breaking news
braharathotsavams
-
ఘనంగా లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
కదిరి: అనంతపురం జిల్లా కదిరిలో లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలను ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు స్వామివారి రథోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. అయితే స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్టీసి అధికారులు అత్యుత్సాహంతో చార్జీలు పెంచడంపై భక్తుల నుంచి విమర్శలు వ్యక్తమౌతున్నయి. స్పెషల్ బస్సుల పేరుతో కదిరి వెళ్లే బస్సుల్లో.. టికెట్‌పై అదనపు చార్జీని అధికారులు వసూలు చేస్తున్నారు. -
గోవిందా.. గోవిందా..
- కన్నల పండువగా ప్రసన్న వెంకటరమణస్వామి బ్రహ్మరథోత్సవం రాయదుర్గం: పట్టణంలోని ప్రసన్న వెంకటరమణస్వామి బ్రహ్మరథోత్సవం శనివారం వేలాది మంది భక్తుల మధ్య కన్నలపండువగా నిర్వహించారు. ఉదయం 11.00 గంటలకు ప్రత్యేక హోమాలు నిర్వహించి, స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని రథంపై కొలువు దీర్చారు. అర్చకులు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ మధ్య తేరువీధి నుంచి వినాయక సర్కిల్ వరకు రథాన్ని లాగారు. భక్తుల గోవింద నామస్మరణతో ఉత్సవం మారుమోగింది. ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు, ఎమ్మెల్సీ మెట్టుగోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత పాటిల్ వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి, వైఎస్సాసీపీ కౌన్సిలర్ పేర్మి బాలాజీ, మున్సిపల్ చైర్మన్ రాజశేఖర్, పురప్రముఖులు, కౌన్సిలర్లు, ఆర్యవైశ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి. రథోత్సవంలో పాల్గొన్నారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు బ్రహ్మ రథోత్సవాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చిన్నప్పయ్య, ఇతరపార్టీల నాయకులు ప్రత్యేకపూజలు నిర్వహించి, రథోత్సవంలో పాల్గొన్నారు. సీఐ భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాయదుర్గం, గుమ్మఘట్ట, కణేకల్లు ఎస్సైలు మహానంది, సురేష్, యువరాజులతో పాటు పోలీసులు గట్టిబందోబస్తు నిర్వహించారు. పట్టణంలోని బళ్లారి రోడ్డులో మూడు రోజుల పాటు జాతర సందర్భంగా వ్యాపారులు వివిధ దుకాణాలను ఏర్పాటు చేశారు.