పిచ్చికుక్క స్వైరవిహారం | Rampaging mad dog | Sakshi
Sakshi News home page

పిచ్చికుక్క స్వైరవిహారం

Mar 7 2016 3:15 AM | Updated on Sep 3 2017 7:09 PM

పిచ్చికుక్క స్వైరవిహారం

పిచ్చికుక్క స్వైరవిహారం

సండూరు తాలూకాలోని తోరణగల్లు గ్రామంలో ఆదివారం ఓ పిచ్చి కుక్క స్వైరవిహారం

తోరణగల్లు : సండూరు తాలూకాలోని తోరణగల్లు గ్రామంలో ఆదివారం ఓ పిచ్చి కుక్క స్వైరవిహారం చేసి వరుసగా ఎనిమిది మందిపై దాడి చేసింది. ఆదివారం ఉదయం తోరణగల్లు గ్రామంలోని పంచాయితీ కార్యాలయం వద్ద ఓ పిచ్చి కుక్క ఎదురుగా వచ్చిన బాలలపై తీవ్రంగా దాడి చేస్తూ పరుగెత్తింది. ఈ పిచ్చికుక్క దాడిలో మొత్తం ఎనిమిది మంది పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు.  గాయపడిన సుంకన్న, సుబ్బలక్ష్మి తనయుడు సునీల్ (5)లను విమ్స్ ఆసుపత్రికి తరలించారు.

మరో ముగ్గురిని విమ్స్‌కు, మిగిలిన వారిని జిందాల్ సంజీవిని, తోరణగల్లు ప్రభుత్వాసుపత్రుల్లో చేర్పించారు. పిచ్చికుక్కను గ్రామస్తులు కొట్టి చంపేశారు. తోరణగల్లులో కుక్కలు విపరీతంగా ఉన్నాయి. పగటిపూట సైతం హెచ్చెల్సీ కాలువ వైపు ఒంటరిగా వెళ్తున్న వారిపై దాడి చేసి గాయపరుస్తున్నాయని స్థానికులు సాక్షికి తెలిపారు. అయితే పంచాయతీ అధికారులు కుక్కల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని వారు మండిపడ్డారు.
 

Advertisement
 
Advertisement
Advertisement