వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌ - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇప్పటి వరకు ఐఓఎస్‌ డివైజ్‌లలో మాత్రమే అందుబాటులో ఉన్న స్టోరేజ్‌ మేనేజ్‌మెంట్‌ ఫీచర్‌ తాజాగా ఆండ్రాయిడ్‌ వాట్సాప్‌ బీటా వెర్షన్‌ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్‌ యూజర్లు తమ ఛాట్‌ డేటా స్టోరేజ్‌ను మంచిగా నిర్వహించుకోవడానికి వీలుగా వాట్సాప్‌ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని కోసం వాట్సాప్‌ బీటా వెర్షన్‌ యూజర్లు యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అప్‌డేట్‌ చేసుకున్న అనంతరం సెట్టింగ్స్‌లో ఉన్న 'డేటా అండ్‌ స్టోరేజ్‌ యూసేజ్‌' వద్దకు యూజర్లు వెళ్లాల్సి ఉంటుంది. అనంతరం స్టోరేజ్‌ యూసేజ్‌ను ఎంపికచేయాలి. దీంతో వాట్సాప్‌లో వచ్చిన చాట్‌లు ఏ మేర డివైజ్‌లో స్పేస్‌ను ఆక్రమించుకుని ఉన్నాయో తెలుసుకోవచ్చని ఆండ్రాయిడ్‌ పోలీసు రిపోర్టు చేసింది.

 

ఏదైనా ఛాట్‌ను ఎంపికచేస్తే ఆ ఛాట్‌ ద్వారా వచ్చిన టెక్ట్స్‌ మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు, ఆడియో మెసేజ్‌లు, డాక్యుమెంట్ల వివరాలను తెలుసుకోవచ్చు. ఈ కొత్త 'మేనేజ్‌ మెసేజస్‌' ఆప్షన్‌ ద్వారా అవసరం లేని ఫైల్స్‌ను డిలీట్‌ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల డివైజ్‌లో స్టోరేజ్‌ స్పేస్‌ పెరుగుతుంది. ప్రస్తుతం ఇది లేటెస్ట్‌  v2.17.340 బీటా వెర్షన్‌కు అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ ఫీచర్‌ మామూలు ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి రానుంది. 

 
Read latest Technology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top