రెడ్‌మి 4ఏలో కొత్త వేరియంట్‌ లాంచ్‌ | Xiaomi Redmi 4A 3GB RAM, 32GB Storage Variant Launched in India | Sakshi
Sakshi News home page

రెడ్‌మి 4ఏలో కొత్త వేరియంట్‌ లాంచ్‌

Aug 29 2017 3:20 PM | Updated on Sep 17 2017 6:06 PM

రెడ్‌మి 4ఏలో కొత్త వేరియంట్‌ లాంచ్‌

రెడ్‌మి 4ఏలో కొత్త వేరియంట్‌ లాంచ్‌

రెడ్‌మి 4ఏ స్మార్ట్‌ఫోన్‌ కొత్త వేరియంట్‌ను షావోమి మంగళవారం లాంచ్‌ చేసింది.

రెడ్‌మి 4ఏ స్మార్ట్‌ఫోన్‌ కొత్త వేరియంట్‌ను షావోమి మంగళవారం లాంచ్‌ చేసింది. ఒరిజినల్‌ హ్యాండ్‌సెట్‌కు అదనపు ర్యామ్‌, స్టోరేజ్‌తో ఈ వేరియంట్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. కొత్తగా తీసుకొచ్చిన ఈ వేరియంట్‌ 3జీబీ ర్యామ్‌, 32జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌ను కలిగి ఉంది. దీని ధర 6,999 రూపాయలు. ఎంఐ.కామ్‌, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ ఇండియా, పేటీఎం, టాటా క్లిక్‌లలో గురువారం నుంచి ఈ ఫోన్‌ విక్రయానికి వస్తోంది. '' సర్‌ప్రైజ్‌, మేము అద్భుతమైన ధర రూ.6,999లో రెడ్‌మి 4ఏ(3జీబీ ర్యామ్‌+32జీబీ ఫ్లాష్‌ మెమరీ) కొత్త వేరియంట్‌ను లాంచ్‌ చేస్తున్నాం'' అని షావోమి ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, షావోమి వైస్‌ప్రెసిడెంట్‌ మను కుమార్‌ జైన్‌ ట్వీట్‌ చేశారు. ఈ ఏడాది మార్చిలో రెడ్‌మి 4ఏ స్మార్ట్‌ఫోన్‌ను షావోమి లాంచ్‌చేసిన సంగతి తెలిసిందే. దీని ధర రూ.5,999. లాంచ్‌ చేసినప్పుడు ఈ ఫోన్‌కు 2జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌ కలిగి ఉంది. ప్రస్తుతం స్టోరేజ్‌ను, ర్యామ్‌ను మరింత పెంచుతూ కొత్త వేరియంట్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. 
 
రెడ్‌మి 4ఏ ఫీచర్లు...
హైబ్రిడ్‌ డ్యూయల్‌ సిమ్‌ కార్డు స్లాట్‌
ఎంఐయూఐ 8 ఆధారిత ఆండ్రాయిడ్‌ 6.0 మార్ష్‌మాలో
5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
1.4గిగాహెడ్జ్‌ క్వాడ్‌ కోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 425ఎస్‌ఓసీ
13 ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
4జీ వాయిస్‌ఓవర్‌ ఎల్టీఈ
3120 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌ను మైక్రోఎస్డీ కార్డు ద్వారా 128జీబీ వరకు పెంపు

Advertisement
 
Advertisement
Advertisement