
బెంగళూరు : కర్ణాటక వ్యాప్తంగా గురువారం పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ నేపథ్యంలో అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద తగినన్ని జాగ్రత్తలు చేపట్టారు. పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి లోపలికి అనుమతించారు. అనంతరం వారికి శానిటైజర్, మాస్కులు అందించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను పూర్తిగా శానిటైజ్ చేశామని, విద్యార్థులు ధైర్యంగా పరీక్ష రాయవచ్చని రాష్ట్ర విద్యాశాఖ పేర్కొంది. పరీక్షా కేంద్రంలో ప్రతి 200 మంది విద్యార్థులకు ఒక ఆరోగ్య సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కర్ణాటకలో కరోనా విజృంభిస్తూనే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో 10వేల కరోనా కేసులు దాటాయి. (కర్ణాటక ప్రభుత్వానికి సూచించిన మాజీ సీఎమ్)