పులి దర్శకుడిపై అతిలోకసుందరి ఫైర్ | Sridevi fire on Simbudevan | Sakshi
Sakshi News home page

పులి దర్శకుడిపై అతిలోకసుందరి ఫైర్

Sep 13 2015 1:56 AM | Updated on Sep 5 2018 9:45 PM

పులి దర్శకుడిపై అతిలోకసుందరి ఫైర్ - Sakshi

పులి దర్శకుడిపై అతిలోకసుందరి ఫైర్

పులి చిత్ర దర్శకుడిపై అతిలోక సుందరి ఫైర్ అయ్యారన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం. ఎవర్‌గ్రీన్ హీరోయిన్ శ్రీదేవి నటనకు విరామం ఇచ్చి పెళ్లి,

 పులి చిత్ర దర్శకుడిపై అతిలోక సుందరి ఫైర్ అయ్యారన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం. ఎవర్‌గ్రీన్ హీరోయిన్ శ్రీదేవి నటనకు విరామం ఇచ్చి పెళ్లి, పిల్లలు అంటూ సంసార జీవితంలో గడిపి సుమారు 25 ఏళ్ల తరువాత మళ్లీ నటన వైపు మొగ్గ చూపిన విషయం తెలిసిందే. ఆమె హిందీలో నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రం దక్షిణాదిలోనూ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ తరువాత చిన్న విరామం తీసుకుని ఈ సారి తమిళంలో విజయ్ హీరోగా నటిస్తున్న భారీ సోషియోఫాంటసీ కథా చిత్రం పులిలో ప్రధాన పాత్ర పోషించారు. పీటీ.సెల్వకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శింబుదేవన్ దర్శకుడు. హన్నిక,శ్రుతీహాసన్ కథానాయికలుగా నటించారు.
 
  షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న పులి ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.అక్టోబర్ ఒకటవ తేదీన విడుదలకు నిర్మాత లు సన్నాహాలు చేస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదలకు ముస్తాబవుతున్న ఈ చిత్రంలో తన పాత్రకు శ్రీదేవి మూడు భాషల్లోనూ తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. తమిళంలో దాదాపు మూడు దశాబ్దాల తరువాత నటిస్తున్న చిత్రం కావడంతో శ్రీదేవి పులి చిత్రంపై ప్రత్కేక దృష్టి సారిస్తున్నారు. తన గెటప్, మేకప్ విషయాల్లోనూ చాలా కేర్ తీసుకున్నారు.
 
  రాణి గెటప్ కోసం చాలా సమయం తీసుకుని తయారయ్యేవారట. చిత్రానికి కాల్‌షీట్స్ కూడా ఎక్కువే కేటాయించినట్లు తెలిసింది. ఇక చిత్రానికి డబ్బింగ్ చెప్పడానికి అదనంగా పారితోషిం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ విషయంలో చిత్ర నిర్మాత ఆమెతో చర్చించినట్లు తెలిసింది. చిత్రానికి డబ్బింగ్ చెప్పిన శ్రీదేవి తాను నటించిన కొన్ని సన్నివేశాలు లేకపోవడంతో అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు చిత్ర దర్శకుడి నిలదీశారట. చిత్ర నిడివి ఎక్కువ అవ్వడంతో కొన్ని సన్నివేశాలను తొలగించినట్లు దర్శకుడు శింబు దేవన్ వివరించడంతో అతిలోక సుందరి ఆయనపై ఫైర్ అయినట్లు కోలావుడ్ వర్గాల టాక్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement