కోలీవుడ్‌ ఎంట్రీ | Raj Tarun Kollywood Debut in Vijay Milton | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌ ఎంట్రీ

May 12 2025 12:17 AM | Updated on May 12 2025 12:17 AM

Raj Tarun Kollywood Debut in Vijay Milton

రాజ్‌ తరుణ్‌ కోలీవుడ్‌ ఎంట్రీ ఖరారైంది. రాజ్‌ తరుణ్‌ హీరోగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌–దర్శకుడు విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వంలో ఓ ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం తెరకెక్కనుంది. రఫ్‌నోట్‌ ప్రోడక్షన్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. మే 11 (ఆదివారం) రాజ్‌ తరుణ్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకోనుంది.

రాజ్‌ తరుణ్‌కు ఇదే తొలి తమిళ చిత్రం కావడం విశేషం. ‘‘గోలీసోడా’ ఫ్రాంచైజీలో భాగంగా విజయ్‌ మిల్టన్‌ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమా కోసం రాజ్‌ తరుణ్‌ మేకోవర్‌ అయిన తీరు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉంటుంది. విభిన్నమైన కథ, బలమైన స్క్రీన్‌ప్లేతో ఈ యాక్షన్‌ ప్యాక్డ్‌ మూవీ ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అని చిత్రబృందం  పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement