అయ్యో పాపం | Sakshi
Sakshi News home page

అయ్యో పాపం

Published Thu, Jun 23 2016 1:23 AM

Mad dog attack on infant

చిన్నారిపై పిచ్చికుక్క దాడి
ప్రాణాపాయ స్థితిలో   బాధితురాలు

 

మధురానగర్ : పాలప్యాకెట్ తీసుకువచ్చేందుకు బయటకు వెళ్లిన చిన్నారిపై పిచ్చి కుక్క దాడిచేసింది. తీవ్రంగా గాయపడిన బాలిక అపస్మారకస్థితికి చేరుకుంది.  53వ డివిజన్ దేవీన గర్‌లో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దేవీనగర్ బుడమేరుకు చెందిన ముద్రబోయిన నాగరాజు, గంగ దంపతులకు ఒక అమ్మాయి, కుమారుడు ఉన్నారు. బుధవారం ఉదయం పాలప్యాకెట్ కోసం నాగరాజు కుమార్తె ముద్రబోయిన వెన్నెల పాలబూత్‌కు వెళ్లింది. పాలప్యాకెట్ తీసుకువ స్తుండగా పిచ్చికుక్క మీదపడి ఇష్టారాజ్యంగా కరవడంతో వెన్నెల తీవ్రంగా గాయపడింది. ఆమె దేహం రక్తంతో తడిసిపోయింది. ఇది గమనించిన స్థానికులు పిచ్చికుక్కను కర్రలతో కొట్టి చంపారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి చేరుకున్న వెన్నెలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు మూడు రోజులు గడిస్తే కానీ చెప్పలేమనడంతో నాగరాజు కుటుంబంలో విషాధఛాయలు అలుముకున్నాయి.

స్పందించని అధికారులు
వీధి కుక్కల సంచారంపై స్థానికులు భయాందోళన వ్యక్తంచేస్తున్నారు. చీకటిపడితే బయటికి రాలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. వీధికుక్కల దాడికి పలువురు గురైన ఘటనలు ఉన్నాయి. వీధికుక్కల సమస్యపై ‘సాక్షి’లో పలుమార్లు కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై అధికారులు స్పందించి ఉంటే ఈరోజు ఈ ఘటన జరిగి ఉండేది కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ డివిజన్ అధ్యక్షులు ముద్రబోయిన దుర్గారావు నాగరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆస్పత్రికివెళ్లి చిన్నారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తాము అండగా ఉంటామని ఆయన  హామీ ఇచ్చారు.

 

మరో నాలుగు కుక్కలను కరిచింది
వీధి కుక్కల సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. స్పందించలేదు. అధికారు ల నిర్లక్ష్యం వల్ల నేడు ఒక చిన్నారి ప్రాణం మీదకు వ చ్చింది. అప్పుడే స్పందించి తగు చర్యలు తీసుకు ని ఉంటే ఈ పరిస్థితి నెలకొనేది కాదు. వెన్నెలను కరిచిన పిచ్చికుక్క మరో నాలుగు కుక్కలను కరిచి ంది. దీనివల్ల ఆ కుక్కలను సైతం ఇక్కడ నుంచి తరలించి మరోమారు ఇటువంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి.

  - ఎం వెంకట దుర్గారావు, స్థానికుడు

Advertisement
Advertisement