వసంత్ దర్శకత్వంలో పార్వతీ మీనన్ | Parvathi Menon in Vasanth Direction | Sakshi
Sakshi News home page

వసంత్ దర్శకత్వంలో పార్వతీ మీనన్

May 18 2015 2:53 AM | Updated on Sep 3 2017 2:14 AM

వసంత్ దర్శకత్వంలో పార్వతీ మీనన్

వసంత్ దర్శకత్వంలో పార్వతీ మీనన్

వైవిధ్యభరిత కథా చిత్రాల దర్శకులు పేర్లతో వసంత్ పేరు కచ్చితంగా ఉంటుంది. కేలడీ కణ్మణి, నీ పాది నాన్ పాది, ఆశై, నేరుక్కునేర్,

వైవిధ్యభరిత కథా చిత్రాల దర్శకులు పేర్లతో వసంత్ పేరు కచ్చితంగా ఉంటుంది. కేలడీ కణ్మణి, నీ పాది నాన్ పాది, ఆశై, నేరుక్కునేర్, రిథం లాంటి పలు విభిన్న కథా చిత్రాలు సృష్టికర్త వసంత్. దివంగత ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్ శిష్యుడైన ఈయన చివరి చిత్రం మూండ్రుపేర్ మూండ్రు కాదల్. తాజాగా తన్నీర్ అనే మరో వైవిధ్యభరిత కథా చిత్రాన్ని సెల్యులాయిడ్‌పై కెక్కించడానికి సిద్ధం అయ్యారు వసంత్.
 
 ఇది ప్రముఖ రచయిత అశోక్ మిత్రా రాసిన నవల ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం. ఇందులో కథానాయకి పాత్రకు నటి పార్వతి మీనన్ అయితే పక్కాగా నప్పుతుందని వసంత భావించినట్లు తెలిసింది. పార్వతి మీనన్ ఇంతకుముందు పూ మరియన్ చిత్రాల్లో నటించి గుర్తింపు పొం దారు. ఇటీవల విడుదలైన ఉత్తమవిలన్ చిత్రంలో కమల్ కూతురిగా నటిం చారు.  మంచి పాత్రల కోసం తాపత్రయపడే పార్వతి చిత్రం తన్నీర్ ద్వారా మరోసారి తన సత్తా చాటుకోనున్నారన్న మాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement