పంచాయతీ రాజ్ చట్టానికి త్వరలో మార్పులు | The changes to the Panchayati Raj Act | Sakshi
Sakshi News home page

పంచాయతీ రాజ్ చట్టానికి త్వరలో మార్పులు

Jun 16 2014 3:16 AM | Updated on Sep 2 2017 8:51 AM

గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం చేయడంతో పాటు పనుల్లోపారదర్శకత పెంచేలా పంచాయతీ రాజ్ చట్టానికి త్వరలో మార్పులు చేయనున్నట్లు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి హెచ్.కె.పాటిల్ తెలిపారు.

మంత్రి హెచ్.కే పాటిల్
 
సాక్షి, బెంగళూరు : గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం చేయడంతో పాటు పనుల్లోపారదర్శకత పెంచేలా పంచాయతీ రాజ్ చట్టానికి త్వరలో మార్పులు చేయనున్నట్లు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి హెచ్.కె.పాటిల్ తెలిపారు. హుబ్లీలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నూతన చట్టం వల్ల అధికారులతో పాటు గ్రామ పంచాయతీ సభ్యులోనూ జవాబుదారీ తనం పెరుగుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ మేరకు రూపొందించిన ముసాయిదాను వచ్చే అక్టోబర్‌లో జరగనున్న శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి కోసం అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన పరిశోధనల కోసం  దేశంలోని తొలిసారిగా రాష్ట్రంలో గ్రామీణ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పబోతున్నట్లు పేర్కొన్నారు.

రాజీవ్ గాంధీ చైతన్య పథకం కింద ప్రతి గ్రామీణ పంచాయతీ పరిధిలో 40 మంది నిరుద్యోగులను ఎంపిక చేసి వారి అర్థలకు గ్గ రంగంలో శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించున్నట్లు చెప్పారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. వీటి వితరణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement