ఎన్నికల హామీలను టీడీపీ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపిస్తూ విజయనగరం జిల్లా పార్వతీపురంలో గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ) ఆందోళనకు దిగారు.
ఆర్డీవో కార్యాలయం ఎదుట వీఆర్‌ఏల ఆందోళన
Oct 25 2016 12:32 PM | Updated on Sep 4 2017 6:17 PM
పార్వతీపురం: ఎన్నికల హామీలను టీడీపీ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపిస్తూ విజయనగరం జిల్లా పార్వతీపురంలో గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ) ఆందోళనకు దిగారు. మంగళవారం ఉదయం వందలాది మంది వీఆర్‌ఏలు ధర్నాకు పూనుకున్నారు. ఎన్నికల హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు. కనీసం రూ.18వేల వేతనం చెల్లించాలని, మెడికల్ ఇన్వాలిడేషన్‌లో వారసుల వయో పరిమితిని సడలించాలని కోరారు. తమను నాలుగో తరగతి ఉద్యోగులుగా పరిగణించవద్దని పేర్కొన్నారు. కార్యాలయం గేట్లు మూసేసి వారు నినాదాలు చేశారు.
Advertisement
Advertisement