భర్తను హత్యచేసి కనిపించలేదని ఫిర్యాదు | wife killed her husband and gave complaint in police station as missing | Sakshi
Sakshi News home page

భర్తను హత్యచేసి కనిపించలేదని ఫిర్యాదు

Dec 30 2013 11:43 PM | Updated on Sep 2 2017 2:07 AM

స్నేహితుడి మోజులోపడి భర్తను కడతేర్చి, కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన వేలూరు జిల్లాలో చోటుచేసుకుంది.

 వేలూరు, న్యూస్‌లైన్: స్నేహితుడి మోజులోపడి భర్తను కడతేర్చి, కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన వేలూరు జిల్లాలో చోటుచేసుకుంది. వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని ఆలయం వద్ద ఈనెల 9న మృతదేహం కనిపించింది. పోలీసుల విచారణలో మృతు డు క్రిష్ణగిరి జిల్లా చిన్నరామనూర్ గ్రామానికి చెందిన సోమసుందరం(37)అని తెలిసింది.  ఇతనికి భార్య కస్తూరి, నలుగురు పిల్లలున్నారు.  సోమసుందరం కమ్మీ మేస్త్రీగా పనిచేసి ప్రతిరోజూ మద్యం సేవించే వాడు.ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన గోవిందరాజ్‌తో కస్తూరికి వివాహేత ర సంబంధం ఏర్పడింది. ఈ విషయం విషయం తెలిసి సోమసుందరం ప్రతిరోజూ మద్యం సేవిం చి కస్తూరితో గొడవపడేవాడు. దీంతో గోవిందరా జ్, కస్తూరి కలిసి సోమసుందరాన్ని హత్య చేసేం దుకు ప్రణాళిక సిద్ధ్దం చేసుకున్నారు.
 
  మద్యం మానిపించేందుకు గుడియాత్తంలో మందులు ఇస్తారని కస్తూరి, సోమసుందరాన్ని ఒంటరిగా తీసుకొచ్చింది. అనంతరం గుడియాత్తం చిత్తాతూర్ వద్దనున్న కొబ్బరి తోపునకు తీసుకెళ్లింది. అప్పటికే గోవింద్‌రాజ్ అక్కడ ఉన్నాడు. కస్తూరి, గోవింద్‌రాజ్ ఇద్దరు కలిసి సెల్‌ఫోన్ చార్జర్‌తో గొంతు బిగించి హత్యచేసినట్లు కస్తూరి పోలీసులకు తెలిపింది. పోలీసులు కస్తూరి, గోవిందరాజ్‌ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement