కరుణానిధి భార్య ఇంట్లో కలకలం | unidentified man enters Karunanidhi wife's house | Sakshi
Sakshi News home page

కరుణానిధి భార్య ఇంట్లో కలకలం

Feb 13 2017 8:31 PM | Updated on Sep 5 2017 3:37 AM

కరుణానిధి భార్య ఇంట్లో కలకలం

కరుణానిధి భార్య ఇంట్లో కలకలం

డీఎంకే అధినేత కరుణానిధి సతీమణి ఇంట్లోకి దుండగుడు చొరబడడం కలకలం రేపింది.

చెన్నై: అన్నాడీఎంకే సంక్షోభంతో రాష్ట్రమంతా రాజకీయ చర్చోపచర్చలు జరుగుతుండగా డీఎంకే అధినేత కరుణానిధి సతీమణి ఇంట్లోకి దుండగుడు చొరబడడం కలకలం రేపింది. కరుణానిధి భార్య రజతి అమ్మాల్ ఇంట్లోకి దొంగతనంగా చొరబడిన దుండగుడు ఆమెను తుపాకీతో బెదిరించాడు.

రంగంలోకి దిగిన మైలాపూర్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడు ట్రిప్లేన్‌ ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ గా పోలీసులు గుర్తించారు. అతడు ఎందుకు ఇంట్లోకి ప్రవేశించాడనే కారణాలపై దర్యాప్తు చేపట్టారు. దొంగతనం చేయడానికి చొరబడ్డాడా, మరేదైనా కారణం ఉందా అనే దానిపై ఆరా తీస్తున్నారు. రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో జరిగిన ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement