కర్ణాటక ప్రభుత్వానికి సూచించిన మాజీ సీఎమ్‌

Kumaraswamy Said Bengaluru Should be Shut Down for 20 Days - Sakshi

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. వైరస్‌ కట్టడి కోసం యడ్యూరప్ప సర్కారు మరోసారి లాక్‌డౌన్ ప్రకటించింది. సోమవారం బెంగళూరులోని ఐదు ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు తెలిపింది. అయితే కర్ణాటక సర్కారు తీసుకున్న నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ట్విట్టర్ ద్వారా స్పందించారు. కేవలం ఐదు ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తే ప్రయోజనం ఉండదని.. బెంగళూరు మొత్తం 20 రోజుల పాటు లాక్‌డౌన్ విధించాలి అని ఆయన ప్రభుత్వాన్నికోరారు. లాక్‌డౌన్‌ అమలులో కఠినంగా వ్యవహరించకపోతే.. బెంగళూరు మరో బ్రెజిల్ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ కంటే ప్రజల జీవితాలు చాలా ముఖ్యమైనవి అని కుమారస్వామి  వరుస ట్వీట్లు చేశారు.

ప్రస్తుత సమయంలో కార్మికులకు నిత్యావసర సరుకులతోపాటు, రూ.5వేల ఇవ్వాలని కుమారస్వామి కర్ణాటక సర్కారును విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ వారికి ఏమాత్రం సరిపోదన్నారు. కార్మికులకు అవసరమైన సాయాన్ని వెంటనే అందించాలని కుమారస్వామి కోరారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top