గోవిందా.. గోవిందా.. | prasanna venkateswara swami braharathotsavams celebrations | Sakshi
Sakshi News home page

గోవిందా.. గోవిందా..

May 10 2015 5:16 AM | Updated on Sep 3 2017 1:44 AM

రాయదుర్గం పట్టణంలోని ప్రసన్న వెంకటరమణస్వామి బ్రహ్మరథోత్సవం శనివారం వేలాది మంది భక్తుల మధ్య కన్నలపండువగా నిర్వహించారు.

- కన్నల పండువగా ప్రసన్న వెంకటరమణస్వామి బ్రహ్మరథోత్సవం
 
రాయదుర్గం:
పట్టణంలోని  ప్రసన్న వెంకటరమణస్వామి బ్రహ్మరథోత్సవం శనివారం వేలాది మంది భక్తుల మధ్య కన్నలపండువగా నిర్వహించారు. ఉదయం 11.00 గంటలకు  ప్రత్యేక హోమాలు నిర్వహించి, స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని  రథంపై కొలువు దీర్చారు. అర్చకులు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ మధ్య  తేరువీధి నుంచి వినాయక సర్కిల్ వరకు రథాన్ని లాగారు.  భక్తుల గోవింద నామస్మరణతో ఉత్సవం మారుమోగింది.

ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు, ఎమ్మెల్సీ మెట్టుగోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత పాటిల్ వేణుగోపాల్ రెడ్డి,  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి, వైఎస్సాసీపీ కౌన్సిలర్ పేర్మి బాలాజీ, మున్సిపల్ చైర్మన్ రాజశేఖర్, పురప్రముఖులు, కౌన్సిలర్లు, ఆర్యవైశ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి. రథోత్సవంలో పాల్గొన్నారు.  తిరిగి సాయంత్రం 5 గంటలకు బ్రహ్మ రథోత్సవాన్ని నిర్వహించారు.   కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ చిన్నప్పయ్య, ఇతరపార్టీల నాయకులు ప్రత్యేకపూజలు నిర్వహించి, రథోత్సవంలో పాల్గొన్నారు.  సీఐ భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాయదుర్గం, గుమ్మఘట్ట, కణేకల్లు ఎస్సైలు మహానంది, సురేష్, యువరాజులతో పాటు పోలీసులు గట్టిబందోబస్తు నిర్వహించారు. పట్టణంలోని బళ్లారి రోడ్డులో మూడు రోజుల పాటు జాతర సందర్భంగా వ్యాపారులు వివిధ దుకాణాలను ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement