హాలీవుడ్‌కు ఆ ఇద్దరు | vijay and ajith come chance to act in hollywood | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌కు ఆ ఇద్దరు

Feb 13 2015 2:17 AM | Updated on Sep 2 2017 9:12 PM

హాలీవుడ్‌కు ఆ ఇద్దరు

హాలీవుడ్‌కు ఆ ఇద్దరు

కోలీవుడ్‌లో కమలహాసన్, రజనీకాంత్ తరువాత ఆ స్థాయి ఇమేజ్ ఎదిగిన నటులు విజయ్, అజిత్. వీరి చిత్రం విడుదలవుతుందంటే ఇద్దరి అభిమానులు

 కోలీవుడ్‌లో కమలహాసన్, రజనీకాంత్ తరువాత ఆ స్థాయి ఇమేజ్ ఎదిగిన నటులు విజయ్, అజిత్. వీరి చిత్రం విడుదలవుతుందంటే ఇద్దరి అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. పూజలు, అభిషేకాలు, ఊరేగింపులు అంటూ పెద్ద కోలాహలమే సృష్టిస్తారు. అలాంటి అజిత్, విజయ్ హాలీవుడ్ చిత్రాలకు సిద్ధం అవుతున్నట్లు పరిశ్రమ వర్గాల టాక్. విజయ్‌కి ఇంతకముందే హాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. దాన్ని ఆయన అంగీకరించడమే తరువాయి అంటున్నారు విజయ్ సన్నిహితులు. అజిత్ హీరోగా హాలీవుడ్ చిత్రం తీస్తానంటున్నారు దర్శకుడు గౌతమ్‌మీనన్. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఎన్నై అరిందాల్ చిత్రం ఇటీవల విడుదలై విజయాన్ని సొంతం చేసుకుంది.
 
 దీంతో అజిత్ ఓకే అంటే ఆయనతో హాలీవుడ్ చిత్రం చేస్తానని గౌతమ్‌మీనన్ బాహాటంగానే ప్రకటించారు. ఇప్పుడిక బాల్ అజిత్ కోర్టులోనే ఉంది. ఆయన పచ్చజెండా ఊపితే హాలీవుడ్ చిత్రం షురూ అవుతుంది. మరి అజిత్ విజయ్‌ల హాలీవుడ్ రంగ ప్రవేశం ఉంటుందా? ఉంటే ఎప్పుడు? అన్నది వేచి చూడాల్సిందే. ప్రస్తుతం అజిత్ కోలీవుడ్ చిత్రాల్లో యమబిజీగా ఉన్నారు. విజయ్ పులి చిత్రం పూర్తి చేసి అట్లి దర్శకత్వంలో 59వ చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు. అజిత్ శివ దర్శకత్వంలో మరో భారీ యాక్షన్ చిత్రానికి రెడీ అవుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement