వీడియోకాన్ కొత్త మొబైల్‌..ధర ఎంత? | Videocon 'Metal Pro 2' launched at Rs 6,999 | Sakshi
Sakshi News home page

వీడియోకాన్ కొత్త మొబైల్‌..ధర ఎంత?

Aug 21 2017 7:16 PM | Updated on Sep 17 2017 5:48 PM

వీడియోకాన్  కొత్త మొబైల్‌..ధర ఎంత?

వీడియోకాన్ కొత్త మొబైల్‌..ధర ఎంత?

వీడియోకాన్ మొబైల్స్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది.

న్యూఢిల్లీ: వీడియోకాన్ మొబైల్స్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌  చేసింది.  సరసమైన ధరలో  ‘మెటల్‌ ప్రో 2’  పేరుతో  ఈ డివైస్‌ను  ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌ ఆధారంగా పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను  రూ.6,999గా నిర్ణయించింది. ఎస్‌ఓఎస్‌-బీ సేఫ్‌  ఫీచర్‌తోపాటు  ప్రభుత్వం తప‍్పనిసరి చేసిన పానిక్‌ బటన్‌తో అందుబాటులో వస్తోంది.  అంతేకాదు ‘ఈరోస్‌ నౌ’  సంవత్సరం చందా, గేమ్‌ లాట్‌ అనే పెయిడ్‌ గేమ్‌ను ఉచితంగా అందిస్తోంది.  గోల్డ్‌, స్పేస్‌ గ్రే కలర్స్‌లో  అన్ని రీటైల్‌ స్టోర్లలో ఈ నెల చివరినుంచి  కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది.

మెటల్ ప్రో 2 ఫీచర్లు
5.0 అంగుళాల డిస్‌ప్లే
720x1280  రిజల్యూషన్‌
2 జీబి ర్యామ్
16జీబీ స్టోరేజ్‌
128జీబీ దాకా విస్తరించుకునే సదుపాయం
13ఎంపీ వెనుక కెమెరా
 3.2 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్‌ఎల్‌ఈడీ  ఫ్లాష్
2000ఎంఏహెచ్‌ బ్యాటరీ
అర్ధవంతమైన ఆవిష్కరణల పట్ల తాము కట్టుబడి ఉన్నామనీ, మెటల్ ప్రో 2 అనేది మెరుగైన మరియు అద్భుతమైన పరికరంగా చెప్పవచ్చనీ వీడియోకాన్ మొబైల్స్ సీఈవో అక్షయ్ దూత్ ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారుల అవసరాలను దృష్టిలో  ఉంచుకొని దీన్ని రూపొందించామన్నారు. మిరా విజన్‌ అనే కొత్త  టెక్నాలజీతో వస్తుందని తెలిపారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement