వివాహిత గొంతు కోసిన దుండగులు | Woman's throat cut during robbery attempt in Bangalore | Sakshi
Sakshi News home page

వివాహిత గొంతు కోసిన దుండగులు

Aug 21 2014 8:19 AM | Updated on Aug 30 2018 5:27 PM

ఇంటిలో ఒంటరిగా ఉన్న వివాహితను దారుణంగా హత్య చేసిన కిరాతకుల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

బెంగళూరు :  ఇంటిలో ఒంటరిగా ఉన్న వివాహితను దారుణంగా హత్య చేసిన కిరాతకుల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఇక్కడి ఆర్‌ఎంసీ యార్డు పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగిన సంఘటన వివరాలు...ఇక్కడి తులసి గార్డెన్‌లో నివాసం ఉంటున్న విజయ్‌కుమార్, పారిజాత(29)కు  పదేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు. విజయ్‌కుమార్ ఆర్‌ఎంసీ యార్డులో ప్లాస్టిక్ కవర్ల దుకాణం నిర్వహిస్తున్నాడు. పారిజాత తల్లిదండ్రులు అనారోగ్యానికి గురికావడంతో ఆరు నెలల క్రితం పారిజాత కుటుంబం సహా తల్లిదండ్రులు ఉంటున్న గురగుంటపాళ్యకు వచ్చి ఉంటోం ది.

ఇదిలా ఉంటే మంగళవారం ఉదయం ఎప్పటిలాగే పిల్లలు స్కూల్‌కు వెళ్లారు. విజయ్‌కుమార్, పారిజాత తండ్రి లక్ష్మినారాయణ దుకాణం వెళ్లారు. మధ్యాహ్నం పారిజాత తల్లి లక్ష్మమ్మ బంధువుల ఇంటికి వెళ్లారు. అదే సమయంలో పారి జాత భర్త విజయ్‌తో ఫోన్‌లో కొద్దిసేపు మాట్లాడింది. ఇదే సమయంలో దుండగులు ఇంటిలోకి చొరబడి పారిజాత కళ్లల్లో కారంచల్లి కత్తులతో గొంతు కోసి దారుణంగా హతమార్చారు.

అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు, గదిలో ఉన్న వెండి విగ్రహాలు ఎత్తుకెళ్లారు. కొద్దిసేపు అనంతరం లక్ష్మమ్మ ఇంటికి వచ్చి చూడగా హత్య విషయం వెలుగు చూసింది. సమాచారం అందుకున్న జాయింట్ పోలీసు కమిషనర్ ప్రణవ్ మోహంతి, అడిషనల్ పోలీసు కమిషనర్ ఎస్. రవి, డీసీపీ టీ.ఆర్. సురేష్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రత్యేక బృందాలు దుండగుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement