జగిత్యాల-మోర్తాడు డెమో సర్వీసు ప్రారంభం | Union Railway Minister Suresh Prabhu launched the DEMU train service from jagtial to mortadu rail | Sakshi
Sakshi News home page

జగిత్యాల-మోర్తాడు డెమో సర్వీసు ప్రారంభం

Dec 29 2016 4:43 PM | Updated on Aug 9 2018 4:51 PM

జగిత్యాల-మోర్తాడు డెమో సర్వీసు ప్రారంభం - Sakshi

జగిత్యాల-మోర్తాడు డెమో సర్వీసు ప్రారంభం

జగిత్యాల- మోర్తాడు సర్వీసును కేంద్ర మంత్రులు సురేష్‌ ప్రభు, బండారు దత్తాత్రేయ, ఎంపీ కవిత ప్రారంభించారు.

హైదరాబాద్‌: ఢిల్లీలో రిమోట్‌ వీడియో లింకు ద్వారా జగిత్యాల- మోర్తాడు డెమో సర్వీసును కేంద్ర మంత్రులు సురేష్‌ ప్రభు, బండారు దత్తాత్రేయ, ఎంపీ కవిత గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ 20 ఏళ్ల కల నిజమైందని తెలిపారు. 25 సార్లు కేంద్రమంత్రికి వినుతులు ఇచ్చినట్లు గుర్తుచేశారు.

వచ్చే ఏడాది పెద్దపల్లి రైల్వే లైన్‌ క్లియర్‌ అవుతుందని, నిజామాబాద్‌ స్టేషన్‌ అభివృద్ధికి నిధులు ఇచ్చేలా రైల్వే మంత్రి హామి ఇచ్చినట్టు కవిత తెలిపారు. వచ్చే బడ్జెట్‌​ నాటికి మరిన్ని ప్రతిపాదనలు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. అదేవిధంగా తెలంగాణ అభివృద్ది పనులకు రూ.709 కోట్లు కేటాయిస్తున్నామని సురేష్‌ ప్రభు చెప్పారు. 2017 తెలంగాణకు రైల్వే పరంగా మంచి సంవత్సరం అవుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement