శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస వైఎస్‌ఆర్సీపీ కౌన‍్సిలర్ గురువారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు.
గుండెపోటుతో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ మృతి
Feb 23 2017 11:06 AM | Updated on May 29 2018 3:40 PM
ఆముదాలవలస: శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస పురపాలక సంఘం 17వ వార్డు కౌన‍్సిలర్ గురుగుబెల్లి వెంకట అప‍్పలనాయుడు గురువారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం ఛాతీనొప్పి రావడంతో శ్రీకాకుళం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్ కు వెళ్లే లోపల ఆయన మృతి చెందారు. వైఎస్సార్‌సీపీలో ఆయన చాలా చురుకు నేతగా పేరుతెచ్చుకున్నారు. ఆయన అకాలమరణంతో పార్టీ నేతలు కార‍్యకర‍్తలు దిగ్ర్బాంతి వ‍్యక‍్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన‍్నికల కోడ్ ఉల‍్లంఘిస్తోందని బుధవారం జిల్లాలో నిర‍్వహించిన ఆందోళన కార‍్యక్రమంలో కూడా ఆయన పాల‍్గొని ప్రసంగించారు.
Advertisement
Advertisement