నుంచి ఓ చుక్క నీటినైనా తెచ్చారా? ఒక్క ఎకరాకైనా అదనంగా నీళ్లు ఇచ్చారా? రూ.లక్షల కోట్లు వృథా చేశారు. ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా? ఒక్క ఇందిరమ్మ ఇళ్లయినా ఇచ్చారా? రాష్ట్రంలో పదేళ్లు విధ్వంసం చేశారు. స్వేచ్ఛ లేకుండా చేశారు. ప్రజలు స్వేచ్ఛ ఇచ్చేటువంటి తీర్పునిచ్చారు అని గవర్నర్ ప్రసంగంలో చెప్పాం’అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత 55 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ విమర్శలు చేస్తుండగా భట్టి విక్రమార్క పలుమార్లు అడ్డుపడి మాట్లాడారు. ‘మనం తెలంగాణ శాసనసభలో చర్చిస్తున్నాం. 2014 జూన్ 2 నుంచి జరిగిన పనుల గురించే మాట్లాడుకోవాలి’అని చెప్పారు. 55 ఏళ్ల ఉమ్మడి రాష్ట్ర పాలన వద్దనే ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నామన్నారు. నాడు కాంగ్రెస్ మంత్రులందరూ రాజీనామా చేసి ప్రత్యేక రాష్ట్రం కావాలని తీర్మానం చేశారని, కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించారని చెప్పారు. పార్లమెంట్లో సరైన బలం లేకపోయినా కాంగ్రెస్ మిగిలిన పార్టీలను ఒప్పించి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందన్నారు. చర్చ తొలిరోజే దాడితో ప్రసంగాన్ని మొదలుపెడితే ప్రభుత్వం తగిన రీతిలో సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్ పాలనలోనే ఆర్డబ్ల్యూఎస్ పథకం కింద 70–80 శాతం ప్రాంతాలకు తాగునీళ్లు ఇచ్చామని భట్టి గుర్తు చేశారు. మిషన్ భగీరథ కోసం రూ.43 వేల కోట్లు్ల ఖర్చు పెట్టి నీళ్లు ఎక్కడ ఇచ్చారని కేటీఆర్‌ను ప్రశ్నించారు. నల్లగొండకు 2014కు ముందు నీళ్లు రాలేదా? అని పేర్కొన్నారు. సీఎం ఎంపిక హైకమాండ్‌దే: మంత్రి దామోదర కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించినప్పుడు సీఎం ఎంపిక బాధ్యతను హైకమాండ్‌కు అప్పగించే సంప్రదాయం ఉందని మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. హైకమాండ్ తీసుకునే నిర్ణయాన్ని తామంతా శిరసావహిస్తామని ప్రజలకు కూడా తెలుసన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేతలను కాదని రేవంత్‌రెడ్డిని సీఎం చేయడంపై కేటీఆర్ చేసిన విమర్శకు దామోదర ఈ మేరకు స్పందించారు. పైన పటారం.. లోన లొటారం: మంత్రి పొన్నం గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన పైన పటారం.. లోన లొటారం అన్న చందంగా సాగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైందనే తెలంగాణ తెచ్చుకున్నామని, తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన కార్యక్రమాల గురించి మాట్లాడుకుందామని కేటీఆర్‌కు సూచించారు. మా తాత మీసాల మీద నిమ్మకాయ పెట్టాడంటే నడవదని పొన్నం చెప్పగా.. దీనికి కేటీఆర్ గట్టిగా స్పందించారు. ‘మా తాతలు నెయ్యి తాగిన్రు.. మా మూతులు వాసన చూడండి’అంటే కుదరదని కౌంటర్ ఇచ్చారు. నాగార్జునసాగర్, శ్రీశైలం కట్టామని క్రెడిట్ మాత్రమే తీసుకుంటామంటే నడవదని, కాంగ్రెస్ దురాగతాలను బరాబర్ చెప్తామని పేర్కొన్నారు. మీరా మమ్మల్ని అధికారంలోకి తెచ్చింది: మంత్రి శ్రీధర్ బాబు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో సైతం 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన గురించే చెప్పారని మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ రాజ్యంలోనే సామాజిక న్యాయం, పేదలకు న్యాయం జరిగాయని, ఇళ్లు, భూములు, పోడు భూములొచ్చాయని చెప్పారు. అలాంటి ప్రభుత్వం కోసమే మళ్లీ ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. ఉమ్మడి ఏపీలో 1999లో 91 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారంటూ.. కాంగ్రెస్‌ను తామే గెలిపించామన్న హరీశ్‌రావు వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ‘నాడు మీరెంత మంది ఉన్నారు? ఎన్ని సీట్లలో పోటీ చేసి ఎంత మంది గెలిచారు? మీరా మమ్మల్ని అధికారంలోకి తెచ్చింది’అని నిలదీశారు. -
రేవంత్ ప్రసంగానికి అడ్డు తగిలిన బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో బీఆర్ఎస్ సభ్యులు పలుమార్లు అడ్డుతగిలారు. రేవంత్‌రెడ్డి తన ప్రసంగంలో బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ ప్రభుత్వంపైన విమర్శలు చేస్తుండటంతో రెండుసార్లు మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో పలువురు బీఆర్ఎస్ సభ్యులు వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను ప్రస్తావిస్తూ మాజీ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ ‘సిగ్గుతో తలదించుకోవలసిందే’నని రేవంత్ వ్యాఖ్యానించగా హరీశ్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, మాగంటి గోపీనాథ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్ తదితరులు వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. మీకు కూడా మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని స్పీకర్ ప్రసాద్‌కుమార్ తెలపడంతో సీట్లలో కూర్చున్నారు. ► రేవంత్ ప్రసంగంలో బీఆర్ఎస్ను, కేసీఆర్‌ను విమర్శిస్తున్నప్పుడు సభ్యులు పాడి కౌశిక్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ పలుమార్లు అరుస్తూ అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. ► రేవంత్ మాటలకు కౌశిక్‌రెడ్డి అడ్డు తగులుతుంటే స్పీకర్ ప్రసాద్‌కుమార్ జోక్యం చేసుకుంటూ ‘కౌశిక్‌రెడ్డి.. కొత్త సభ్యుడివి. సభ నాయకుడు మాట్లాడుతుంటే వినాల్సిందే’అని స్పష్టం చేశారు. ► డ్రగ్స్ మాఫియా గురించి రేవంత్ మాట్లాడుతూ యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ గురించి మాట్లాడుతుంటే సపోర్ట్ చేసేందుకు మనసు రాలేదా అని ప్రశ్నించగా, ‘వుయ్ సపోర్ట్ యూ’అని పాడి కౌశిక్‌రెడ్డి అరిచారు. దానికి రేవంత్ స్పందిస్తూ ‘ఆయనకు తెలియక మాట్లాడుతున్నాడు. తరువాత ఆయన కష్టాలు ఆయనకుంటాయి’అని వ్యాఖ్యానించారు. కాగా తమ ప్రభుత్వ హయాంలో కూడా డ్రగ్స్ కట్టడికి సీవీ ఆనంద్ నేతృత్వంలో చర్యలు తీసుకున్నామని మాజీ మంత్రి కేటీఆర్ బదులిచ్చారు. ► రేవంత్ మాటలకు కౌశిక్‌రెడ్డి అడ్డు తగిలిన సమయంలో ‘గట్టిగా అరుస్తున్న ఆయన కూడా మేనేజ్మెంట్ కోటానే’అని వ్యాఖ్యానించారు. -
ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయింబర్స్మెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లతోపాటు మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ వంటివన్నీ అమలు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజే మంత్రివర్గ సమావేశం నిర్వహించి ఆరు గ్యారంటీలకు ఆమోదం తెలిపామని.. వాటికి చట్టబద్ధత కల్పించే కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. శనివారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో రేవంత్ మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలోని వైఫల్యాలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. రేవంత్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. ఓటమి తర్వాతైనా బీఆర్ఎస్లో మార్పు వస్తుందని ఆశించాం. శాసనసభలో గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న ఇతరులకు అవకాశం ఇస్తారనుకున్నాం. కానీ ఇప్పుడు కూడా ఆ కుటుంబ సభ్యులే మాట్లాడుతున్నారు. ‘మా పారీ్ట.. మా ఇష్టం’అనేది ఎక్కువకాలం చెల్లదు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అడుగుతాం, కడుగుతామని శ్రీశ్రీ అన్నారు. నిరంకుశత్వం ఎక్కువకాలం ఉండదు. మేం ప్రగతిభవన్ గడీలను బద్దలుకొట్టాక ప్రజలు తమ సమస్యలు చెప్పుకొనేందుకు రావడాన్ని బీఆర్ఎస్ నేతలు సహించలేకపోతున్నారు. గతంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రగతిభవన్‌కు వస్తే అనుమతి లేదని హోంగార్డే వెనక్కి పంపారు. నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సీఎంను కలిసేందుకు ప్రగతిభవన్‌కు వెళ్తే.. అనుమతి లేదని పోలీసులు వెనక్కి పంపిన చరిత్రను తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. ప్రజాయుద్ధనౌక గద్దర్‌ను కూడా ప్రగతిభవన్‌లోకి ప్రవేశం లేదని వెనక్కి పంపారు. మంత్రులు కూడా సీఎంను కలిసే అవకాశం లేని పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది. ఇప్పుడా ఇనుప కంచెలను పగలగొట్టి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం. ప్రజలకు స్వేచ్ఛ కల్పించాం. ఎవరైనా స్వేచ్ఛగా వచ్చి తమ సమస్యలు చెబితే వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పదేళ్లలో 8 వేల మంది రైతుల ఆత్మహత్యలు రైతుల ఆదాయంలో తెలంగాణ దేశంలో 25వ స్థానంలో ఉంది. గత పదేళ్లలో తెలంగాణలో 8వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్సీఆర్బీ నివేదికలోనే వెల్లడైంది. 2018 నుంచి ఇప్పటివరకు 18–60 ఏళ్లమధ్య వయసున్న 1,12,965 మంది రైతులు చనిపోతే.. వారికి రైతుబీమా కింద పరిహారం ఇచ్చారు. చనిపోయాక ఇవ్వడమా రైతు ప్రభుత్వమంటే? అదే పంటల బీమా పథకం పెట్టి ఉంటే రైతుల ఆత్మహత్యలు జరిగి ఉండేవి కాదు. కేసీఆర్ వరి వేస్తే ఉరే అని చెప్పి.. తన ఫామ్‌హౌజ్‌లో మాత్రం 150 ఎకరాల్లో వరి పండించి, ఆ వడ్లను క్వింటాల్ రూ.4,250 లెక్కన అమ్ముకున్నారు. అదే రైతులకు మాత్రం రూ.1,400 లెక్కనే ఇచ్చారు. దీనిపై విచారణకు సిద్ధమా? పాలమూరు ప్రజలు గెలిపించకపోయి ఉంటే.. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్ అనేది పచ్చి అబద్ధం. యూటీలు, పలు రాష్ట్రాల తరువాత తెలంగాణ 10వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో కోటి ఎకరాలకు కాల్వల ద్వారా నీరిస్తే.. 2014లో 19 లక్షలున్న పంపుసెట్ల సంఖ్య ఇప్పుడు 29లక్షలకు ఎందుకు చేరింది? రాష్ట్రంలో పాలమూరు, చేవెళ్ల ప్రాంతాలపై ఎందుకు వివక్ష కొనసాగింది? పాలమూరులో వలసలు ఆగలేదు. ఆర్డీఎస్ ప్రాజెక్టు ఇంకా పూర్తికాలేదు. కేసీఆర్‌ను పాలమూరు ప్రజలు ఎంపీగా గెలిపించకపోయి ఉంటే రాజకీయ భవిష్యత్తు ఏమై ఉండేది? ప్రాణహిత–చేవెళ్ల పథకాన్ని రద్దుచేసి ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారు. మిడ్ మానేరు నిర్వాసితులు పరిహారం కోసం ఇప్పటికీ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. మిడ్‌మానేరు ఆర్ అండ్ ఆర్ పునరావాసంలో ఎంపీ సంతోష్‌కుమార్‌కు, ఆయన సోదరికి 250 గ జాల చొప్పున ఇళ్లస్థలాలు వ చ్చాయి. ఇసుక దోపిడీని ప్రశ్నించిన నేరెళ్ల ప్రజలను కే సులు పెట్టి హింసించారు. దళితులను లాకప్‌లలో పెట్టి, కరెంట్ షాక్ ఇచ్చి హింసించారు. బీఆర్ఎస్ సభ్యులెవరినీ సభ నుంచి బయటికి పంపించం. వారిని ఇక్కడే కూర్చోబె ట్టి కఠోర నిజాలు వినిపిస్తాం. వారికి ఇదే శిక్ష. ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే.. గవర్నర్ ప్రసంగం వింటుంటే సిగ్గుపడ్డామని కేటీఆర్ అన్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు పదో తరగతి పరీక్షలు సరిగా నిర్వహించలేదు. ఇంటర్ పరీక్షలు సరిగా దిద్దక 25మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమయ్యారు. టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టలేక ప్రశ్నపత్రాలు అమ్ముకున్నవాళ్లు సిగ్గుతో తలదించుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే. మేనేజ్మెంట్ కోటాలో ఇక్కడ (సీఎం స్థానంలో) కూర్చోవాలనుకుంటే కేటీఆర్‌కు నిరాశ ఎదురైంది. పదవి దక్కలేదనే నిరాశతోనే ఆయన అక్కసు వెళ్లగక్కుతున్నారు. సోనియాగాంధీ దయ వల్లే తెలంగాణ వచ్చిందని గతంలో కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో అంగీకరించారు. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ మేనిఫెస్టోలా ఉందని కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ విధానాలనే గవర్నర్ తన ప్రసంగంలో చెప్పారు. అందులో తప్పులేదు. ఆరు గ్యారంటీలతోపాటు ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని మేం చెప్తున్నాం..’’అని రేవంత్ చెప్పారు. ధర్నాచౌక్‌ను పునరుద్ధరించాం మేం నియంతృత్వం, నిర్బంధ పోకడకు వెళ్లం. గతంలో అసెంబ్లీలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ నిరసన తెలిపితే వారి శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసిన చరిత్రను ప్రజలు మర్చిపోలేదు. గతంలో అమరవీరుల కుటుంబీకులను ఎప్పుడైనా ప్రగతిభవన్‌కు పిలిచి బుక్కెడు బువ్వ పెట్టి గౌరవించారా? ఉద్యమంలో బిడ్డలను కోల్పోయిన కుటుంబాలను ఆదుకున్నారా? పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయలేదు. తెలంగాణ కోసం ఉద్యోగం వదులుకున్న డీఎస్పీ నళినికి ఎందుకు న్యాయం చేయలేదు? కేసీఆర్ తన కుటుంబంలోని కుమారుడు, కుమార్తె, బంధువులకు మాత్రం మంత్రి పదవులు ఇచ్చారు. ఉద్యమ పార్టీ అని చెప్పుకొనే బీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నాచౌక్‌ను ఎత్తివేసింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మేం ధర్నాచౌక్‌ను పునరుద్ధరించాం. కావాలనుకుంటే కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ధర్నాచౌక్‌లో ఆమరణ నిరాహార దీక్షలు, ధర్నాలు చేసుకోవచ్చు. శాసనసభ 20వ తేదీకి వాయిదా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని శాసనసభ శనివారం ఆమోదించింది. తర్వాత శాసనసభను ఈనెల 20వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. డ్రగ్స్ విషయంలో ఎవరినీ ఉపేక్షించం ‘‘బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మారింది. డ్రగ్స్ ఘటనపై సిట్ వేయాలని నేనే పోరాటం చేశాను. డ్రగ్స్ కోరల్లో చిక్కుకున్న పంజాబ్ మాదిరే మన రాష్ట్రాన్ని తయారు చేశారు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన టీఎస్ న్యాబ్ కాగితాలకే పరిమితమైంది. డ్రగ్స్ నివారణకు 319 మంది సిబ్బంది కావాలంటే ఇవ్వలేదు. న్యాబ్ రూ.29 కోట్ల నిధులు కోరితే ఇవ్వలేదు. మా ప్రభుత్వం డ్రగ్స్‌ను అరికట్టేందుకు పటిష్ట ప్రణాళికతో వెళ్తుంది. డ్రగ్స్ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదు. కఠినంగా శిక్షిస్తాం. రాష్ట్ర సరిహద్దుల్లోకి డ్రగ్స్, గంజాయి వస్తే ఊరుకోం. ప్రతిపక్షాలు సహకరించాలని కోరుతున్నా. మేం పాలకులం కాదు.. సేవకులం. నాలుగున్నర కోట్ల ప్రజలకు సేవ చేసేందుకే ఇక్కడికి వచ్చాం.’’ -
సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్
సాక్షి,హైదరాబాద్ : ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి ఖూనీ చేశారని మాజీ మంత్రి,ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. శనివారం అసెంబ్లీ ముగిసిన అనతంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు కనీసం మాట్లాడే అవకాశం కూడా కల్పించలేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలన్నీ సత్య దూరమైనవేననన్నారు. ‘ప్రజాస్వామ్యయుతంగా ఉంటామని చెప్పి మాకు మాట్లాడే అవకాశమెందుకు ఇవ్వలేదు. మా గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. పీవీ నరసింహారావు చనిపోతే కాంగ్రెస్ పెద్దలు కనీసం నివాళులర్పించలేదు. గుంటెడు జాగా కూడా ఇవ్వలేదు. మాజీ సీంఎ అంజయ్యనూ కాంగ్రెస్ పార్టీ అవమానించింది’ అని హరీశ్‌రావు గుర్తు చేశారు. ‘అమరులకు ప్రతి సారి నివాళులు అర్పించిన తర్వాతే కేసిఆర్ పనులు మొదలు పెడతారు. సచివాలయం ముందు అమరుల స్థూపం బీఆర్ఎస్ కట్టింది. జై తెలంగణ అంటే కాల్చేస్తా అని గన్ను పట్టుకుని వచ్చింది రేవంత్‌రెడ్డి. యాది రెడ్డి శవాన్ని కనీసం రేవంత్‌రెడ్డి చూడలేదు. అనేక ఉద్యమ కేసులు మాపై ఉన్నాయి. కేసులే లేవని అసెంబ్లీలో చెప్తున్నాడు రేవంత్ రెడ్డి’అని హరీశ్‌రావు మండిపడ్డారు. ఇదీచదవండి..సీఎం రేవంత్‌ది పేమెంట్ కోటా:కేటీఆర్ -
బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం సహా బీఆర్ఎస్ నేతలు విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని.. వాళ్ల పాస్‌పోర్టులు సీజ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అధికారం పేరిట కేసీఆర్ కుటుంబం సహా బీఆర్ఎస్ నాయకులు ప్రజల సొమ్మును దోచుకుతిన్నారు. అవినీతి భాగోతాలు బయటపడతాయనే భయం వాళ్లలో ఉంది. అందుకే వాళ్ల పాస్‌పోర్టులు సీజ్ చేయండి. లేకుంటే దేశం విడిచిపోయే ప్రమాదం ఉందని బండి సంజయ్ అన్నారు. బంగారు పళ్లెంలో పెట్టి తెలంగాణాను అప్పగించామని బీఆర్ఎస్ నేతలు చెప్పడం సిగ్గు చేటని మండిపడ్డారాయన. బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతే! పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు. దేశమంతా మోదీ హవా నడుస్తోంది. ముచ్చటగా మూడోసారి 350 సీట్లతో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయం. దేశవ్యాప్తంగానే కాదు.. తెలంగాణలోనూ కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉండనుంది. బీఆర్ఎస్ అడ్రస్ ఇక గల్లంతే. పార్టీ గెలుపే లక్ష్యంగా కష్టపడి పనిచేయాలని బీజేపీ కార్యకర్తలకు బండి సంజయ్ పిలుపు ఇచ్చారు. -
TS:సీఎం రేవంత్‌ది పేమెంట్ కోటా:కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: నాది మేనేజ్మెంట్ కోటా అయితే సీఎం రేవంత్‌రెడ్డిది పేమెంట్ కోటా అని మాజీ మంత్రి,సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. ఢిల్లీలో మేనేజ్ చేసి పీసీసీతో పాటు సీఎం పదవి రేవంత్ తెచ్చుకున్నారని తాము చెప్పడం లేదని గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డే చెప్పారన్నారు. గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా సీఎం వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కాగా, డ్రగ్స్ సప్లై చేసే వాళ్లు ఎంత పెద్దవాళ్లైనా ఊచలు లెక్కించాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. టీఎస్ న్యాబ్‌కు డీజీ స్థాయి అధికారిని నియమించామని చెప్పారు. టీఎస్ న్యాబ్‌కు గతంలో ప్రభుత్వమే ఏర్పాటుచేసినప్పటికీ వారికి అవసరమైన రూ.30 కోట్లు నిధులు కూడా ఇవ్వలేదని విమర్శించారు. పంజాబ్ పరిస్థితి తెలంగాణ రాకూడదన్నారు. ఇదే విషయమై కేటీఆర్ మాట్లాడుతూ డ్రగ్స్‌పై ప్రత్యేక టీఎస్ న్యాబ్‌ను ఏర్పాటు చేసి సీవీ ఆనంద్ లాంటి అధికారిని నియమించింది తామేనని చెప్పారు. పంజాబ్‌ను డ్రగ్స్ మహమ్మారి పట్టి పీడించడానికి కాంగ్రెస్ కారణం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. పంట బీమాకు రైతు బీమాకు తేడా తెలియని వ్యక్తి సీఎం అయినందుకు తెలంగాణ ప్రజలు సిగ్గు పడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఇసుక దోపిడీపై శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నానన్న విషయం మర్చిపోయి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారన్నారు. ఆయన ఇంకా గాంధీ భవన్లో మాట్లాడినట్లు మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 2014 వరకు ఇసుకపై కేవలం రూ. 40కోట్ల ఆదాయం వచ్చింది. 2014 నుంచి 2023 వరకురూ. 5వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఇసుక మాఫియా బీఆర్ఎస్ది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీ జరిగింది. నేరెళ్ళలో ఇసుక మాఫియా అనే విమర్శలు చేయడం ఇప్పుడు కొత్త కాదు. పదే పదే చెప్తూనే వస్తున్నారు. మొన్న ఎన్నికల్లో కూడా నేరెళ్లలో బీఆర్ఎస్ అభ్యర్థిగా నాకే మెజార్టీ వచ్చింది’అని కేటీఆర్ తెలిపారు. ఇదీచదవండి.. బీఆర్ఎస్ ఇంకా మారలేదు: సీఎం రేవంత్ -
TS : బీఆర్ఎస్ ఇంకా మారలేదు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్ : ప్రతిపక్ష నేతగా ఎవరికైనా సీనియర్లకు అవకాశమిస్తారేమో అనుకున్నామని, కానీ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలనకే పరిమితమవుతుందని మరోసారి నిరూపించారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో బీఆర్ఎస్ తరపున అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడడంపై రేవంత్ ఈ విమర్శలు చేశారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో రేవంత్‌రెడ్డి రిప్లై ఇచ్చారు. ‘కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. అయినా బీఆర్ఎస్ మారలేదు. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే ప్రతిపక్షంలోకి కాదు బయటికి పంపిస్తారు. ప్రగతిభవన్ గేట్లు బద్దలు కొట్టి ప్రజలకు ప్రవేశం కల్పించాం. ప్రజాభవన్‌లో ప్రజావాణిని బీఆర్ఎస్ నేతలు భరించలేకపోతున్నారు. హోం మంత్రిని ప్రగతిభవన్ లోపలికి రానివ్వలేదు. గద్దరన్నను ఎండలో నిలబెట్టిన ప్రగతిభవన్ గేట్లను బద్దలు కొట్టాం. నాటి సీఎం దగ్గరకు మంత్రులకు, ఎమ్మెల్యేలకు అనుమతి లేదు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ స్వేచ్ఛను ఇచ్చింది. ఆరు గ్యారెంటీలపై అసెంబ్లీలో చర్చించి చట్టం చేస్తాం’ అని సీఎం తెలిపారు. ‘తెలంగాణ అమరుల గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదు. వారిని ఇంటికి పిలిచి మాట్లాడలేదు. కొడుకు, కూతురు, అల్లునికి పదవులిచ్చుకున్నారు. తెలంగాణ కోసం డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన నళినికి ఏ పదవి ఇవ్వలేదు. శ్రీకాంతచారి తల్లి శంకరమ్మకు ప్రగతిభవన్‌లో ఏనాడు అన్నం పెట్టలేదు. ఉద్యమకారులపై ఇంకా కేసులు ఎత్తివేయలేదు. ధర్నాచౌక్ తొలగించి నిర్బంధాన్ని అమలు చేశారు’అని సీఎం అన్నారు. ‘ఈ ప్రభుత్వం రైతును రాజును చేశామని చెప్పుకుంది. నేషనల్ క్రైమ్ బ్యూరో లెక్కల ప్రకారం తెలంగాణలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేశారు. రైతుబీమా లెక్కల ప్రకారమే 1లక్షా21వేల మంది రైతులు చనిపోయారు. రైతు బతికుండడానికి మద్దతివ్వడం కాకుండా రైతు చనిపోతే బీమాఇచ్చిన చరిత్ర గత ప్రభుత్వానిది. వరి వేస్తే ఉరేస్తే అని గత ముఖ్యమంత్రి అన్నారు. కానీ ఫాంహౌజ్‌లో 150 ఎకరాల్లో వరి పండించి క్వింటాల్‌కు రూ.4500కు అమ్ముకున్నారు’ అని సీఎం ఆరోపించారు. ఇదీచదవండి..కాంగ్రెస్ పార్టీకి ఇంత మిడిసిపాటు వద్దు: కేటీఆర్ -
Ts Assembly: కూనంనేనికి హరీశ్‌రావు ఛాలెంజ్
సాక్షి,హైదరాబాద్: అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్‌కు ధన్యవాదాలు తెలిపె తీర్మానంపై చర్చ సందర్భంగా సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు. సీఎం కేసీఆర్ లాంటి అన్నీ తెలిసిన నాయకుడు కూడా అమలు సాధ్యంకానీ ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితబంధు హామీలిచ్చారన్నారు. ఈ వ్యాఖ్యలకు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. తాము ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎక్కడా చెప్పలేదని హరీశ్‌రావు అన్నారు. ‘కూనంనేని సాంబశివరావు సీపీఐ ఎమ్మెల్యే. వారి పార్టీ కాంగగ్రెస్కు మిత్ర పక్షం. ఇద్దరు కలిసి పోటీ చేశారు. మేం ఇంటికి ఒక ఉద్యోగమిస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. తాము అలా చెప్పినట్లు నిరూపించాలని ఛాలెంజ్ విసిరారు. గవర్నర్ స్పీచ్‌పై కూనంనేని మాట్లాడితే బాగుంటుంది’అని హరీశ్‌రావు సూచించారు.అనంతరం కూనంనేని మళ్లీ మాట్లడడం ప్రారంభించిన తర్వాత కూడా బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఇదీచదవండి..కాంగ్రెస్ పార్టీకి ఇంత మిడిసిపాటు వద్దు: కేటీఆర్ -
కేటీఆర్ విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కేటీఆర్ విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ వేశారు. కొంతమంది NRIలకు ప్రజాస్వామ్యం విలువ తెల్వదని అన్నారు. కేటీఆర్ చెప్పే పాపాల్లో ఆయన చుట్టూ కూర్చున్న వాళ్ళదే పాత్ర ఉందని మండిపడ్డారు. ఐదేళ్లు సమయం ఉంది.. జరిగిన విధ్వంసం ఏంటో అన్ని బయటపడతాయని అన్నారు. కేటీఆర్ మేనేజ్ మెంట్ కోటాలో రాజకీయాల్లోకి వచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు రాజకీయ జీవితం ప్రసాదించింది కాంగ్రెస్సేనని మర్చిపోవద్దని రేవంత్ రెడ్డి అన్నారు. గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, సింగిల్ విండో చైర్మెన్ గా ఓడినా కేసీఆర్ ను మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీనేనని గుర్తు చేశారు. వైఎస్ఆర్ పాలనలో కేసీఆర్ కుటుంబం నుంచి ఎమ్మెల్యే గా లేకుండా మంత్రిగా చేశారని తెలిపారు. ప్రతిపక్షాలకు 2014కు ముందు అభివృద్ధిపై చర్చ కావాలంటే ఒక రోజు అంతా చర్చించుకుందామని అన్నారు. ప్రజాస్వామ్యంలో 49 శాతానికి 51 శాతానికి చాలా తేడా ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. 51 శాతం నెంబర్ ఉన్నవారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రజాస్వామ్యంలో 49 శాతానికి సున్నా వాల్యూ అని తెలిపారు. నా రిప్లే గురించి బీఆర్ఎస్ తహతహలాడుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. అచ్చోసిన ఆంబోతులం .. పోడియంకి వస్తాం అనే అహం పనికిరాదని దుయ్యబట్టారు. ఐదేళ్ల సమయం ఉంది ఏమి జరిగిందో అన్ని తెలుసుకుందాం అని సీఎం రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనపై ఎక్స్‌రై తీస్తానని చెప్పారు. గతం గురించి చర్చ చేద్దాం అంటే.. ఒక్క రోజు సమయం ఇవ్వండి అన్నీ లెక్కలు తీద్దామని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై తమ నాయకులే కొట్లాడారు అని రేవంత్ రెడ్డి అన్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దారుణమైన ప్రసంగం విన్నాక రాష్ట్రం ఎలా ఉండబోతుందో అర్థం అవుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. నాలుగోరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదని, ఢిల్లీ నామినేట్ చేసీ ముఖ్యమంత్రి అని అన్నారు. కాంగ్రెస్ పాలనలో త్రాగు, సాగు, కరెంట్ దిక్కు లేదని అన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ తప్ప ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో 50 ఎకరాల రైతు అయినా సరే గుంపు మేస్త్రి లాగా ఉండేవారని విమర్శించారు. -
కాంగ్రెస్‌కు ఇంత మిడిసిపాటు వద్దు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దారుణమైన ప్రసంగం విన్నాక రాష్ట్రం ఎలా ఉండబోతుందో అర్థం అవుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. నాలుగోరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ మాట్లాడారు. నక్క మోసం చేయనని, పులి మాంసం తినను అని వాగ్దానం ఇచ్చినట్లు గవర్నర్ ప్రసంగం ఉందని అన్నారు. తాము ఎక్కడ ఉన్నా ప్రజా పక్షమేనని తెలిపారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదని, ఢిల్లీ నామినేట్ చేసీ ముఖ్యమంత్రి అని అన్నారు. కాంగ్రెస్ పాలనలో త్రాగు, సాగు, కరెంట్ దిక్కు లేదని అన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ తప్ప ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో 50 ఎకరాల రైతు అయినా సరే గుంపు మేస్త్రి లాగా ఉండేవారని అన్నారు. కలసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు కేసీఆర్ అని అన్నారు. 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ మిడిసిపడుతోందని, ఇంత మిడిసిపాటు వద్దని తెలిపారు. -
మేడిగడ్డ, అన్నారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ: సీఎం రేవంత్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రజలు చాలా బాధపడ్డారు: ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగంపై చర్చ జరిగింది గవర్నర్ ప్రసంగంపై ప్రజలు చాలా బాధపడ్డారు రెండు సార్లు ఓట్లేస్తే గెలిచి ఏర్పాటు చేసిన ప్రభుత్వంపై గవర్నర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు నిరంకుశ, నిర్బంధ ప్రభుత్వంగా దూషించారు ఆ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం ఆ పదాలు రికార్డుల్లో నుంచి తొలగించాలని కోరాం ప్రజల తీర్పు గౌరవిస్తున్నాం తొలి శాసనమండలి సమావేశాలు ఇవి మండలిలో భారాసకు మెజారిటీ ఉంది ప్రభుత్వానికి సహరించాలన్న ఉద్దేశంతో ప్రజలకు ఓ సందేశం ఇవ్వాలనుకున్నాం ఆ స్ఫూర్తిని ప్రభుత్వం కొనసాగించాలి రాష్ట్ర ప్రగతిపై రోడ్ మ్యాప్ ప్రజలకు చెప్పాలి నష్టం జరిగే చర్యలు అడ్డుకుంటాం.. పోరాటాలు చేస్తాం తెలంగాణ శాసనమండలి నిరవధిక వాయిదా ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాలు వాడీవే‘ఢీ’గా శాసన సభలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం అనంతరం మండలిలోనూ అదే తరహా సీన్ సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అభ్యంతరం చివరకు శాసన మండలి నిరవధిక వాయిదా సీఎం రేవంత్ ప్రకటనపై కవిత సెటైర్లు సీఎం ప్రకటన అనంతరం శాసనమండలిలో కల్వకుంట్ల కవిత ప్రసంగం మేడిగడ్డ ఏమైనా టూరింగ్ స్పాటా.. అందరినీ తీసుకెళ్లడానికి నిపుణుల ఆధ్వర్యంలో కమిటీ వేసి.. వాళ్లను తీసుకెళ్లండి అని సీఎం రేవంత్‌కు చురక మేడిగడ్డ, అన్నారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ: సీఎం రేవంత్ మేడిగడ్డ అన్నారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించనున్న తెలంగాణ ప్రభుత్వం శాసన మండలిలో ప్రకటించిన సీఎం రేవంత్ ఎందుకు కుంగిపోయిందో.. ఎందుకు పనికి రాకుండా పోయిందో తెలుసుకుంటాం అసెంబ్లీ సమావేశాలు ముగిశాక సభ్యులందరినీ మేడిగడ్డకు తీసుకెళ్తాం విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి కాంట్రాక్టులు ఎవరిచ్చారు? వారి వెనుకున్న మంత్రులు ఎవరు?.. అధికారుల పాత్ర సహా అన్నీ బయటపడతాయి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ వ్యాఖ్యలు ముఖ్యమంత్రిలో గొప్ప పరిణితి కన్పిస్తుంది అసెంబ్లీ ముందు కూడా ఇంకా ముళ్ళ కంచె ఉంది.. వాటిని తొలగించాలి. ముఖ్యమంత్రి బాష సంస్కార వంతంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ అంటే ఒక్కరే కాదు అందరూ కలిస్తేనే ప్రభుత్వం మీ పార్టీలో వ్యక్తి ఆరాధన ఎందుకు? రీసెంట్ గా ఒక లాకప్ డెత్ జరిగింది దానిపై ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలి. ఒక జర్నలిస్ట్ ను చంపుతానని ఒక ఎమ్మెల్యే సెక్రటేరియట్ లో బెదిరించాడు.. దానిపై స్పందించాలి రైతు బీమా పై వారి ఆలోచన ఏంటో చెప్పాలి. భయపెట్టే విధంగా పాలకులు మాట్లాడకూడదు మూసీని జీవనదిగా మారుస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ శాసన మండలిలో సీఎం రేవంత్ ప్రసంగం స్వేచ్ఛకోసమే ప్రత్యేక రాష్ట్రం కావాలనుకున్నాం ఇంకా ఉమ్మడి రాష్ట్రంలోలా పరిపాలన చేస్తామంటే ఎలా? ఉక్కు కంచెలు వేసుకుని ఇన్ని రోజులు ప్రజలకు దూరమయ్యారు ఇప్పుడు ప్రజావాణిని వింటున్నాం.. ప్రజావాణితో మార్పును తెచ్చాం గత ప్రభుత్వంలో పేదలకు ఆరోగ్య శ్రీ అందలేదు పాతబస్తీకి మెట్రో రైలు తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది మురికి మూసీని ప్రక్షాళన చేసి జీవనదిగా మారుస్తాం మూసీ పరివాహక ప్రాంతాన్ని ప్రత్యేక కారిడార్‌గా అభివృద్ధి చేస్తాం ఈ ప్రభుత్వానికి ఎవరైనా.. ఎప్పుడైనా సూచనలు ఇవ్వొచ్చు ప్రభుత్వం అంటే పాలకపక్షం, ప్రతిపక్షం బానిస మనస్తత్వాన్ని ఇంకా కొందరు వదులుకోలేదు: మండలిలో సీఎం రేవంత్‌రెడ్డి ఎన్ని రకాల ఒడుదుడుకులు వచ్చినా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు: రేవంత్ రెడ్డి జైపాల్ రెడ్డి కృషితోనే తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందింది ప్రజల స్వేచ్ఛను ఏడో హామీగా ఇచ్చాం ప్రగతి భవన్ ఉక్కు కంచెలు బద్ధలు కొట్టి.. చేసిన తప్పుల్ని సరిదిద్దాం కొందరు నేతలు ఇంకా బానిస మనస్తత్వాన్ని వదులుకోలేదు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడే ప్రగతిభవన్ గేట్లు బద్దలుకొట్టాం ఇంకా బానిస మనస్తత్వాన్ని కొందరు నేతలు వదులుకోవడం లేదు బీఆర్ఎస్ నేతలు మోసం చేస్తూ వచ్చారు: మండలిలో సీఎం రేవంత్‌రెడ్డి రాచరిక పోకడలను ఉద్యమాలతో నిర్మూలించిన చరిత్ర తెలంగాణది ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు మూడోసారి ఉద్యమం చేశారు ఉద్యమ నేపథ్యం ఉన్నవాళ్లకు, ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంటుంది ఇంతకాలం బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెబుతూ వచ్చారు తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం 10వ స్థానంలో ఉంది రైతుల ఆదాయంలో.. తెలంగాణ 25వ స్థానంలో ఉంది రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉంది రైతుల్ని ఆదుకుంటున్నామని అబద్ధం చెబుతూ వస్తున్నారు రైతుల ఆదాయం పెంచడానికి.. వ్యవసాయం రంగం అభివృద్ధికి సరైన ప్రణాళిక రచించలేదు నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది ఇప్పటికీ నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో అదే వెనుకబాటుతనం ఉంది గవర్నర్ ప్రసంగం ఎమ్మెల్సీ కవిత అభ్యంతరం హైదరాబాద్: గవర్నర్ ప్రసంగంలోని పలు అంశాలపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర అభ్యంతరం అభ్యంతరకరమైన వ్యాఖ్యలను రికార్డుల్లో నుంచి తొలగించాలని ప్రతిపాదించిన ఎమ్మెల్సీ కవిత విముక్తి, అణచివేత, నియంతృత్వ పాలన, వ్యవస్థల విధ్వంసం, వివక్ష వంటి పదాలను గవర్నర్ ప్రసంగం నుంచి తొలగించాలని ఎమ్మెల్సీ కవిత ప్రతిపాదన గవర్నర్ ప్రసంగంలోని అనుచిత వ్యాఖ్యలను రికార్డుల్లో నుంచి తొలగించాలని ఎమ్మెల్సీ కవిత ప్రతిపాదన ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసింది మీడియా పాయింట్ వద్ద హరీష్ రావు వ్యాఖ్యలు ప్రధాన ప్రతిపక్షానికి కనీసం మాట్లాడే అవకాశం కూడా కల్పించలేదు బీఆర్ఎస్కే కాదు బీజేపీ, ఎంఐఎం పార్టీలకు కూడా మాట్లాడే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు అబద్ధాలు చెప్తూ గోబెల్స్ ప్రచారం చేసింది సత్య దూర మాటలు మాట్లాడింది కాంగ్రెస్ ప్రభుత్వం డెమొక్రాటిక్ గా ఉంటామని చెప్పి ఇప్పుడెందుకు ఇవ్వలేదు మేము మాట్లాడుతుంటే మా గొంతు నొక్కే ప్రయత్నం చేశారు పీవీ నరసింహారావు చనిపోతే కనీసం నివాళులు అర్పించలేదు, కనీసం వెళ్లి చూడలేదు కాంగ్రెస్ పార్టీ గుంటెడు జాగా కూడా ఇవ్వలేదు అంజయ్యను అవమానించింది కాంగ్రెస్ అమరులను ప్రతిసారి నివాళులు అర్పించిన తర్వాతే కేసీఆర్ పనులు మొదలు పెడుతారు సచివాలయం ముందు అమరుల స్థూపం ముందు కట్టింది బీఆర్ఎస్ ‘‘జై తెలంగాణ అంటే.. కాల్చేస్తా’’ అంటూ గన్ను పట్టుకొని వచ్చింది రేవంత్ రెడ్డి యాది రెడ్డి శవాన్ని కనీసం చూడలేదు రేవంత్ రెడ్డి అనేక ఉద్యమ కేసులు మాపై ఉన్నాయి కేసులే లేవని అసెంబ్లీ చెప్తున్నాడు రేవంత్ రెడ్డి అసెంబ్లీ బుధవారానికి వాయిదా హరీశ్‌రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం గవర్నర్ ప్రసంగంపై కేవలం క్లారిఫికేషన్స్ అడగాలని సూచన సీఎం మాటలకు సమాధానం చెబుతానన్న హరీశ్‌రావు కాంగ్రెస్సే కుటుంబ పార్టీ అని కౌంటర్ పీవీ నరసింహారావును అవమానించారని ఫైర్ దీంతో సభను వాయిదా వేసిన స్పీకర్ సీఎం రేవంత్‌రెడ్డి స్పీచ్ ప్రగతిభవన్ గేట్లు బద్దలు కొట్టి ప్రజలకు ప్రవేశం కల్పించాం కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలనకే పరిమితమవుతుందని మరోసారి నిరూపించారు ఎంతోమంది సీనియర్లున్నా మాట్లాడేందుకు బీఆర్ఎస్ వారికి అవకాశమివ్వలేదు ప్రజాభవన్‌లో ప్రజావాణిని బీఆర్ఎస్ నేతలు భరించలేకపోతున్నారు హోం మంత్రిని ప్రగతిభవన్ లోపలికి రానివ్వలేదు గద్దరన్నను ఎండలో నిలబెట్టిన ప్రగతిభవన్ గేట్లను బద్దలు కొట్టాం ఫామ్ హౌస్ లో పండిన వడ్లకు 4200 లకు క్వింటాలు అమ్మారు ఎవరికి అమ్మినారో...ఎలా అమ్మారో విచారణకు సిద్ధమా బీఆర్ఎస్ వాళ్ళు ఒప్పుకుంటే నేను విచారణకు అదేశిస్తా విద్యుత్ వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో లేదు ప్రతిపక్షంలో కూడా అబద్ధాలు చెప్తూనే ఉన్నారు కేంద్ర లెక్కల ప్రకారం తెలంగాణ 10వ స్థానంలో ఉంది గోవా పంజాబ్, హరియాణ మొదటి స్థానంలో ఉన్నాయి కాలువల ద్వారా నీళ్ళు ఇస్తే పంప్ సెట్లు పెరుగుతాయా? కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇస్తునం అనే వాదన శుద్ధ అబద్ధం తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తాం అసెంబ్లీకి 15 నిమిషాలు టీ బ్రేక్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడిన తర్వాత టీ బ్రేక్ ఇచ్చిన స్పీకర్ కూనంనేనికి మంత్రి హరీశ్‌రావు ఛాలెంజ్ బీఆర్ఎస్ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని ఎక్కడ చెప్పిందో నిరూపించాలి గవర్నర్ స్పీచ్‌పై కూనంనేని మాట్లాడితే మంచిదని సూచన తెలంగాణ అసెంబ్లీలో వైఎస్సార్‌పై పొగడ్తల వర్షం వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని పొగిడిన సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఒక వ్యక్తి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అనేదానికి నిదర్శనం వైఎస్సార్ ఎవ్వరూ ఊహించని విధంగా వైఎస్సార్ పాలన సాగింది ఒక్కడే ఆరోగ్య, ఫీజు రీయింబర్స్మెంట్, పెన్షన్లు, ఇండ్లు, రేషన్, జలయజ్ఞం ఇలా అసాధ్యాలను సుసాధ్యం చేశారు వైఎస్ఆర్ ఎన్నో హామీలు ఇచ్చారు...అన్ని అమలు చేసి చూపించారు వైఎస్ఆర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, కమిట్మెంట్ తో పని చేశారు 50 ఏళ్లలో ఎంతో కొంత అభివృద్ధి జరిగింది గత పదేళ్ల బీఆర్ఎస్ హయాంలోనూ అభివృద్ధి ఉంది ఏం చేయకపోవడం అనేది ఉండదు..అందరూ ఎంతో కొంత చేశారు గత బీఆర్ఎస్ తప్పులు జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకోవాలి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయొద్దు పార్టీ మార్పులను ప్రోత్సహించవద్దు ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను కాంగ్రెస్ కాపాడాలి కాంగ్రెస్- హామీలు చాలా ఇచ్చారు.. ఎన్ని నెరవేర్చారు అనేది ముఖ్యం. * బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా గెలిపించుకోలేకపోయింది. * ముస్లింల అభివృద్దికి ఆ పార్టీలు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. * కాంగ్రెస్‌కు మేము దగ్గర ఉన్నామంటే.. అందుకు కారణం మాజీ సీఎం, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మాత్రమే. * ముస్లింల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ ఎంతో కృషి చేశారు - అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీకి మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ * అసెంబ్లీ ఛాంబర్లో సీఎం రేవంత్‌రెడ్డితో జైరాం రమేష్ భేటీ. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కామెంట్లు * ముస్లింలు కాంగ్రెస్, బీఆర్ఎస్ను గెలిపించారు కానీ వీళ్ళు మాత్రం ముస్లింలను గెలిపించడం లేదు. * వాళ్ళు కూర్చునే ప్లేస్ మారుతుంది కానీ మేము ఎప్పుడూ అలానే ఉన్నాం. * ముస్లింల కోసం మేము పోరాటం చేస్తున్నాం.. చేస్తూనే ఉంటాం. అసెంబ్లీలో బీఆర్ఎస్పై బీజేపీ ఎటాక్ • మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చింది కేంద్ర బీజేపీ. • కేంద్రం నుంచి కాంగ్రెస్‌ను కాపాడేందుకు మేము రెస్క్యూ చేస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకేటే అన్నట్లు అనిపిస్తోంది • మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మంత్రి పొన్నం ప్రభాకర్ • తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారని ప్రధాని మోదీ అవమానించారు - మంత్రి పొన్నం • తెలంగాణను అవమానించిన బీజేపీలో ఉండటంపై సిగ్గుపడాలి - మంత్రి పొన్నం • ఎంఐఎం, బీఆర్ఎస్, బీజేపీ.. ఒక్కటే అని బయట అనుకుంటున్నారు - పొన్నం ప్రభాకర్ * రేవుల ప్రకాశ్‌రెడ్డి, బాలు నాయక్, కౌసర్ మోయినొద్ధిన్, కూనం నేని సాంబశివరావులను ప్యానెల్ స్పికర్లగా ప్రకటించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ అరు గ్యారెంటీలు అన్నారు.. అందులో రెండు అమలు అన్నారు.. కానీ పూర్తిగా అమలు కావడం లేదు - కేటీఆర్ * మార్చ్ 17 వరకు ఆరు గ్యారెంటీలు అమలు కోసం ప్రజలు వేచి చూస్తున్నారు. * హరీష్ రావు ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడే ఆరోగ్య శ్రీ 10లక్షలు అమలు మేము చేశాం. * ప్రజావాణి ప్రతి మంగళవారం కలెక్టరేట్లో జరుగుతూనే ఉంది. * ఫస్ట్ కేబినెట్లో ఆరు గ్యారెంటీలకు చట్ట భద్దత తెస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. ఇప్పటికీ మూడు కేబినెట్లు అయ్యాయి కానీ కాలేదు. * 2లక్షల రుణమాఫీ అన్నారు చెప్పిన డేట్ దాటిపోయింది. * రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి డీఎస్సీ, జాబ్ గ్యారెంటీ అన్నారు కానీ కాలేదు. * మేము చేసిన అభివృధి కంటే ఎక్కువ అభివృద్ధి చేయాలని కోరుతున్నాం. * అమరుల గురించి గవర్నర్ ప్రసంగంలో ఉంది. అమరులకు కారణం ఎవరు? అందరికీ తెలుసు! * ఆల్రెడీ శ్వేత పత్రాలు ఉన్నాయి. కొత్తగా బయట పెట్టాల్సిన అవసరం లేదు. అప్పుల సాకు చెప్పి ఆరు గ్యారెంటీలు ఎగ్గొట్టెందుకు ప్లాన్ వేస్తున్నారు: కేటీఆర్ * ట్రాన్స్‌కో ఆస్తులు 24వేలు జెంకో 53వేలు, డిస్కాంలు 59వేల ఉన్నాయి. * 81వేల అప్పులు ఉంటే.. 1లక్ష 75వేలు ఉన్నాయి. * ఆనాడు కొత్త ప్రభుత్వానికి 11వేల డిస్కాంల అప్పులు వదిలేస్తే దానితో పాటు 9వేల కోట్లు చెల్లించాం. * మహిళలకు, మధ్యతరగతి ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి. * అప్పుల కంటే ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి. గతంలో వైఎస్సార్ గొప్పతనాన్ని, అభివృద్ధిని కేసీఆర్ గొప్పగా చెప్పారు * విద్యుత్ డిమాండ్, పంప్సెట్ల సంఖ్య మా ప్రభుత్వంలో పెరిగింది. * గావు కేకలతో విద్యుత్ సంస్థలు బాగుపడవు. * 2014లో 24లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 1కోట్లు 30లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పెరిగింది. కాంగ్రెస్ నాయకులు కష్టపడి కట్టుకున్న పుట్టలో చీమలు చొరబడట్లు పార్టీలోకి చొరబడి సీఎం అయింది రేవంత్ రెడ్డి: ఎమ్మెల్యే కేటీఆర్ * తెలంగాణ ప్రజలు ఎన్నుకుంటే రేవంత్ రెడ్డి సీఎం అవ్వలేదు.. హైకమాండ్ చేస్తే అయ్యారు. * బయటదేశం నుంచి వచ్చిన వాళ్లకు అధ్యక్షులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐల గురించి మాట్లాడితే ఎలా? * NRI అంటే బయట వాళ్ళే అనే కాంగ్రెస్ నాయకుల మాటలు ఎన్ఆర్ఐలు ఆలోచన చెయ్యాలి. * బస్సు, బంగారం ఫ్రీ అని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. * అధికారంలో కూర్చున్న ఒక్కరికీ కూడా ఐటీఐఆర్ తెల్వదు. * అభ్యుదయం తెల్వని వాళ్ళు అవాస్తవాలు చెప్తున్నారు. • పదవులను గడ్డిపోసలెక్క వదిలేసిన చరిత్ర కేసీఆర్‌ది : బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు. • ఏబీవీపీ నుంచి మొదలై టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చి రేపు ఎక్కడా రేవంత్‌రెడ్డి ఉంటారో తెలియదు • పదవుల కోసం పార్టీలు మారిన చరిత్ర మీది.. మాది కాదు. శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కామెంట్లు.. * గత ఐదేళ్లుగా ఇందిరమ్మ రాజ్యం ఎలా ఉందో బీఆర్ఎస్ చెప్తూనే ఉంది. కానీ ప్రజలు మళ్ళీ కాంగ్రెస్‌కే అధికారం ఇచ్చారు. * గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడితే బాగుంటుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కామెంట్లు.. * సీఎం రేవంత్‌రెడ్డి సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారు * మేం పొత్తు పెట్టుకోవటం వల్లనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. * ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి జీవం పోసింది కేసీఆరే. కొంతమంది ఎన్ఆర్ఐలకు తెలంగాణ ప్రజాస్వామ్యం విలువ తెలియదు: సీఎం రేవంత్‌రెడ్డి * గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, సింగిల్ విండో చైర్మెన్‌గా ఓడినా కేసీఆర్‌ను మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీనే. * వైఎస్ఆర్ పాలనలో కేసీఆర్ కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా లేకుండా మంత్రిగా చేశారు. * ప్రతిపక్షాలకు 2014కు ముందు అభివృధిపై చర్చ కావాలంటే ఒక రోజు అంతా చర్చించుకుందాం. * కేటీఆర్ చెప్పే పాపాల్లో ఇప్పుడు ఆయన చుట్టూ కూర్చున్న వాళ్ళదే పాత్ర ఉంది. * ఐదేళ్లు సమయం ఉంది. జరిగిన విధ్వంసం ఏంటో అన్ని బయటపడతాయి. * పిల్లి శాపనార్థాలకు ఉట్లు తేగిపడవు. గవర్నర్ ప్రసంగం పై కేటీఆర్ మాట్లాడుతుండగా గందరగోళం • కేటీఆర్ వ్యాఖ్యలను తప్పు పట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ • పదేళ్ల పాలన పై కాంగ్రెస్ చర్చ జరగాలి అంటే.. 50 ఏళ్ల పాలనపై చర్చ జరగాలని బీఆర్ఎస్ పట్టు • ఆనాడు అన్యాయం జరిగింది కాబట్టే తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిందన్న భట్టి • సంపద రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే • తెలంగాణ అంటే 2014 నుంచి మాత్రమే లెక్క వేయాలన్న భట్టి విక్రమార్క • బీఆర్ఎస్కు గోదావరి, కృష్ణలో ఒక్క చుక్క నీళ్లు తెలీదు • బీఆర్ఎస్ పాలన విధ్వంసం చేసింది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్లు.. * ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలు చేస్తే స్వాగతిస్తాం. * ప్రజాస్వామ్య యుతంగా సభను నడుపాలని మేము అనుకుంటున్నాం. * అదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ప్రతీ గల్లికి నీళ్ళు కాంగ్రెస్ పాలనలో నీళ్ళు ఇచ్చింది మేము లెక్కలు చెప్పగలం. కేటీఆర్ స్పీచ్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డగింత * తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే కదా తెలంగాణ తెచ్చుకున్నాం - పొన్నం ప్రభాకర్ మంత్రి గవర్నర్ ప్రసంగం పూర్తిగా అసత్యాలు, అభూత కల్పనగా ఉంది - కేటీఆర్ * గవర్నర్ దారుణమైన ప్రసంగం విన్నాక రాష్ట్రం ఎలా ఉండబోతుందో అర్థం అవుతోంది. * నక్క మోసం చేయనని, పులి మాంసం తినను అని వాగ్వాదం ఇచ్చినట్లు గవర్నర్ ప్రసంగం ఉంది. * మేము ఎక్కడ ఉన్న ఉన్నా ప్రజా పక్షమే. * కాంగ్రెస్ పాలనలో త్రాగు, సాగు, కరెంట్ దిక్కు లేదు. * నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ తప్ప ఏమైనా ఉందా? * కాంగ్రెస్ పాలనలో 50 ఎకరాల రైతు అయినా సరే గుంపు మేస్త్రి లాగా ఉండేవారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కామెంట్లు... * ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. * తెలంగాణ వస్తె భవిషత్ భాగుపడుతుందని ప్రజలు ఆశించారు. * గత ప్రభుత్వం పాలనలో చాలా లోపాలు ఉన్నాయి. * కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణ చేపట్టాలి. * రీ డిజైన్ ఎందుకు చేశారో? వేల కోట్లు ఎందుకు ఖర్చు చేశారో తేల్చాలి. * బీఆర్ఎస్ పాలనలో పవర్ కార్పొరేషన్ వేల కోట్ల అప్పుల్లోకి వెళ్ళింది. * బీఆర్ఎస్ పాలనలో నియంతృత్వం కొనసాగింది, అక్రమ కేసులు పెట్టారు. * రేవంత్ సీఎం అవ్వగానే ప్రగతి భవన్ వద్ద ముళ్ళ కంచెలు తొలగించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. * 90శాతం వరకు మిషన్ భగీరథ నీళ్ళు రాలేదు. * ఏ గ్రామాల్లో కూడా డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టలేదు. * ఇందిరమ్మ పాలన మళ్ళీ తెలంగాణలో రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. * 60వేల ఉద్యోగులున్న సింగరేణి, బీఆర్ఎస్ వచ్చాక 39వేలకు పరిమితం అయింది. * తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు. * మూడు వందల రిటైర్డ్ అధికారులకు మళ్ళీ ఉద్యోగం కల్పించారు. * ప్రతి ఫైల్ పై విచారణ జరిగితే నిజాలు తెలుస్తాయి. గత పదేళ్లు ఎన్నో నిర్బంధాలకు గురి అయ్యాము: పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి •బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా ప్రాంతానికి తీరని అన్యాయం జరిగింది. •రీ-డిజైన్ పేరుతో బీఆర్ఎస్ మా ప్రాంతానికి తీరని అన్యాయం చేసింది. • ఫార్మసీటి రద్దు చేస్తాం, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తాం • బాసర ట్రిపుల్ ఐటి టైప్ మరో నాలుగు ఏర్పాటు చేస్తాం. • ధరణి ప్లేస్ భూమాత ఏర్పాటు చేస్తాం, బెల్ట్ షాప్ లను రద్దు చేస్తాం. • బిసి కుల గణన చేస్తాం, ప్రతి జిల్లాకు బిసి భవన్ ఏర్పాటు చేస్తాం. • ప్రజల కోసం ఎదైనా నిరసనకు పిలుపునివ్వగానే ఇంటి ముందు పోలీసులు ఉండే వాళ్ళు. • రేవంత్ రెడ్డి సీఎం అయిన 24గంటల్లోనే ప్రగతి భవన్ కంచెలు తొలగించారు. • గత ప్రభుత్వం ఇంట్లో ఒకరికి మాత్రమే పెన్షన్ ఇచ్చేవాళ్లు.. మేము అర్హులైన అందరికీ ఇస్తాం. • వచ్చే వంద రోజుల్లో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు తప్పకుండా అమలు చేస్తాం. • వికారాబాద్, పరిగి సెగ్మెంట్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ గత ప్రభుత్వం ప్రారంభించలేదు. • గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రతిపాదించారు. • చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ బలపరిచారు • రెండవ అతిపెద్ద పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్లు స్పీకర్ వెల్లడి • గవర్నర్ ప్రగంగంపై మొదలైన ధన్యవాదాల తీర్మానం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు • ప్రతిపక్ష పార్టీ నేతగా కేసీఆర్‌ను సభలో ప్రకటించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ • శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గవర్నర్ ధన్యవాదాల తీర్మానంపై మాట్లాడనున్న మధుసూదనా చారి, దేశపతి శ్రీనివాస్ బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో సమావేశమైన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు • హాజరైన కేటీఆర్,హరీష్ రావు, తలసాని • గవర్నర్ ప్రసంగంపై కౌంటర్ ఎటాక్ చేయాలని నిర్ణయం శాసనసభ, శాసనమండలి ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. • గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో నేడు చర్చ • ప్రభుత్వ సమాధానం ఉండనుంది. • కొత్త అసెంబ్లీ కొలువు తీరిన తర్వాత జరుగుతున్న మొదటి చర్చపై ఆసక్తి • నేడు శాసనసభతో పాటు మండలిలోనూ గవర్నర్ ప్రసంగం ధన్యవాదాలు తీర్మానం పై చర్చ ఉంటుంది. • అసెంబ్లీలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదా తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. • చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద బలపరుస్తారు. • మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు • టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి బలపరుస్తారు. • బీఅర్ఎస్ పార్టి తరపున గవర్నర్ ప్రసంగంపై ఎమ్మెల్యేలు కేటీఅర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు మాట్లాడనున్నారు. • గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ విధానాలను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగంలో తీవ్రంగా విమర్శించారు. • అప్పులు భారీగా పెరిగాయని, వ్యవస్థలను దెబ్బ తీశారని గవర్నర్ ఆరోపించారు. • కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న మొదటి చర్చపై నెలకొన్న ప్రాధాన్యత. • గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగానికి, ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఎలా సాగుతుందన్న దానిపై ఆసక్తి. • అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, కాంగ్రెస్ గెలుపు అనంతరం జరుగుతున్న మొదటి చర్చ హాట్ హాట్‌గా సాగనుంది. • గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచిన అంశాలపై బీఆర్ఎస్ సభా వేదికగా ఎలా స్పందించనుంది..? • సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం ఎలా ఉండనుంది అన్న అంశం ఆసక్తికరంగా మారింది..? • ఆరు గ్యారంటీలను అమలు చేయకపోతే అసెంబ్లీ వేదికగా పోరాటమే అంటున్న - బీజేపీ ఎమ్మెల్యేల హెచ్చరిక. • ఇంకా కాన్స్టిట్యూట్ కానీ బిజినెస్ అడ్వైజర్ కమిటీ. • బీజేపీ, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ల ఎంపిక విషయంలో స్పీకర్ కార్యాలయానికి అందని లేఖలు • ఇక ఈ నెల 9న సమావేశాలు ప్రారంభమయ్యాయి. • సభ్యుల ప్రమాణ స్వీకారాలు, స్పీకర్ఎన్నిక జరిగింది. • ఉభయ సభల సంయుక్త సమావేశంలో సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఇప్పటి వరకు జరిగాయి. -
పార్టీ అభిమానులూ ఓటేయలేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీపట్ల అభిమానం ఉన్నవారు కూడా ఓటేయలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గం, రాష్ట్ర కమిటీ మూడు రోజులపాటు హైదరాబాద్‌లో సమావేశమైంది. ఈ భేటీకి కేంద్ర పరిశీలకులుగా సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ఎ.విజయ రాఘవన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం తనను కలిసిన విలేకర్లతో తమ్మినేని మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలు, పార్టీ అనుసరించిన ఎత్తుగడలు, ఫలితాలపై సమీక్షించామని చెప్పారు. సీపీఎం కుటుంబాలు మినహా పార్టీ అభిమానులు కూడా ఈసారి తమకు ఓటేయకపోవడంతో గతంతో పోలిస్తే సీపీఎం దారుణంగా దెబ్బతిన్నదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేశామని... ప్రతి ఎన్నికల్లోనూ ఇదే అనుభవం ఎదురైందని చెప్పారు. పార్టీలో లోపాలు జరిగాయని, వాటిని సమీక్షించుకొని భవిష్యత్తులో పార్టీని పటిష్టం చేయడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకున్నామని తమ్మినేని చెప్పారు. పొత్తు సాధ్యం కాక... తాము పోటీ చేసిన 19 స్థానాల్లో గెలుస్తామని భావించకపోయినా ఓట్లు తక్కువ రావడం ప్రధాన లోపంగా పార్టీ గుర్తించిందని తమ్మినేని వివరించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు విషయంలో కాలయాపన కావడం, చివరి నిమిషంలో పొత్తు సాధ్యం కాదని తేలాక ఒంటరిగా పోటీ చేయాల్సి రావడం దెబ్బతీసిందని చెప్పారు. ఎన్నికలకు సిద్ధం కావడానికి సమయం సరిపోని పరిస్థితి ఏర్పడిందని వివరించారు. మరోవైపు బీఆర్ఎస్ అహంభావ, అప్రజాస్వామిక ధోరణులను తీవ్రంగా వ్యతిరేకించిన ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేశారని తమ్మినేని విశ్లేషించారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర, రేవంత్‌రెడ్డి నాయకత్వం, కర్ణాటకలో కాంగ్రెస్ విజయం వంటి పరిణామాలన్నీ కాంగ్రెస్ గెలుపునకు తోడ్పడ్డాయని వివరించారు. గత ఎన్నికలతో పోల్చితే బీజేపీకి ఓట్లు, సీట్లు రెట్టింపయ్యాయనీ, ఇది ఓ ప్రమాదకర సంకేతమని చెప్పారు. -
‘లోక్‌సభ’కు బీజేపీ ఒంటరిగానే..
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు ఉండదని, బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కేంద్రమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల నుంచి బీజేపీ సమాన దూరం పాటిస్తుందని తేల్చి చెప్పారు. ఈ రెండు పార్టీలను గట్టిగా ఎదుర్కొని, రాష్ట్రంలో అత్యధిక సీట్లలో విజయమే లక్ష్యంగా పార్టీ కేడర్ ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్‌చార్జ్‌లు, లోక్‌సభ ప్రభారీల సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జ్ తరుణ్‌చుగ్ ముఖ్యఅతిథిగా హాజరుకాగా, పి.మురళీధర్‌రావు, బంగారు శృతి, డా.కాసం వెంకటేశ్వర్లు యాదవ్, ఇతరనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ, మద్దతు లభిస్తుందని, సర్వే సంస్థల అంచనాలకు కూడా అందని పద్ధతుల్లో అనూహ్య ఫలితాలు వస్తాయని చెప్పారు. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ఇప్పటినుంచే లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీనాయకులు, కార్యకర్తలను కిషన్‌రెడ్డి కోరారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక పార్టీ, పార్టీనేతలను లక్ష్యంగా చేసుకొని వివిధ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులపై కిషన్‌రెడ్డి సీరియస్ అయ్యారు. జిల్లా అధ్యక్షులు, పార్టీ ఇన్‌చార్జ్‌లతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయిన సందర్భంగా అభ్యంతరకర లేదా కించపరిచే పోస్టులు పెడితే వేటు తప్పదని హెచ్చరించారు. విశ్వకర్మ కింద.. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు వెయ్యి మంది.. పీఎం విశ్వకర్మయోజన కింద రాష్ట్రంలో ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వెయ్యిమంది లబ్దిదారులను నమోదు చేయించేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సూచించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో విశ్వకర్మయోజనపై జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌లతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పదిలక్షల కుటుంబాలు చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరి నైపుణ్యాభివృద్ధి, గుర్తింపు, ఆర్థిక ప్రగతి కోసం ఈ యోజనను ప్రధాని మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. -
కుక్కలు కూడా వారి వెంట పడవు
సాక్షి, హైదరాబాద్: ‘వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ అవసరం లేదు.. కుక్కలు కూడా వారి వెంట పడవు’అని శాసనమండలి సభ్యుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు తీవ్ర వ్యా ఖ్యలు చేశారు. శుక్రవారం అసెంబ్లీ ఉభయసభల సంయుక్త సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఇటీవలి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై శాసనసభ ఆవరణలో పిచ్చాపాటిగా మాట్లాడారు. ‘తొక్కుడు రాజకీయాలతోనే బీఆర్ఎస్ ఓటమి పాలైంది. అసలు విషయాలు అధిష్టానం వరకు చేరకుండా మధ్యలోనే కొందరు ఆపేశారు. జోకుడు బ్యాచ్‌కు మా పార్టీ అధిష్టానం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. వాస్తవాలు చెప్పేందుకు అధినేత అవకాశం ఇస్తే ఎవరైనా అసలు విషయం చెప్తారు. వాస్తవాలు చెప్పేవారు బయట, జోకుడుగాళ్లు లోపల ఉంటే వాస్తవాలు ఎలా తెలుస్తాయి. పార్టీ గెలుపుపై ఊహాగానాలు ఎక్కువై వాస్తవాలు మరిచిపోయారు. 2014, 2018 ఎన్నికల్లో ఇతర పార్టీల్లో గెలిచిన వారిని బీఆర్ఎస్లోకి లాగితే.. వచ్చిన వారు నిజమైన బీఆర్ఎస్ లీడర్లను అణచివేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతీసారి ఇతర పార్టీల్లో గెలిచిన వారిని బీఆర్ఎస్లోకి తెచ్చుకుంటే నేతలు గ్రూపులుగా విడిపో యారు. కొన్ని జిల్లాల్లో మా పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల్లో అసహనం పెరిగేలా చేశారు.. దానిని ఎలా మేనేజ్ చేయాలో పార్టీకి ప్రణాళిక లేకపోతే ఎలా గెలుస్తాం. ఆత్మగౌరవం ఎక్కువగా ఉండే వరంగల్ లాంటి జిల్లాల్లో ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్ లాంటి వారికి మంత్రి పదవులు ఇస్తే ఉద్యమకారులు బాధపడ్డారు. తెలంగాణవాదం, ఉద్యమం గురించి తెలియని వారికి మంత్రి పదవులు ఇస్తే ఎలా..పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓటమిని అక్కడి ఓటర్లు ఎప్పుడో నిర్ణయించారు. ఆయన జనాలకు చక్కిలిగింత పెట్టడం తప్ప ఎవరికీ రూపాయి సాయం చేయరు’అని రవీందర్రావు అన్నారు. ఆ ప్రచారాన్ని నమ్మొదు చిట్‌చాట్ పేరిట తాను అనని మాటలను అన్నట్టు గా ప్రచారం జరుగుతోందని శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్సీ రవీందర్రావు ఒక ప్రకటన విడుదల చేశారు. తాను వ్యాఖ్యలు చేసినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను ఏదైనా విషయం మాట్లాడాలని అనుకుంటే అధికారికంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్తానన్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌పై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని, ఆయన అప్పజెప్పిన అనేక బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేర్చినట్లు పేర్కొన్నారు. చిట్‌చాట్ పేరిట జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని తక్కెళ్లపల్లి కోరారు. -
నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కోసం, తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను ఆపొద్దని, వాహనదారులకు ఇబ్బంది కలిగించొద్దని పోలీసులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. అలాగే సాధారణ ట్రాఫిక్‌లోనే తన కాన్వాయ్నూ అనుమతించాలని ఆదేశించారు. ప్రజలతో పాటే తన కాన్వాయ్ ఉండేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండానే తన కాన్వాయ్‌ను తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని ఈ సందర్భంగా అధికారులు ఆయనతో చెప్పినట్లు తెలుస్తోంది. సీఎంతో పాటు మంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖుల పర్యటన సమయంలో ట్రాఫిక్ నిలిపివేత గురించి తెలిసిందే. ప్రత్యేకించి హైదరాబాద్‌లో అది మరీ నరకంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న తాజా నిర్ణయంపై ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యే అవకాశం కనిపిస్తోంది. కొత్త కాన్వాయ్ వద్దు! కాన్వాయ్ విషయంలోనూ ఆయన మరో నిర్ణయం తీసుకున్నారు. కొత్త కార్లు కొనుగోలు చేయకుండా.. తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను 15 నుంచి 9కి కుదించాలని ఆదేశించారు. అలాగే కాన్వాయ్‌లోనే ఉన్న అన్ని తెల్ల రంగు కార్లకు నల్ల రంగు వేయాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్న నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
‘ప్రభుత్వం గవర్నర్‌తో అసత్యాలు చెప్పించింది’
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం ఏం లేదని, కొత్త ప్రభుత్వం చేసే పనికి స్పష్టత ఇవ్వలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం గవర్నర్ ప్రసంగం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మేనిఫెస్టో చదవటానికి మాత్రమే జాయింట్ సెషన్ పెట్టినట్టు కనిపిస్తోందన్నారు. గతంలో తమ ప్రభుత్వం ఎన్నో అవార్డులు అందుకొని దేశంలో నంబర్ 1 స్థానంలో నిలిచిందని తెలిపారు. పంటల విస్తీర్ణం పెరిగింది అనేది వాస్తవమని, 3 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అన్నారు. తలసరి ఆదాయం, ఐటీ ఎగుమతులు తెలంగాణ అభివృద్ధి సాధించిందని తెలిపారు. కానీ అనేక రంగాల్లో అభివృద్ధి సాధించిన విషయాన్ని గవర్నర్ చెప్పలేదని అన్నారు. ఇవన్నీ చూసిన గవర్నర్ ఇప్పుడు.. అప్పుడు ఏం మాట్లాడారో సమీక్ష చేసుకోవాలన్నారు. ప్రజలు స్వేచ్ఛా వాయువులు పిలుస్తున్నారని గవర్నర్ చెప్పటం హాస్యాస్పదమని అన్నారు. గవర్నర్ ఏదో చెప్తారని ఆశ పడ్డామని, ప్రభుత్వ పాలసీలు ఏ ఒక్కటి కూడా స్పష్టంగా చెప్పలేదని తెలిపారు. ప్రభుత్వం గవర్నర్ నుంచి అసత్యాలు చెప్పించిందని, దళిత బంధు ప్రస్తావన లేదన్నారు. పండిన పంట ఇప్పుడే అమ్మకండి అంటూ ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 500 బోనస్ ఇచ్చి కొంటామని అన్నారని తెలిపారు. ఎందుకు ఇప్పటి వరకు కొనలేదని సూటీగా ప్రశ్నించారు. చదవండి: Tamilisai Soundararajan: ‘కాళేశ్వరం’ అవినీతిపై గవర్నర్ కీలక ప్రకటన -
జనసేనతో కటీఫ్.. ఓటమి కన్నా ఆ అవమానమే ఎక్కువగా!
‘‘బీజేపీతో మాది బలమైన బంధం. భవిష్యత్తులో రెండు పార్టీలు కలిసే ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహిస్తాయి..’’ పవన్ ఎంతో కాన్ఫిడెంట్‌గా పలుసార్లు చేసిన ప్రకటన ఇది. అయితే బీజేపీ మాత్రం పవన్ విషయంలో ఇంత కాన్ఫిడెంట్‌గా లేదు. అయినప్పటికీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం పొత్తుగా ముందుకు వెళ్లింది. ఇప్పుడేమో.. భవిష్యత్తు ఎన్నికల్లో ఎలాంటి పొత్తు ఉండబోవని కరాఖండిగా చెప్పేసింది. అయితే.. జనసేనతో కటీఫ్‌కు గల కారణం తెలిసిపోయింది!. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమీక్ష తర్వాత.. సీట్లతో పాటు ఓటింగ్ శాతం పెరిగిందని బీజేపీ నేతలు సంతోషంగా ప్రకటన చేశారు. కానీ, అది నామ్ కే వాస్తే ప్రకటన మాత్రమే!. ఓటమిలో పవన్ పార్టీతో పొత్తు ప్రభావం చూపించిందని అటు ఢిల్లీ పెద్దలు, ఇటు రాష్ట్ర కీలక నేతలు కూడా ఒక అంచనాకి వచ్చారు. అధికారం కైవసం చేసుకోవడం సంగతి పక్కనపెడితే.. ఎక్కువ సీట్లు గెలిచే బీజేపీ అవకాశాల్ని పవన్ సారధ్యంలోని జనసేన పార్టీ ఘోరంగా దెబ్బ తీసిందనేది అంచనా సారాంశం!!. 🔸ప్చ్.. ఒంటరిగా పోటీ చేసి ఉంటేనా? అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కనీసం రెండు మూడు సీట్లు గెల్చుకునే బీజేపీ.. 2018 టైంలో ముందస్తు ఎన్నికలతో దారుణంగా నష్టపోయింది!. అయితే ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉందని నమ్మిన కాషాయం పార్టీ.. తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలవొచ్చని, పైగా జీహెచ్ఎంసీ(2020) ఫలితాలతో గ్రేటర్లో కచ్చితంగా నాలుగైదు సీట్లు ఖాయమని అనుకుంది. కానీ.. అంతమంది (47) కార్పొరేటర్లు ఉండి కూడా కనీసం ఇంపాక్ట్ చూపించలేకపోయింది. గ్రేటర్లో తమ అంచనాలు తప్పడంలో జనసేనతో పొత్తు కూడా కారణమేనని బీజేపీ అనుకుంటోంది. పవన్ పార్టీతో కాకుండా సొంతంగా పోటీ చేసి ఉంటే.. గ్రేటర్లో బీజేపీ నాలుగైదు సీట్లు గెలిచి ఉండేదేమోనని విశ్లేషకుల అభిప్రాయం. 🔸అంటీముట్టనట్లు! అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వచ్చాక.. తెలంగాణ కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశాడు పవన్. కానీ, పొత్తు పార్టీతో మాత్రం తొలి నుంచే అంటీముట్టనట్లే ఉంటూ వస్తున్నాడు. ఓటమి గల కారణాలపై కనీస విశ్లేషణ జరపలేదని పార్టీ శ్రేణులే అసంతృప్తితో ఉండగా.. రాష్ట్ర బీజేపీ నేతలతో, మరోవైపు కనీసం బీజేపీ అగ్రనేతలతో కనీసం ఫోన్లో కూడా పవన్ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడా? అని బీజేపీ శ్రేణులు నిలదీస్తున్నాయి. ఎన్నికల ప్రచారం విషయంలోనూ పవన్ సీరియస్‌గా లేకపోవడంతో.. పవన్ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నాడా? అనే చర్చా నడిచింది. 🔸ఆ అవమానం ఎందుకనుకుందో! తెలంగాణ ఎన్నికల్లో 32 సీట్లలో పోటీ చేసి తీరతామనే ప్రకటన నుంచి.. బీజేపీతో పొత్తు, బీజేపీ అసంతృప్తుల రచ్చ, తదనంతరం 8 సీట్లలో పోటీ చేసింది. ఆ టైంలోనే కొల్లాపూర్ ఇండిపెండెంట్ అభ్యర్థి కర్నె శిరీష(బర్రెలక్క)ను పోలుస్తూ.. పవన్‌ను ఏకిపారేశారు పలువురు. ఒంటరి పోరు అంటే ఎలా ఉంటుందో ఆ అమ్మాయిని చూసి నేర్చుకోవాలంటూ సూచించారు. కట్ చేస్తే.. రాజకీయ ప్రత్యర్థులు, ఆఖరికి నెట్లో ఎన్నికల ఫలితాల్లో జనసేనను మామూలుగా ట్రోల్ చేయలేదు. ఎనిమిది మంది జనసేన అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు. ఆ టైంలో బర్రెలక్క కంటే ఓట్లు తక్కువ వచ్చాయనే పాయింట్ మీద తెలంగాణ పౌర సమాజం సెటైర్లు, విమర్శలు గుప్పించింది. తాజాగా.. పలాస బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం ఇదే అంశాన్ని ప్రస్తావించి మరీ పవన్ కల్యాణ్‌ను ఏకిపారేశారు. ఇంత అవమానాలు ఎదుర్కొంటున్న వ్యక్తితో వచ్చే ఎన్నికల్లోనూ పొత్తుకు వెళ్తే.. ఇలాంటి ఫలితాలే వస్తాయనే అంచనాకి వచ్చింది కమలం పార్టీ. 🔸చీప్‌గా చూసిన ప్రజలు కేడర్ వద్దని వారించినా.. చివరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం ముందు అసంతృప్తులు నిరసనలను వ్యక్తి చేసినా సరే జనసేనతో పొత్తుకు వెళ్లింది బీజేపీ అధిష్టానం. కానీ, ఊహించని రేంజ్లో దెబ్బ తింది. పదేళ్లుగా జనసేన పార్టీ, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వెలగబెడుతుంది ఏంటో తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. అలాంటి వ్యక్తితో పొత్తును భరించగలరా?. పవన్‌తో స్టేజ్ మీద కూర్చున్నప్పడు తెలంగాణ ప్రజలు ఆ పార్టీని కూడా చీప్‌గా చూడకుండా ఉండగలరా?. ఆ సంగతి పక్కనపెడితే.. పవన్‌తో, జనసేన పార్టీతో ప్రజాకర్షణ, పొలిటికల్‌మైలేజ్ లాంటివేం ఈ ఎన్నికల్లో తమకు కలిసిరాలేవని, ఇక మీదటా రాకపోవచ్చనే కంక్లూజన్‌కి బీజేపీ హైకమాండ్ వచ్చింది. అందుకే పొత్తు తెంచుకోవాలని తెలంగాణ బీజేపీకి సూచించి ఉండొచ్చు. అన్నింటికి మించి.. పవన్ కల్యాణ్ తెలుగు రాజకీయాల్లో అపరిచితుడు. జనసైనికులు మాత్రమే కాదు తన నిలకడలేమితో ఒకానొక దశలో బీజేపీని సైతం అయోమయంలో పడేశాడు పవన్. టీడీపీతో చెట్టాపట్టాలేసుకుంటూ.. పేదల వ్యతిరేకిగా ముద్రపడిన చంద్రబాబులాంటి పెత్తందారి లీడర్‌కు మద్ధతుగా నిలుస్తూ వస్తున్నాడు. అదే సమయంలో బీజేపీతో బలమైన దోస్తీ అంటూ ప్రకటనలు ఇచ్చాడు. తద్వారా.. పవన్‌ను ఏమీ అనలేని దైన్యంలో బీజేపీ ఉందా? అనే అనుమానం తెలుగు ప్రజల్లో ఏర్పడింది. ఆ అపోహను తొలగించే యత్నంలో భాగంగానే అనైతిక బంధంలో ఉన్న పవన్‌కు బీజేపీ కటీఫ్ చెప్పేసిందా? అనే కోణంలోనూ చర్చ నడుస్తోంది ఇప్పుడు. వీడియో: పవన్ నీచుడు.. అందుకే మా రాజీనామా -
TS: పార్లమెంట్ ఎన్నికలు..పొత్తులపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ నేతలు, క్యాడర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. డిసెంబర్ చివరి వారంలో తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారని తెలిపారు. బీజేపీ కార్యాలయంలో శుక్రవారం కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ ప్రబారీలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ‘బీఆర్ఎస్, బీజేపీ పొత్తు ఉంటుందనేది ప్రచారం మాత్రమే. లోకసభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పై సమానంగా పోరాటం చేస్తాం. లోక్‌సభలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. తెలంగాణలో రాజకీయంగా బీజేపీకి మంచి అవకాశముంది. సర్వే సంస్థలకు సైతం అందని విధంగా లోక్‌సభ ఫలితాలుంటాయి’ అని కిషన్ రెడ్డి తెలిపారు. ‘రేపటి నుంచి తెలంగాణలో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కొత్తగా ఎన్నికైన 8మంది బీజేపీ ఎమ్మెల్యేలు అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారు. మూడోసారి నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడబోతోంది. పార్టీకి సంబంధించి అన్ని కమిటీల నియామకాలు పూర్తిచేయాలి’ అని నేతలకు కిషన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇదీచదవండి..‘కాళేశ్వరం’ అవినీతిపై గవర్నర్ కీలక ప్రకటన -
TS: ‘కాళేశ్వరం’ అవినీతిపై గవర్నర్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఉభయ సభలను ఉద్దేశించి తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం ప్రసంగించారు. అంతా ఊహించినట్లుగానే ఆరు గ్యారెంటీల అమలుతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకునే విషయంలో గవర్నర్ తన ప్రసంగంలో క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండింటిని ఇప్పటికే తమ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసిందన్నారు. మిగిలిన వాటిని 100 రోజుల్లో అమలులోకి తీసుకువస్తామ్ని చెప్పారు. మహాలక్ష్మి స్కీమ్‌లో మిగిలిన హామీల అమలుకు కసరత్తు ప్రారంభించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై తమ ప్రభుత్వం విచారణ జరిపిస్తుందని గవర్నర్ తెలిపారు. ‘తొమ్మిదేళ్లలో తెలంగాణ ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు. ఆర్థిక పరిస్థితిపై వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచుతాం. దివాళా తీసిన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే మా ప్రభుత్వ లక్ష్యం. తెలంగాణలో మార్పును ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా పాలన సాగాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజా దర్భార్‌లో ప్రజాసమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఇది మా ప్రభుత్వం అనే భావన ప్రజల్లో కలుగుతోంది’ అని గవర్నర్ అన్నారు. ‘యూపీఏ ప్రభుత్వమే తెలంగాణను ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం రోజే తన లక్ష్యాలను స్పష్టంగా చెప్పారు. ఇది నిజమైన ప్రజా పాలన. నిరుద్యోగుల కలను మా ప్రభుత్వం నెరవేరుస్తుంది. అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షల మేరకే పాలన సాగిస్తాం. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు’అని గవర్నర్ అన్నారు. ‘లక్ష్యాలను సాధించేందుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. డ్రగ్స్ పై మా ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుంది. మహాలక్ష్మి స్కీమ్‌లోని మిగిలిన పథకాలను త్వరలో అమలు చేస్తాం. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. పాలకులు సేవకులే తప్ప పెత్తందారులు కాదు. 10 ఏళ్ల నిర్బంధపు పాలన నుంచి విముక్తి కావాలని ప్రజలు కోరుకున్నారు. మా పాలన పౌరహక్కులు, ప్రజాపాలనకు నాంది పలికింది. వైద్య ఖర్చులు పెరగడంతో ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచాం. త్వరలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తాం’ అని గవర్నర్ తెలిపారు. ఇదీచదవండి..యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ -
TS:యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్
సాక్షి,హైదరాబాద్ : తుంటి ఎముక సర్జరీ చేయించుకుని కోలుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్ కాసేపటి క్రితం యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయి బంజారాహిల్స్‌లోని నందినగర్‌లోని ఆయన పూర్వ నివాసానికి వెళ్లారు. కేసీఆర్ కొద్దిరోజుల పాటు నందినగర్‌లోని ఇంట్లోనే ఉండనున్నారు. సర్జరీకి సంబంధించి డాక్టర్లకు అందుబాటులో ఉండాలన్న కారణంతోనే కేసీఆర్ గజ్వేల్‌లోని తన ఫామ్‌హౌజ్‌కు వెళ్లకుండా నందినగర్‌లోని ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. తొమ్మిదిన్నర ఏళ్ళ తర్వాత నందినగర్‌లోని సొంత ఇంటిలో కేసీఆర్ బస చేయనున్నారు. నందినగర్ ఇంటిని 2000 సంవత్సరంలో నిర్మించారు. 2021 జులై 13న ఇంటి మరమ్మతు పనులను కేసీఆర్ పరిశీలించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ ఇంటి నుంచే కేసీఆర్ కార్యాచరణ రూపొందించారు. తొమ్మిదిన్నరేళ్ల తర్వాత సొంత ఇంటికి కేసిఆర్ వస్తుండడంతో పూలదండలతో అలంకరించిన కుటుంబ సభ్యులు ఉదయమే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫాంహౌజ్ బాత్రూమ్లో జారిపడడంతో తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. వెంటనే ఆయనను సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించగా వైద్యులు ఆయనకు తుంటి ఎముకు రిప్లేస్మెంట్ సర్జరీ చేశారు. సర్జరీ తర్వాత వారంరోజుల పాటు ఆస్పత్రిలోనే ఉన్న ఆయనను శుక్రవారం వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆపరేషన్ కారణంగా కేసీఆర్ అసెంబ్లీలో ఇంకా ఎమ్మెల్యేగా కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇదీచదవండి..మాజీ సీఎం కేసీఆర్ భద్రత.. ప్రభుత్వ కీలక నిర్ణయం -
TS:మాజీ సీఎం కేసీఆర్ భద్రత.. ప్రభుత్వ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు భద్రత కుదించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు జెడ్ ప్లస్ కేటగిరిలో ఉన్న కేసీఆర్ భద్రతను వై కేటగిరీకి కుదించారు. 4+4 గన్మెన్లతో పాటు ఒక ఎస్కార్ట్ వాహనాన్ని మాత్రమే కేసీఆర్ భద్రత కోసం కేటాయించనున్నారు. ఇంటి ముందు సెంట్రీ పహారా ఉంచనున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులకు భద్రత తగ్గించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా మాజీ మంత్రులకు మాత్రం 2+2 గన్మెన్లను ఉంచి ఎమ్మెల్యేగా లేని వారికి గన్మెన్లను పూర్తిగా తొలగించారు. ఇక మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లకు ఉన్న గన్మెన్లను తొలగించారు. ఇదీచదవండి..ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు -
TS:ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు..ట్రాఫిక్ జామ్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణికి ప్రజల నుంచి భారీగా స్పందన వస్తోంది. వారానికి రెండు రోజులు మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో మంగళ, శుక్రవారాల్లో జ్యోతిరావ్ పూలే ప్రజాభవన్(గత ప్రగతిభవన్)కు భారీగా తరలివస్తున్నారు. ఈ వారంలో రెండోసారి జరిగే శుక్రవారం(డిసెంబర్15) ప్రజావాణి కోసం ప్రజలు పోటెత్తారు. ఉదయం 5 గంటలకే ప్రజాభవన్ ముందు క్యూ కట్టారు. ఈ క్యూ లైను తొమ్మిది గంటలకల్లా రెండు కిలోమీటర్లకుపైగా పెరిగిపోయింది. దీంతో బేగంపేట ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రజావాణికి వచ్చిన వారిని క్రమపద్ధతిలో నిల్చోబెట్టి ఒక్కొక్కరిగా లోపలికి పంపడం పోలీసులకు కొంత టఫ్ టాస్క్‌గా మారింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలందరూ హైదరాబాద్ ప్రజాభవన్కే రానవసరం లేకుండా ఎమ్మెల్యేలతో నియోజకవర్గాల్లోనూ ప్రజావాణి నిర్వహింపజేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజా వాణి నియోజకవర్గాల్లోనూ నిర్వహించడం వల్ల స్థానిక సమస్యలు ఎక్కడికక్కడే త్వరగా పరిష్కారమవడమే కాకుండా ప్రజలకు హైదరాబాద్ దాకా వచ్చే భారం తగ్గుతుంది. ప్రజాభవన్ వద్ద రద్దీ తగ్గి ఇక్కడి యంత్రాంగం మీద ఒత్తిడి తగ్గే అవకాశముంటుంది. ప్రజావాణిలో ఎక్కువగా భూముల సంబంధిత సమ్యలు, ధరణి, ఆరోగ్యం,నిరుద్యోగం అంశాలపైనే ఎక్కువ అర్జీలు వస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజాదర్భార్ పేరుతో ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమానికి తొలిరోజు సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా హాజరై ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఆ తర్వాత కార్యక్రమం పేరును ప్రజావాణిగా పేరుమార్చారు. అప్పటి నుంచి ఒక్కో రోజు ఒక్కో మంత్రి హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు ప్రజావాణికి మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ హాజరయ్యారు. ఇదీచదవండి..TS: నేటినుంచి జీరో టికెట్ -
TS:గవర్నర్ ప్రసంగంపై ఉత్కంఠ!
సాక్షి,హైదరాబాద్:తెలంగాణలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కాసేపట్లో అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంపై సామాన్య ప్రజలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో మిగిలిన గ్యారెంటీల అమలు ఎపట్టి నుంచి అనేది తెలుసుకోవడానికి ప్రజలు వేచిచూస్తున్నారు. గ్యారెంటీల అమలుపై గవర్నర్ ప్రసంగంలో క్లారిటీ ఇచ్చే ఛాన్సుందని భావిస్తున్నారు. ముఖ్యంగా రూ.4వేల పెన్షన్,రూ.2 లక్షల రుణమాఫీ, ప్రతి మహిళకు నెలకు రూ.2500 నగదు బదిలీ, రూ.500కు గ్యాస్ సిలిండర్‌పై ప్రభుత్వం గవర్నర్ ద్వారా ఎలాంటి ప్రకటన చేస్తుందనే ఉత్కంఠ నెలకొంది. వీటితో పాటు బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో భారీ ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పదేపదే ఆరోపించిన విషయం తెలిసిందే. అదే పార్టీ ఇప్పుడు అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల్లో అవినీతికి సంబంధించి చర్యలపై గవర్నర్ ఏదైనా వెల్లడిస్తారా అనే చర్చ జరుగుతోంది. కాగా, గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడుతుంది మరుసటి రోజు సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరగనున్న ఈ తొలి చర్చలోనే ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి మధ్య అసెంబ్లీలో మాటల తూటాలు పేలే ఛాన్సుందని తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి క్యాబినెట్లోనే తీసుకుంటామని చెప్పిన నిర్ణయాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. దీంతో చర్చ వాడివేడిగా జరగనుంది. ఇదీచదవండి.. నేటినుంచి జీరో టికెట్ -
Dec15th: తెలంగాణ అసెంబ్లీ లైవ్ అప్డేట్స్
మంత్రులు, ఎంఐఎం ఎమ్మెల్యేలతో సీఎం భేటీ తన ఛాంబర్లో మంత్రులతో సీఎం రేవంత్ ప్రత్యేక భేటీ హాజరైన మంత్రులు శ్రీధర్‌బాబు, మల్లు భట్టి విక్రమార్క మాజీ మంత్రి మల్లారెడ్డి కామెంట్స్ మల్కాజ్గిరి ఎంపీగా నేను పోటీ చేయను... మా కుటుంబం నుంచి ఇద్దరం ఎమ్మెల్యేలం అయ్యాం ఇక చాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మా సహకారం ఉంటుంది గవర్నర్ స్పీచ్‌పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి కామెంట్స్ గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదు కొత్త ప్రభుత్వం చేసే పనిపై స్పష్టత ఇవ్వలేదు మేనిఫెస్టో చదవటానికి మాత్రమే జాయింట్ సెషన్ పెట్టినట్టు కనిపిస్తోంది గత ప్రభుత్వం దేశంలో నంబర్ 1 స్థానంలో నిలిపింది పంటల విస్తీర్ణం పెరిగింది అనేది వాస్తవం 3 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తోంది తలసరి ఆదాయం, ఐటీ ఎగుమతులు వృద్ధి చెందాయి ఇవన్నీ చూసిన గవర్నర్ ఇప్పుడు అప్పుడు ఏం మాట్లాడారో సమీక్ష చేసుకోవాలి ప్రజలు స్వేచ్ఛా వాయువులు పిలుస్తున్నారని గవర్నర్ చెప్పటం హాస్యాస్పదం గవర్నర్ ఏదో చెప్తారని ఆశ పడ్డాం గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ బీఆర్ఎస్ఎల్పీ ఆఫీసులో భేటీ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ దిశానిర్దేశం చేస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ ముగిసిన గవర్నర్ ప్రసంగం.. ముఖ్యాంశాలివే.. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణ జరిపిస్తాం తొమ్మిదేళ్లలో ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచుతాం దివాళా తీసిన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే మా లక్ష్యం తెలంగాణలో మార్పును ప్రజలు గమనిస్తున్నారు ప్రజాస్వామ్య బద్ధంగా పాలన సాగాలని కోరుకుంటున్నారు ప్రజా దర్భార్‌లో ప్రజాసమస్యలు పరిష్కారం అవుతున్నాయి ఇది మా ప్రభుత్వం అనే భావన ప్రజల్లో కలుగుతోంది యూపీఏ ప్రభుత్వమే తెలంగాణను ఏర్పాటు చేసింది సీఎం రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం రోజే తన లక్ష్యాలను స్పష్టంగా చెప్పారు ఇది నిజమైన ప్రజా పాలన ఆరు గ్యారెంటీల్లో రెండింటిని ఇప్పటికే అమలు చేశాం నిరుద్యోగుల కలను మా ప్రభుత్వం నెరవేరుస్తుంది అమరుల ఆశయాలను, ప్రజల ఆకాంక్షల మేరకే పాలన తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు లక్ష్యాలను సాధించేందుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం డ్రగ్స్ పై మా ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుంది ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో పూర్తి చేస్తాం మహాలక్ష్మి స్కీమ్‌లోని మిగిలిన పథకాలను త్వరలో అమలు చేస్తాం మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం పాలకులు సేవకులే తప్ప పెత్తందారులు కాదు 10 ఏళ్ల నిర్బంధపు పాలన నుంచి విముక్తి కావాలని ప్రజలు కోరుకున్నారు మా పాలన పౌరహక్కులు, ప్రజాపాలనకు నాంది పలికింది వైద్య ఖర్చులు పెరగడంతో ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచాం త్వరలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తాం ప్రారంభమైన గవర్నర్ ప్రసంగం కాళోజి కవితతో స్పీచ్ ప్రారంభించిన గవర్నర్ తమిళిసై సమావేశమైన ఉభయ సభలు హాజరైన స్పీకర్, శాసన మండలి చైర్మన్ కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ కాసేపట్లో అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. తెలంగాణలో ఉభయసభలను ఉద్దేశించి అసెంబ్లీలో ప్రసంగించనున్న గవర్నర్ తమిళిసై 11.30కు ప్రారంభమవనున్న సభ ప్రసంగం ముగిసిన తర్వాత వాయిదా పడనున్న సభ రేపటి నుంచి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ గ్యారెంటీలన్నీ ఎప్పటి నుంచి అమలు చేస్తారనేదానిపై గవర్నర్ ప్రసంగంలో క్లారిటీ ఇచ్చే ఛాన్స్ గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బీఏసీ మీటింగ్ సభ ఎన్నిరోజులు నడపాలనేదానిపై నిర్ణయం -
TS Govt: మాజీలకు గన్మెన్ల తొలగింపు
సాక్షి, హైదరాబాద్: ప్రమాణ స్వీకారం జరిపిన మరుక్షణం నుంచే వివిధ శాఖలు, విభాగాలకు సంబంధించి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ఈ క్రమంలో పలు విభాగాలకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. తాజాగా తెలంగాణ మరో నిర్ణయం ప్రకటించింది. రాష్ట్రంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భద్రత తొలగించింది. వాళ్లకు గన్మెన్లకు తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.