
రజనీ అభిమాని నామినేషన్
రాజ్యసభ ఉప ఎన్నికల్లో రజనీ కాంత్ అభిమాని ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. విరుదునగర్‌కు చెందిన మన్మథన్ రజనీకాంత్ వీరాభిమాని. తమ కథానాయకుడు
చెన్నై, సాక్షి: రాజ్యసభ ఉప ఎన్నికల్లో రజనీ కాంత్ అభిమాని ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. విరుదునగర్‌కు చెందిన మన్మథన్ రజనీకాంత్ వీరాభిమాని. తమ కథానాయకుడు రాజకీయాల్లోకి రావాలని కోరుతూ పలు ఎన్నికల్లో నామినేషన్లు వేయడం పరిపాటిగా మారింది. ఇప్పటి వరకు 35 సార్లు స్వతంత్య్ర అభ్యర్థిగా పలు ఎన్నికల్లో నామినేషన్ వేసి ఈ అభిమాని ఏకంగా బుధవారం రాజ్యసభ రేసులో తాను ఉన్నానంటూ నామినేషన్ వేశారు. అయితే ఎమ్మెల్యేల మద్దతు లేని దృష్ట్యా ఈ నామినేషన్ పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు.