నిజామాబాద్ జిల్లా పడిగల్‌లో రూ. 30.80 కోట్లతో స్పైస్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలో స్పైస్ పార్క్: పోచారం
Jan 4 2017 12:30 PM | Updated on Oct 17 2018 6:06 PM
	హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా పడిగల్‌లో రూ. 30.80 కోట్లతో స్పైస్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా బుధవారం ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. రూ. 30.80 కోట్ల వ్యయంతో నిజామాబాద్ జిల్లా పడిగల్‌లో స్పైస్ పార్క్ ఏర్పాటు చేస్తామని.. అందులో పసుపు తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు రైతాంగానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
