ప్రత్యూష్ బాయ్ఫ్రెండ్ ను విచారించిన పోలీసులు | Pratyusha Banerjee's boyfriend Rahul Raj quizzed for 14 hours relation with her alleged suicide | Sakshi
Sakshi News home page

ప్రత్యూష్ బాయ్ఫ్రెండ్ ను విచారించిన పోలీసులు

Apr 3 2016 11:58 AM | Updated on Sep 3 2017 9:08 PM

ప్రత్యూష్ బాయ్ఫ్రెండ్ ను విచారించిన పోలీసులు

ప్రత్యూష్ బాయ్ఫ్రెండ్ ను విచారించిన పోలీసులు

టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో ఆమె బాయ్ఫ్రెండ్ రాహుల్ రాజ్సింగ్ను ముంబై పోలీసులు సుదీర్ఘంగా విచారించారు.

ముంబై: టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో ఆమె బాయ్ఫ్రెండ్ రాహుల్ రాజ్సింగ్ను ముంబై పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. శనివారం రాజ్సింగ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు 14 గంటల పాటు ప్రశ్నించారు. ప్రత్యూషతో అనుబంధం, ఆమె ఆత్మహత్యకు గల కారణాల గురించి విచారించారు.

ఊపిరి ఆడకపోవడం వల్లే ప్రత్యూష మరణించినట్టు పోస్ట్మార్టం నివేదికలో తేలింది. ప్రత్యూష మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి నేరుగా శ్మశానవాటికను తీసుకెళ్లి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. శుక్రవారం ముంబైలోని ప్లాట్లో ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement