3వ వార్షికోత్సవం‌: ఒక్క రూపాయికే రెడ్‌మి 4ఏ | Xiaomi's 3rd Mi Anniversary Sale Begins Thursday, Features Re.1 Flash Sale, and More | Sakshi
Sakshi News home page

3వ వార్షికోత్సవం‌: ఒక్క రూపాయికే రెడ్‌మి 4ఏ

Jul 18 2017 6:35 PM | Updated on Sep 5 2017 4:19 PM

3వ వార్షికోత్సవం‌: ఒక్క రూపాయికే రెడ్‌మి 4ఏ

3వ వార్షికోత్సవం‌: ఒక్క రూపాయికే రెడ్‌మి 4ఏ

ఎంఐ 3వ వార్షికోత్సవాన్ని భారత్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేయనున్నట్టు షావోమి వెల్లడించింది.

ఎంఐ మ్యాక్స్‌ 2ను షావోమి గ్రాండ్‌గా మంగళవారం భారత మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. ఈ లాంచింగ్‌ సందర్భంగానే కంపెనీ తమ ఎంఐ 3వ వార్షికోత్సవాన్ని భారత్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేయనున్నట్టు వెల్లడించింది. ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కంపెనీ ఓ స్పెషల్‌ సేల్‌ను కూడా నిర్వహించనుంది. జూలై 20, జూలై 21వ తేదీల్లో తమ యాక్ససరీస్‌పై బంపర్‌ డిస్కౌంట్లు, ఒక్క రూపాయికే ఫ్లాష్‌ సేల్‌ను అందిస్తుంది. కొత్తగా లాంచైన స్మార్ట్‌ఫోన్లు రెడ్‌మి 4, రెడ్‌మి నోట్‌4లను కంపెనీ ఈ సేల్‌లో అందుబాటులోకి రానున్నాయి.
 
ఒక్క రూపాయి ఫ్లాష్‌ సేల్‌ కింద రెడ్‌మి 4ఏ, వై-ఫై రిపీటర్‌ 2, 10,000 ఎంఏహెచ్‌ ఎంఐ పవర్‌ బ్యాంక్‌ 2లను అందుబాటులో ఉంచుతున్నట్టు షావోమి చెప్పింది. గోయిబిబో ద్వారా దేశీయ హోటల్స్‌ బుకింగ్‌ చేసుకునే వారికి రూ.2000 తగ్గింపును షావోమి ప్రకటించింది. అంతేకాక ఎస్‌బీఐ డెబిట్‌, క్రెడిట్‌ కార్డు హోల్డర్స్‌కు అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్‌, 8000 రూపాయలకు మించి లావాదేవీలు చేస్తే ఒక్కో కార్డుపై 500 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను ఇవ్వనున్నట్టు తెలిపింది. 
 
కొత్తగా లాంచైన ఎంఐ మ్యాక్స్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ కూడా జూలై 20వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులోకి రానుంది. అప్పటి నుంచి స్టాక్స్‌ అయిపోయే వరకు దీని విక్రయించనున్నామని కంపెనీ చెప్పింది. రెడ్‌మి 4, రెడ్‌ మి నోట్‌ 4, రెడ్‌మి 4ఏ స్మార్ట్‌ఫోన్లు కూడా ఈ రెండు రోజుల సేల్‌లో అందుబాటులో ఉంటాయి. ఎంఐ క్యాప్సల్స్‌ ఇయర్‌ఫోన్స్‌, ఎంఐ హెడ్‌ఫోన్స్‌ కంఫర్ట్‌, ఎంఐ ఇన్‌-ఇయర్‌ హెడ్‌ఫోన్స్‌ ప్రొ హెచ్‌డీ, ఎంఐ ఇన్‌-ఇయర్‌ హెడ్‌ఫోన్స్‌ బేసిక్‌, ఎంఐ సెల్ఫీ స్టిక్‌, ఎంఐ వీఆర్‌ ప్లే వంటి యాక్ససరీస్‌పై 300 రూపాయల వరకు కంపెనీ డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేయనుంది.
 
10 రెడ్‌మి 4ఏ ఫోన్లు, 10000 ఎంఏహెచ్‌ సామర్థ్యమున్న 25 పవర్‌ బ్యాంకులు, 15 వైఫై రిపీటర్‌ 2 యూనిట్లు ఒక్క రూపాయి ఫ్లాష్‌ సేల్‌లో యూజర్లకు అందుబాటులో ఉంటాయి. ఈ ఫ్లాష్‌ సేల్‌ను యూజర్లు తమ సోషల్‌ ఛానళ్ల ద్వారా కూడా షేర్‌ చేసుకోచ్చని షావోమి పేర్కొంది. రెండు రోజుల్లోనూ ఈ ఫ్లాష్‌ సేల్‌ ఉదయం 11 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకి నిర్వహించనుంది.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement