స్నేహకు సీమంతం | Sneha's baby shower | Sakshi
Sakshi News home page

స్నేహకు సీమంతం

Jun 20 2015 2:24 AM | Updated on Apr 3 2019 9:16 PM

స్నేహకు సీమంతం - Sakshi

స్నేహకు సీమంతం

నటి స్నేహ సీమంతం వేడుకను ఇటీవల తన భర్త ప్రసన్న సమక్షంలో ఆనందంగా జరుపుకున్నారు. బహుభాషా నటి స్నేహ నాయకిగా అన్ని రకాల పాత్రలు

 నటి స్నేహ సీమంతం వేడుకను ఇటీవల తన భర్త ప్రసన్న సమక్షంలో ఆనందంగా జరుపుకున్నారు. బహుభాషా నటి స్నేహ నాయకిగా అన్ని రకాల పాత్రలు ధరించిన హోమ్లీ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అతి తక్కువమంది నటీమణుల్లో ఈమె ఒకరు అని చెప్పక తప్పదు. తమిళంలో విరుంబుగిరేన్ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమయిన స్నేహ చక్కని అందంతో అంతకుమించిన అభినయంతో చిత్ర ప్రముఖులను ఆకర్షించారు. ఆ తరువాత కమలహాసన్, విజయ్, అజిత్ మొదలగు ప్రముఖ హీరోలందరితోనూ నటించారు.
 
 అలాగే తెలుగులో బాలకృష్ణ, నాగార్జున, శ్రీకాంత్ ఇలా సీనియర్ నటుల నుంచి యువ నటులందరితోను నటించి పేరు తెచ్చుకున్నారు. అచ్చముండు అచ్చముండు చిత్ర షూటింగ్ సమయంలో ఆ చిత్ర హీరో ప్రసన్నతో ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమ పెళ్లికి దారి తీయడంతో 2012లో ప్రేమికుడితో పెళ్లి పీటలెక్కారు. ఆ తరువాత కూడా అడపాదడపా చిత్రాల్లో నటిస్తూ వచ్చారు. కాగా గర్భం ధరించిన స్నేహ నవమాసాలు మోస్తున్నారు. త్వరలో అమ్మ కాబోతున్న స్నేహ ఇటీవల నగరంలోని ఒక స్టార్ హోటల్‌లో సీమంతం వేడుకలను నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి బంధుమిత్రులకు, అత్యంత సన్నిహిత సినీ ప్రముఖలను ఆహ్వానించినట్లు నటుడు ప్రసన్న పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement