జియో ల్యాప్టాప్.. ఫీచర్లెలా ఉన్నాయో తెలుసా? | Reliance Jio laptop with 4G VoLTE SIM, 13.3-inch screen may launch soon | Sakshi
Sakshi News home page

జియో ల్యాప్టాప్.. ఫీచర్లెలా ఉన్నాయో తెలుసా?

Apr 5 2017 6:40 PM | Updated on Sep 5 2017 8:01 AM

జియో ల్యాప్టాప్.. ఫీచర్లెలా ఉన్నాయో తెలుసా?

జియో ల్యాప్టాప్.. ఫీచర్లెలా ఉన్నాయో తెలుసా?

టెలికాం రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ జియో, మరింత ఊపు మీద ముందుకు దూసుకెళ్తోంది.

టెలికాం రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ జియో, మరింత ఊపు మీద ముందుకు దూసుకెళ్తోంది. జియో సెటాప్ బాక్స్ లు, జియో ల్యాప్ టాప్ లను లాంచ్ చేసి మరిన్ని సంచలనాలకు తెరతీసేందుకు సిద్ధమవుతోంది. భారత మార్కెట్లోకి జియో పవర్డ్ ల్యాప్ టాప్ లను అందించేందుకు ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ వర్క్ చేస్తుందని తాజా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. జియో లాంచ్ చేయబోతున్న ల్యాప్ టాప్ 13.3 అంగుళాల స్క్రీన్ సైజును కలిగి ఉంటుందట. ముఖ్యంగా ట్రావెలర్లను ఉద్దేశించి వీటిని తయారుచేస్తున్నట్టు తెలుస్తోంది. కచ్చితంగా ఈ ల్యాప్ టాప్ లో జియో సిమ్ కార్డును ముందస్తుగానే అమర్చి ప్రవేశపెడుతుందని రిపోర్టులు తెలిపాయి. దీంతో యూజర్ల కనెక్షన్ ను మరింత పెంచుకోవాలని కంపెనీ ప్లాన్ వేస్తోంది.
 
వాయిస్ ఓవర్ ఎల్టీఈ కాల్స్ ను ఈ ల్యాప్ టాప్ సపోర్టు చేస్తుందని ఫోన్ ర్యాడర్ రిపోర్టు చేసింది. జియో సిమ్ స్లాట్, లెఫ్ట్ సైడ్ లో ఉంటుందట. విండోస్ లేదా క్రోమ్ ఓస్ తో ఇది రన్ అవుతుందని తెలుస్తోంది. వీడియో కాల్స్ మాట్లాడుకునేందుకు వీలుగా డిస్ ప్లే పైననే హెచ్డీ కెమెరాను  అమర్చుతుందట. ప్రస్తుత తరం ఇంటెల్ పెంటియమ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ తో ఇది రూపొందుతోంది. 4జీబీ ర్యామ్, 64జీబీ ఈఎంఎంసీ లేదా 128జీబీ  ఎస్డీడీ స్టోరేజ్, 12.2ఎంఎం మందం, 1.2 కేజీల బరువు, మ్యాగ్నిసియం అలోయ్ బాడీ దీనిలో మిగతా స్పెషిఫికేషన్లు. దీని ధర కూడా రూ.35వేల నుంచి రూ.45వేల మధ్యలో ఉండేటట్టు  ఆవిష్కరించాలని కంపెనీ ప్లాన్ వేస్తోంది. 4జీ సిమ్ కార్డుతో ఈ ల్యాప్ టాప్ తీసుకురావడం గుడ్ ఐడియా అని టెక్ విశ్లేషకులంటున్నారు. చాలామంది ల్యాప్ టాప్ యూజర్లు సిమ్ కనెక్టివిటీని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement