పులి చర్మం స్వాధీనం | Possession of tiger skin | Sakshi
Sakshi News home page

పులి చర్మం స్వాధీనం

Jun 11 2014 3:44 AM | Updated on Aug 21 2018 5:46 PM

పులి చర్మం స్వాధీనం - Sakshi

పులి చర్మం స్వాధీనం

పులి చర్మం విక్రయించడానికి యత్నిస్తున్న వ్యక్తిని ఇక్కడి చెన్నమ్మనే అచ్చుకట్ట (సీకే అచ్చుకట్ట) పోలీసులు అరెస్టు చేశారు.

బెంగళూరు : పులి చర్మం విక్రయించడానికి యత్నిస్తున్న వ్యక్తిని ఇక్కడి చెన్నమ్మనే అచ్చుకట్ట (సీకే అచ్చుకట్ట) పోలీసులు అరెస్టు చేశారు. రామనగరలో నివాసం ఉంటున్న ఇదాయతుల్లా అనే యువ కుడిని అరెస్టు చేసి పులి చర్మం స్వాధీనం చేసుకున్నామని మంగళవారం న గర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ చెప్పారు. విలేకరుల సమావేశంలోఆయన వివరాలు వెల్లడించారు.

పులిని తుపాకితో కాల్చి చంపిన గుర్తు కూడా చర్మంపై ఉందని చెప్పారు. ఉత్తర భారత్‌లో ఈ సంఘటన జరిగిందని, ఆ తరువాత నలుగురు వ్యక్తులు పులి చర్మం కొనుగోలు చేశారన్నారు. అనంతరం ఇదాయతుల్లా దీనిని కొనుగోలు చేసిన ట్లు ఔరాద్కర్ చెప్పారు. కత్రిగుప్ప రింగ్ రోడ్డులోని బస్టాప్ దగ్గర ఇదాయతుల్లా పులి చర్మం విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో నిందితుడిని అరెస్ట్ చేసి పులి చర్మం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement