గోడ కూలి 11 మంది తెలుగువారు మృతి | Thiruvallur: 11 Dead as Godown Wall Collapses | Sakshi
Sakshi News home page

గోడ కూలి 11 మంది తెలుగువారు మృతి

Jul 6 2014 9:48 AM | Updated on Sep 2 2017 9:54 AM

గోడ కూలి 11 మంది తెలుగువారు మృతి

గోడ కూలి 11 మంది తెలుగువారు మృతి

చెన్నైలో 11 అంతస్తుల భవనం కుప్పకూలి 64 మంది మృతి చెందిన ఘటన మన మనోఫలకంపై నుంచి చెరగకమందే....

చెన్నైలో 11 అంతస్తుల భవనం కుప్పకూలి 61 మంది మృతి చెందిన ఘటన మన మనోఫలకంపై నుంచి చెరగకమందే.... తిరువళ్లూరు జిల్లాలోని పొన్నేరి సమీపంలోని ఉపరపలియమ్ లోని గోడౌన్ గోడ కూలింది. ఆ ప్రమాదంలో 11 మంది కార్మికులు మరణించారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికిచేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

 

శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. శిథిలాల కింద నుంచి ఒక బాలుడిని రక్షించారు. కొంత మంది కూలీలు గోడౌన్ గోడను ఆసరాగా చేసుకుని గుడిసెలు నిర్మించుకున్నారు. ఆ గుడిసెలపై ఆ గోడౌన్ గోడ కూలింది. అయితే బాధితులంతా ఉత్తరాంధ్ర, తమిళనాడు సరిహద్దులోని జిల్లాలకు చెందిన తెలుగువారిగా గుర్తించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.   వర్షం వల్ల గోడౌన్ కు చెందిన 20 అడుగుల గోడ కూలిందని అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement