breaking news
telugu people died
-
రష్యా-ఉక్రెయిన్ వార్: తెలుగు వ్యక్తి మృతి
సాక్షి, కామారెడ్డి జిల్లా: ఏజెంట్ చేతిలో మోసపోయి, అధిక వేతనం ఆశతో రష్యా సైన్యంలో చిక్కుకున్న కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామానికి చెందిన అఫ్జల్ఖాన్(43) మృతి చెందినట్లు అతడి సహచరుల ద్వారా తెలుస్తోంది. వివరాలు.. బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామానికి చెందిన మహ్మద్ అఫ్జల్ఖాన్ మరో నలుగురితో కలిసి ఉపాధి నిమిత్తం ఫిబ్రవరిలో రష్యాకు వెళ్లాడు.మాస్కోలో ఆరు నెలలపాటు మెకానికల్ ఫీల్డ్ హెల్పర్ విభాగంలో పనిచేశారు. పని ముగిసిందని స్వదేశం వెళ్లిపోవాలని ఏజెంట్ గంగాధర్ చేతులెత్తేశాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో వారు రష్యన్ ఆర్మీలో గార్డెనింగ్ పనులకోసం చేరాడు. అయితే ఆ ఆర్మీలో సైనికులుగా చేర్చుకుని ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో ఉంచారు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడిలో మరణించిన వారిలో అప్జల్‌ఖాన్ ఉన్నట్టు సమాచారం.ఈ విషయాన్ని అతడి సహచరుడు సిర్సు అశోక్ తన భార్యకు వాయిస్ మెస్సేజ్ ద్వారా తెలిపాడు. తాను తప్పించుకుని తిరిగి పట్టుబడగా బేడీలు వేసి చిత్రహింసలు పెడ్తున్నారని ఆ మెస్సేజ్‌లో ఉంది. తన కుమారుడిని స్వదేశానికి రప్పించాలనే ఉద్దేశంతో అఫ్జల్ఖాన్ తండ్రి అనేక ప్రయత్నాలు చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, నిజామాబాద్ ఎంపీ అర్వింద్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తదితరుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు.ఇదీ చదవండి: నక్కజిత్తుల మస్క్.. అడ్డంగా బుక్కయ్యాడుగా! -
ఆస్ట్రేలియాలో ముగ్గురు తెలుగువారి మృతి
సాక్షి, నల్గొండ: ఆస్ట్రేలియాలోని మోనో బీచ్‌లో గల్లంతైన ముగ్గురు తెలుగు వ్యక్తులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు నల్గొండ జిల్లాలోని మన్యం చెల్కకు చెందిన గౌసుద్దీన్(45), అతని అల్లుడు జునేద్(28)లు కాగా, మరో వ్యక్తి హైదరాబాద్ బీహెచ్ఈఎల్ ప్రాంతానికి చెందిన రాహత్(35)లు ఉన్నారు. వీరిలో గౌసుద్దీన్, రాహత్‌ల మృతదేహాలు లభ్యమయ్యాయి. జునేద్ మృతదేహం కోసం ఆస్ట్రేలియా పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు విదేశాల్లో మృతి చెందడంతో మన్యం చెల్కలో విషాదచాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గౌసుద్దీన్ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. ఆస్ట్రేలియాలో చనిపోయిన వారికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అన్నారు. వీలైనంత త్వరగా మృతదేహాలను భారత్‌కు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కోరారు. -
చెన్నైలో గోడ కూలి 11 మంది తెలుగువారు మృతి
-
గోడ కూలి 11 మంది తెలుగువారు మృతి
చెన్నైలో 11 అంతస్తుల భవనం కుప్పకూలి 61 మంది మృతి చెందిన ఘటన మన మనోఫలకంపై నుంచి చెరగకమందే.... తిరువళ్లూరు జిల్లాలోని పొన్నేరి సమీపంలోని ఉపరపలియమ్ లోని గోడౌన్ గోడ కూలింది. ఆ ప్రమాదంలో 11 మంది కార్మికులు మరణించారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికిచేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. శిథిలాల కింద నుంచి ఒక బాలుడిని రక్షించారు. కొంత మంది కూలీలు గోడౌన్ గోడను ఆసరాగా చేసుకుని గుడిసెలు నిర్మించుకున్నారు. ఆ గుడిసెలపై ఆ గోడౌన్ గోడ కూలింది. అయితే బాధితులంతా ఉత్తరాంధ్ర, తమిళనాడు సరిహద్దులోని జిల్లాలకు చెందిన తెలుగువారిగా గుర్తించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. వర్షం వల్ల గోడౌన్ కు చెందిన 20 అడుగుల గోడ కూలిందని అధికారులు తెలిపారు.


