ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) ఉపకులపతి దినేష్‌సింగ్ మళ్లీ మరో వివాదంలో చిక్కుకుపోనున్నారు.
న్యూఢిల్లీ : ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) ఉపకులపతి దినేష్‌సింగ్ మళ్లీ మరో వివాదంలో చిక్కుకుపోనున్నారు. విశ్వవిద్యాలయంలో జరిగిన అనేక కుంభకోణాల్లో సింగ్ ప్రమేయం ఉందంటూ సీపీఎం నేత సీతారాం ఏచూరి రాసిన లేఖను కేంద్ర మానవ వనరుల శాఖ... రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి పంపనుంది. కాగా నాలుగేళ్ల అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుపై గత ఏడాది చెలరేగిన వివాదంలో దినేష్‌సింగ్ కూరుకుపోయిన సంగతి విదితమే. రాష్ట్రపతి ఆమోదముద్ర లేనందువల్ల ఆ కోర్సును ఉపసంహరించుకోవాలంటూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ.. అప్పట్లో వీసీని ఆదేశించిన సంగతి విదితమే. తన కార్యాలయాన్ని వీసీ దుర్వినియోగం చేసిన కారణంగా విద్యార్థులు ఇబ్బందులకు గురవడమే కాకుండా, పాలనాపరంగా కూడా అనేక సమస్యలు తలెత్తాయంటూ ఢిల్లీ విశ్వవిద్యాలయం అధ్యాపకుల సంఘం (డ్యూటా) విడుదల చేసిన శ్వేతపత్రాన్ని ...సీపీఎం నేత సీతారాం ఏచూరి తన లేఖకు జత చేశారు.