'నా పార్టీ జెండా ఇంద్రధనుస్సు గుర్తు జామకాయ' | Vadivelu Sarcastic Reaction Rajinikanth Political Decision | Sakshi
Sakshi News home page

'నా పార్టీ జెండా ఇంద్రధనుస్సు గుర్తు జామకాయ'

Mar 15 2020 7:34 AM | Updated on Mar 15 2020 7:34 AM

Vadivelu Sarcastic Reaction Rajinikanth Political Decision - Sakshi

సాక్షి, పెరంబూరు: నటుడు రజనీకాంత్‌ రాజకీయ పార్టీ గురించి పలువురు పలు విధాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు.అందులో కొందరు వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తున్నారు. వెటకారంగా మాట్లాడటంలో దిట్ట అయిన సీనియర్‌ హాస్య నటుడు వడివేలు గురించి చెప్పనే అవసరం లేదు. ఏ విషయంలోనైనా ఎగతాళి చేయడంలో వడివేలుది సపరేట్‌ భాణీ, ఈయన శనివారం తిరుచెందూర్‌కు వెళ్లి కుమారస్వామిని దర్శించుకున్నారు. అక్కడ మీడియాతో ముచ్చటించారు. రజనీకాంత్‌ రాజకీయాలపై అడిగిన ప్రశ్నకు వెటకారంగా బదులిచ్చారు.

రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తారా.. రారా? అన్నది మీకూ తెలియదు, నాకూ తెలియదు. అసలు ఆయకే తెలియదు.. అని వ్యంగ్యంగా అన్నారు. రజనీ సంగతి ఏమోగానీ తాను మాత్రం రాజకీయ పార్టీని ప్రారంభించి 2021లో ముఖ్యమంత్రిని కావాలనుకుంటున్నానని అన్నారు. తన ఆశకు కొందరు అడ్డపడుతున్నారని పరిహాస్యమాడారు. నిజంగానే మీరు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా?అన్న ప్రశ్నకు తన పార్టీ జెండా రంగు ఇంద్ర ధనుస్సు అని, పార్గీ గుర్తు జామకాయ అని జోక్‌ చేశారు. తనకు రాజకీయాలు వద్దని, ప్రజలను నవ్యించడమే తనకు ఇష్టం అని వడివేలు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement