బలోపేతమే లక్ష్యం: కనిమొళి | party strengthen my Goal : Kanimozhi | Sakshi
Sakshi News home page

బలోపేతమే లక్ష్యం: కనిమొళి

Apr 13 2015 2:23 AM | Updated on Sep 3 2017 12:13 AM

ప్రజల్లో మమేకమై బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుదామని మహిళా నేతలకు డీఎంకే మహిళా విభాగం

సాక్షి, చెన్నై : ప్రజల్లో మమేకమై బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుదామని మహిళా నేతలకు డీఎంకే మహిళా విభాగం కార్యదర్శి, ఎంపీ కనిమొళి పిలుపు నిచ్చారు. ఈ మేరకు ఆదివారం అరివాలయంలో ఆమె మహిళా విభాగం నేతలతో భేటీ అయ్యారు. డీఎంకే మహిళా విభాగం నాయకులతో కనిమొళి ఉదయం గంటన్నర పాటుగా భేటీ అయ్యారు. ఆ విభాగం బలోపేతం, మహిళ మన్ననలు అందుకునే రీతిలో కార్యక్రమాల నిర్వహణ, అధినేత ఎం కరుణానిధి పుట్టినరోజు నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు.
 
 ఇక ప్రతి మహిళా విభాగం నాయకురాలు, కార్యకర్త ప్రజల్లో మమేకమై బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. అనంతరం మీడియాతో కనిమొళి మాట్లాడుతూ, తిరుపతి శేషాచలం ఎన్‌కౌంటర్‌పై స్పందించారు. పరిస్థితిని అర్థం చేసుకుని ఏపీ ప్రభుత్వం వ్యవహరించాల్సి ఉందన్నారు. పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలు దెబ్బతినే విధంగా వ్యవహరించ కూడదని హితవు పలికారు. వ్యవసాయ శాఖ ఇంజనీరింగ్ అధికారి ముత్తుకుమార స్వామి మరణం వెనుక ఉన్న మిస్టరీ బయటకు రావాలంటే కేసును సీబీఐకు అప్పగించాల్సిందేని, ఇందు కోసం డీఎంకే మహిళా విభాగం ఉద్యమించబోతోందన్నారు.
 
 అదుపులో..
 ముత్తుకుమార స్వామి మృతి కేసులో ఇప్పటికే మాజీ మంత్రి అగ్రి కృష్ణమూర్తి, ఇంజనీరింగ్ అధికారి సెంథిల్‌కుమార్‌లను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం అగ్రి అసిస్టెంట్ వందవాసికి చెందిన వెంకటేషన్‌ను అదుపులోకి తీసుకుని సీబీసీఐడీ వర్గాలు విచారిస్తున్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement