విజయ్‌మిల్టన్ చిత్రంలో హీరోగా టీఆర్ | TR to play a hero in Vijay Milton's new film | Sakshi
Sakshi News home page

విజయ్‌మిల్టన్ చిత్రంలో హీరోగా టీఆర్

Nov 30 2015 2:04 AM | Updated on Sep 3 2017 1:13 PM

విజయ్‌మిల్టన్ చిత్రంలో హీరోగా టీఆర్

విజయ్‌మిల్టన్ చిత్రంలో హీరోగా టీఆర్

గోలీసాడా,10 ఎండ్రత్తుకుళ్ చిత్రాల దర్శకుడు విజయ్‌మిల్టన్ తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు.

గోలీసాడా,10 ఎండ్రత్తుకుళ్ చిత్రాల దర్శకుడు విజయ్‌మిల్టన్ తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు. సీనియర్ నటుడు టీ.రాజేందర్ కథానాయకుడిగా విజయ్‌మిల్టన్ చిత్రం చేయనున్నారు. నిజానికి ఈ చిత్రం గోలీసోడా తరువాత ప్రారంభం కావలసింది. గోలీసోడా చిత్రం అనూహ్య విజయంతో విజయ్‌మిల్టన్‌కు ఒక సారిగా పాపులారిటీ పెరిగిపోయింది. దీంతో నటుడు విక్రమ్ హీరోగా చిత్రం చేసే అవకాశం వచ్చింది. దీంతో టీఆర్‌తో చిత్రాన్ని పక్కన పెట్టి విక్రమ్ హీరోగా 10 ఎంత్రత్తుకుళ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రం విడుదలై ఆశించిన విజయం సాధించలేక పోయింది.దీంతో విజయ్‌మిల్టన్ తదుపరి గోలీసోడా వంటి చిన్న చిత్రాన్ని రూపొందిస్తారని సినీ వర్గాలు భావించారు.
 
 అయితే ఆయన ఇంతకు ముందు పక్కన పెట్టిన టీ.రాజేంద్రర్ చిత్రాన్ని  చేయ సంకల్పించి ఆ స్క్రిప్ట్ బూజు దులపనున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి టీఆర్‌తో విజ య్‌మిల్టన్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.దీన్ని ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నారు.మరో విషయం ఏమిటంటే టీఆర్ చిత్రానికి జరిగినట్లే ఆయన కొడుకు శింబు చిత్రం విషయంలోనూ జరిగింది. దర్శకుడు గౌతమ్‌మీనన్ శింబు హీరోగా అచ్చం ఎంబదు మడమయడా చిత్రాన్ని ప్రారంభించారు.ఆ సమయంలో ఆయనకు అజిత్ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం రావడంతో శింబు చిత్రాన్ని పక్కన పెట్టి ఎన్నై అరిందాళ్ చిత్రం చేశారు.ఆ చిత్రం తరువాత ఇప్పుడు మళ్లీ శింబు చిత్రాన్ని రూపొందిస్తున్నార న్నది గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement