నగలతో సహా విద్యార్థిని కిడ్నాప్ ! | Student kidnapping in tamil nadu | Sakshi
Sakshi News home page

నగలతో సహా విద్యార్థిని కిడ్నాప్ !

Feb 1 2015 12:03 PM | Updated on Nov 9 2018 5:02 PM

నగలతో సహా విద్యార్థిని కిడ్నాప్ ! - Sakshi

నగలతో సహా విద్యార్థిని కిడ్నాప్ !

విద్యార్థినితోపాటు 50 సవర్ల బంగారాన్ని కిడ్నాప్ చేసిన దుండగుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

తిరువొత్తియూరు: విద్యార్థినితోపాటు 50 సవర్ల బంగారాన్ని కిడ్నాప్ చేసిన దుండగుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. కన్యాకుమారి జిల్లా ఆరల్ వాయ్ మొళి, తాళ్‌కుడి సౌత్ వీధికి చెందిన దివ్య (19). ఈమె నాగర్‌కోవిల్‌లోని ఓ కళాశాలలో ద్వితీయ సంవత్సరం డిగ్రీ చదువుతోంది. 23వ తేదీ సాయంత్రం పక్కింటిలో ఉన్న స్నేహితురాలి వద్దకు వెళుతున్నట్టు చెప్పి వెళ్లింది. కాని తరువాత దివ్య ఇంటికి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు, బంధువులు, ఆమె కోసం అన్ని చోట్ల గాలించారు.
 
 దీనిపై తల్లిదండ్రులు విచారణ చేయగా దివ్యను అదే ప్రాంతానికి చెందిన స్వయంభులింగం అనే వ్యక్తి కిడ్నాప్ చేసినట్టు తెలిసింది. దీనిపై విద్యార్థి తండ్రి ఆరోగ్యస్వామి ఆరల్‌మొలి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో తన కుమార్తెను స్వయంభులింగం మాయ మాటలు చెప్పి 50 సవర్ల నగలతో కిడ్నాప్ చేసినట్టు పేర్కొన్నారు. ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి విద్యార్థిని కోసం గాలిస్తున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement