ఫ్లిప్‌కార్ట్‌లో ఆ ఫోన్‌ ధర తగ్గింది | Lenovo Vibe K5 Note Price Cut Announced for Limited Period on Flipkart | Sakshi
Sakshi News home page

ఫ్లిప్‌కార్ట్‌లో ఆ ఫోన్‌ ధర తగ్గింది

Jul 3 2017 4:43 PM | Updated on Aug 1 2018 3:40 PM

ఫ్లిప్‌కార్ట్‌లో ఆ ఫోన్‌ ధర తగ్గింది - Sakshi

ఫ్లిప్‌కార్ట్‌లో ఆ ఫోన్‌ ధర తగ్గింది

ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌, లెనోవో వైబ్‌ కే5 నోట్‌పై స్పెషల్‌ వన్‌ డే సేల్‌ను ప్రకటించింది.

ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌, లెనోవో వైబ్‌ కే5 నోట్‌పై స్పెషల్‌ వన్‌ డే సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా వైబ్‌ కే5 నోట్‌ ఫోన్‌పై ఫ్లాట్‌ 3వేల రూపాయల డిస్కౌంట్‌ను ఇవ్వనున్నట్టు పేర్కొంది. దీంతో ఫ్లిప్‌కార్ట్‌లో లెనోవో వైబ్‌ కే5 నోట్‌ ఫోన్‌ 9,499 రూపాయలకే మంగళవారం అందుబాటులోకి రానుంది. లెనోవో కే-సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి వచ్చి రెండో వార్షికోత్సవం పురస్కరించుకున్న సందర్భంగా ఈ స్పెషల్‌ వన్‌ డే సేల్‌ను ఈకామర్స్‌ దిగ్గజం నిర్వహిస్తోంది.
 
ఈ వన్‌ డే సేల్‌లో 4జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ మోడల్‌ విక్రయానికి అందుబాటులో ఉండనుంది. నేటి అర్థరాత్రి 12 గంటల నుంచి ఈ సేల్‌ ప్రారంభమై, మంగళవారం అర్థరాత్రి వరకు కొనసాగనుంది. లెనోవోతో తమ భాగస్వామ్యం ఎంతో విజయవంతమైనదని, 2015లో తొలిసారి వైబ్‌ కే3 నోట్‌ను తమ ప్లాట్‌ ఫామ్‌పై లాంచ్‌​ చేసినట్టు ఫ్లిప్‌కార్ట్‌ సీనియర్‌ డైరెక్టర్‌ స్మార్ట్‌ఫోన్స్‌, అయ్యప్పన్‌ రాజగోపాల్‌ చెప్పారు. అనంతరం లెనోవో కే5 ప్లస్‌, లెనోవో కే5 నోట్‌, లెనోవో కే6 పవర్‌లను లాంచ్‌చేసినట్టు పేర్కొన్నారు. 
 
ఇక లెనోవో కే5 నోట్‌ ఫీచర్ల విషయానికి వస్తే.. 5.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ  ఐపీఎస్‌ డిస్‌ప్లే, 64 బిట్‌ ఆక్టాకోర్‌ మీడియా టెక్‌ హీలియో పీ10 ప్రాసెసర్‌,  13ఎంపీ రియర్‌ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా, 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ దీనిలో ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement