అసెంబ్లీ నిర్మాణంపై త్వరలో చంద్రబాబుతో సమావేశం నిర్వహించనున్నట్లు యనమల తెలిపారు.
త్వరలో అసెంబ్లీ నిర్మాణంపై సమావేశం
Sep 17 2016 3:43 PM | Updated on Aug 27 2018 8:44 PM
అమరావతి: ఏపీ అసెంబ్లీ భవన సముదాయ నిర్మాణం ఎలా ఉండాలనే దానిపై త్వరలో సీఎం చంద్రబాబు నాయుడు తో సమావేశం ఉంటుందని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. శుక్రవారం ఆయన అమరావతిలో వివిధ శాఖల అధికారులు, భవన నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సెక్రటేరియట్‌కు భిన్నంగా అసెంబ్లీ భవన నిర్మాణం ఉంటుందని మంత్రి అన్నారు. అంతేకాకుండా అసెంబ్లీ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. డిసెంబరు ఆఖరుకల్లా అసెంబ్లీ భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశించినట్లు ఆయన వివరించారు. పార్కింగుకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ప్రస్తుతం అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఎల్పీ కార్యాలయాలు, చాంబర్ల ఏర్పాటు సాగుతోందని చెప్పారు.
Advertisement
Advertisement