మోటో స్పెషల్‌ స్మార్ట్‌ఫోన్‌ త్వరలో.. | Moto X4 images leak once again, likely to launch on August 24 | Sakshi
Sakshi News home page

మోటో స్పెషల్‌ స్మార్ట్‌ఫోన్‌ త్వరలో..

Aug 12 2017 5:15 PM | Updated on Sep 17 2017 5:27 PM

మోటో స్పెషల్‌ స్మార్ట్‌ఫోన్‌ త్వరలో..

మోటో స్పెషల్‌ స్మార్ట్‌ఫోన్‌ త్వరలో..

లెనోవా సొంతమైన మోటారోలా కంపెనీ త్వరలోనే ఈ ఏడాదిలో తన మూడవ డ్యూయల్‌ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే లాంచ్‌ చేయనుంది.

లెనోవా సొంతమైన మోటరోలా కంపెనీ త్వరలోనే  ఈ ఏడాదిలో తన మూడవ  డ్యూయల్‌ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే లాంచ్‌ చేయనుంది. తాజా నివేదికల ప్రకారం  మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ 'మోటో ఎక్స్4' పేరుతో నెల 24వ తేదీన విడుదల చేయనుంది.  దీనికి సంబంధించిన  వివరాలు  ఆన్‌లైన్‌ లో లీక్‌ అయ్యాయి.  అయితే ధర వివరాలు మాత్రం  ఇంకా స్పష్టం కాలేదు.

ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ బాడీ,  ఫింగర్‌ప్రింట్ ఫీచర్స్‌తో సూపర్‌ బ్లాక్‌ లేదా స్టెర్లింగ్‌  బ్లూ కలర్‌ ఆప్షన్స్‌లో లభ్యం కానుంది.  ఐరోపా, ఉత్తర అమెరికా,  ఈ మోటా ఎక్స్‌ 4 ఫోన్‌  3 జీబి ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్‌గాను, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో  4 జీబి ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ ఆప్షన్‌ తోను రానుంది.  అంతేకాదు డిజిటల్‌ టీవీ  ఆప్షన్‌,   స్పెషల్‌  హైబ్రిడ్‌ ఎస్‌డీకార్డును పొందుపర్చినట్టు తెలుస్తోంది.  మోటో ఎక్స్‌ 4 ఫీచర్లపై అంచనాలు ఈ విధంగా ఉన్నాయి.

మోటో ఎక్స్4 ఫీచర్లు
5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్
4 జీబీ ర్యామ్
64 జీబీ స్టోరేజ్
12, 8 మెగా పిక్సెల్  రియర్ కెమెరాలు విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌
16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ, టర్బో చార్జింగ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement