జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. మృతుల్లో ఒకరి కళ్లను కుటుంబసభ్యులు దానం
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
Jan 22 2014 12:30 AM | Updated on Aug 30 2018 3:56 PM
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. మృతుల్లో ఒకరి కళ్లను కుటుంబసభ్యులు దానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. తిరువళ్లూరు జిల్లా తామరపాక్కం గ్రామానికి చెందిన హోటల్ సర్వెంట్ సుందరవేలన్. ఇతని రెండవ కుమారుడు మైత్రేయన్, తిరువళ్లూరు సమీపంలోని వెల్లియూర్ ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదొవ తరగతి చదువుతున్నాడు. మంగళవారం పాఠశాలకు ప్రభుత్వ బస్సులో ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరాడు. బస్సు రద్దీగా ఉండడంతో మైత్రేయన్ ఫుట్‌బోర్డుపై ప్రయాణం చేస్తున్నాడు. పాఠశాల సమీపంలో బస్సు రాగానే మైత్రేయన్ అదుపు తప్పి బస్సు వెనుక చక్రాల కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ మైత్రేయన్ 108లో చెన్నై వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ సంఘటన తామరపాక్కం ప్రాంతంలో విషాదాన్ని నింపింది. మృతుని కళ్లను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వీరి అనుమతితో చెన్నై వైద్యశాలలో కళ్లను స్వీకరించారు.
డిప్లొమా విద్యార్థి మృతి: స్నేహితుడితో కలిసి ద్విచక్రవాహనంలో తిరువళ్లూరుకు వచ్చిన డిప్లొమా విద్యార్థ్ది గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ ప్రాంతంలోని పింజువాక్కం గ్రామానికి చెం దిన సుబ్రమణ్యం కుమారుడు ప్రతాప్(21). ఇతను తిరువళ్లూరు సమీపంలోని వేపంబట్టులో వున్న శ్రీరామ్ ఇంజినీరింగ్ కళాశాలలో డిప్లొమా ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి తన స్నేహితుడు రాహల్‌తో కలిసి బైక్‌లో తిరువళ్లూరుకు బయలుదేరాడు. పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా బైక్‌ను వ్యాన్ ఢీకొంది. ఈ సంఘటనలో ప్రతాప్ తీవ్రంగా, రాహుల్ స్వల్పం గా గాయపడ్డారు. గాయపడ్డ వీరిని తిరువళ్లూరు వైద్యశాలకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ప్రతాప్ సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. రాహుల్ చికిత్స పొందు తున్నాడు. ఈ సంఘటనపై తిరువళ్లూరు టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement